కార్మిక మంత్రినవుతానని అనుకోలేదు: దత్తాత్రేయ
హైదరాబాద్/మొయినాబాద్, జనవరి 18: తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. ఆదివారం మొయినాబాద్‌లో రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరైన ఆయన మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ మునిగిపోయే పార్టీలని, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై అప్పటి వరకు ప్రజా వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రత్యామ్నాయ పార్టీగా మిగిలేది బీజేపీ ఒక్కటేనన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ప్రత్యేక పాత్ర పోషించిందని, బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి కృషి చేద్దామన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ నాయకత్వం కంటే బీజేపీ నాయకత్వమే పటిష్ఠంగా ఉందని చెప్పారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తాను కేంద్ర మంత్రి కావడం బీజేపీ పుణ్యమేనని అన్నారు. దేశంలో ఆన్‌లైన్ ద్వారా 10 కోట్ల సభ్యత్వం చేసిన పార్టీ బీజేపీ ఒక్కటే అని తెలిపారు. కాగా, తాను కేంద్ర కార్మిక శాఖ మంత్రిని అవుతానని అనుకోలేదని, ఏ పట్టణాభివృద్ధి శాఖో, మరో శాఖో ఇస్తారని అనుకున్నానని దత్తాత్రేయ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయనను భారతీయ జనతా మజ్దూర్ మోర్చా నాయకులు సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. తాను కార్మిక పక్షపాతిగా ఉంటానని, కార్మిక సమస్యలను పరిష్కరించడంలో శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కార్మిక శాఖకే అనుసంధానమై ఉందని, ఈ దిశగా దత్తన్న తప్పకుండా కృషి చేస్తారని అన్నారు.

No comments:
Post a Comment