Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Sunday, 18 January 2015

నీకోసం కనురెప్పల పందిరి వేస్తా..


జీవితంలోని వైరుధ్యాల్ని అద్భుతంగా చిత్రించిన ఒక మహా కళాఖండమే ‘పాకీజా’. ఇందులోని ‘మౌసమ్‌ హై ఆశికానా’ అన్న పాటను కూడా ఈ సినిమా నిర్మాత, దర్శకుడు కమల్‌ అమ్‌రోహియే రాశాడు. గులామ్‌ మహ్మద్‌ స్వరకల్పనలో లతా మంగేష్కర్‌ పాడిన ఈ పాట నాట్య వై భవానికి ప్రాణం పోసింది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ కొత్తగా అనిపించే ఈ పాటలో అంతటి విశేషాలు ఏమున్నాయో ఎవరికి వారు స్వయంగా తెలుసుకోవాల్సిందే...!
’మౌసమ్‌ హై ఆశికానా
ఏ దిల్‌ కహీఁ సే ఉన్‌కో ఐసే మే డూండ్‌ లానా
(ప్రేమపూర్ణమైన వాతావరణమిది
హృదయమా..శ్రీ ఆయన ఎక్కడున్నా వెతికి తీసుకురా)
మనసు కల్లోలంగా ఉన్నప్పుడు మనోవేత్తల్ని, తత్వవేత్తల్ని కలవాలనిపిస్తుంది. అదేమీ లేకుండా, హృదయం ప్రేమాన్వితంగా ఉన్నప్పుడు ఎంత దూరంలో ఉన్నా సరే తన ప్రేమమూర్తి చెంతకు చేరాలనిపిస్తుంది. గాలితోనో మేఘాలతోనో కాకుండా అతన్ని వెంట తీసుకు వచ్చే బాధ్యతను మనసుకే అప్పచెప్పాలనిపిస్తుంది. లోకంలో మనకు మనసును మించిన నమ్మకస్తులు మరెక్కడా ఉండరుగా!
క హెనా కే రుత్‌ జవాఁ హై- హమ్‌ తరస్‌ రహే హైఁ
కాలీ ఘటా కే సాయే- విరహన్‌ కో డస్‌ రహే హైఁ
డర్‌ హై నా మార్‌ డాలే- సావన్‌ కా క్యా ఠికానా / మౌసమ్‌ హై/
(ఈ రుతువు యవ్వనంలో ఉంది- నేను తపనతో ఉన్నానని చెప్పు. నీలి మబ్బుల నీడలు ఒంటరితనాన్ని చొరబెడుతున్నాయని చెప్పు. ఈ పరిస్థితి నా ప్రాణాలు తీస్తుందో ఏమో- ఈ వర్షరుతువుకు నిలకడా ఏమన్నానా?)
పచ్చలారవోసే రుతువులు పరవశంలో ముంచేస్తాయి. వాటి చెంతనే తిరుగాడే మనసేమో అయినవాళ్లకోసం అర్రులు చాస్తుంది. ఆ స్థితిలో ఆకాశాన్ని చూస్తే హాయిగా ఉంటుంది. అయితే, కారుమబ్బులేవో వచ్చి ఆకాశం కనపడకుండా పోతే, మనసంతా ఏకాకితనంలో కూరుకుపోయి తీవ్రమైన భయాందోళనలకు గురవుతుంది. రుతువులు ఈ కాసేపు హాయిగొలపవచ్చు. వర్షపు జల్లులేవో వచ్చి మనసును పులకింపచేయవచ్చు. కానీ, ఇవన్నీ ఎప్పుడు తమ స్వరూప స్వభావాల్ని మార్చుకుని ఏ క్షణాన భయానకంగా మారతాయో ఎవరికి తెలుసు? అందుకే కదా! ఎల్లవేళలా తోడుగా ఉండి, చెదరని చిరునవ్వుతో నీడలా నడిచే ప్రియతముడి కోసం మనసు ఉవ్విళ్లూరుతుంది?
సూరజ్‌ కహీఁ భీ జాయే- తుమ్‌ పర్‌ న ధూప్‌ ఆయే
తుమ్‌ కో పుకార్‌తే హైఁ ఇన్‌ గేసువోఁ కే సాయే
ఆజావో మై బనాదూఁ పల్‌కోఁ కా శామియానా / మౌసమ్‌ హై/
(సూర్యుడు ఎటైనా వెళ్లనీ. నీ మీద మాత్రం ఎండ పడకూడదు. నిన్ను ఈ ముంగురుల నీడలు నిన్ను పిలుస్తున్నాయి. ఇంక వచ్చేసెయ్‌ నీకోసం కనురెప్పల పందిరి వేస్తా)
ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎన్ని వడగాలులూ, సుడిగాలులూ వీచినా తన ప్రేమమూర్తిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలని కదా అనిపిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలే కాదు మానవ విద్రోహాలు కూడా అతన్ని దరిచేరకూడదనుకుంటుంది మనసు. అసలా పరిస్థితే రాకుండా తన చెంతకు చేర్చుకోవడానికి మనసే కాదు తనువులోని అణువణువూ ఎదురుచూస్తుంది. ఈ ప్రేమికను చూడండి. ఎండకన్నయినా పడకుండా తన ప్రియతముణ్ని తన కనురెప్పల పందిరి కింద పదిలంగా దాచుకోవాలనుకుంటోంది.
ఫిర్‌తే హై హమ్‌ అకేలే- బాహోంమే కోయీ లేలే
ఆఖిర్‌ కోయీ కహాఁ తక్‌ తన్‌హాయియోఁ సే ఖేలే
దిన్‌ హోగయే హై జాలిమ్‌, రాతే హై కాతిలానా / మౌసమ్‌ హై/
(ఒకరు నన్ను ఒడిలోకి తీసుకుంటారని.. ఇలా ఒంటరిగా తిరుగుతున్నా. ఎవరైనా ఎంతకాలమని ఒంటరితనంతో ఆడుకుంటారు? పగళ్లు క్రూరమైపోయాయి. రాత్రుళ్లు ప్రాణాంతకంగా మారాయి)
కొన్నిసార్లు లోకం ఎంత మనోహరంగానో ఉంటుంది. కానీ, ఉన్నట్లుండి ఒక్కోసారి పరమశత్రువుగా మారిపోతుంది. అప్పటిదాకా ఎలా ఉన్నా ఒకసారి శత్రుశిబిరంలో ఇరుక్కుపోయామని తెలిసిన తర్వాత భయంకరమైన ఏకాకితనం బాధిస్తుంది. పగళ్లన్నీ ప్రతీకారాలకోసం చూడటం, రాత్రుళ్లన్నీ ఏవో రాక్షస కృత్యాలకు సిద్ధంకావడం ప్రత్యక్షంగా చూస్తాం. ఆ సమయంలో తనను కాపాడే తన ప్రియతముని కోసం హృదయం వేయికళ్లతో ఎదురు చూస్తుంది.
యే రాత్‌ యే ఖామోశీ- యే ఖ్వాబ్‌ యే నజారే
జుగ్నూ హై యా జమీఁ పర్‌ ఉత్‌రే హుయే హై తారే
బేఖ్వాబ్‌ మేరి ఆంఖేఁ మద్‌హోశ్‌ హై జమానా / మౌసమ్‌ హై/
(ఈ రేయి, ఈ నిశ్శబ్దాలు- ఈ స్వప్నాలు, ఈ సుందర దృశ్యాలు. మిణుగురులా? లేక నేలపై దిగిన నక్షత్రాలా? నా కళ్లకు నిదురే కరువయ్యింది. లోకమేమో మత్తులో ఊగిపోతోంది)
లోకమంతా ఎంత మనోహరంగా ఉంటేనేమిటి? ప్రకృతి సౌందర్యాలు ఎన్ని కలలకు నెలవైతేనేమిటి? ఆకాశంలోని నక్షత్రాలన్నీ భూలోక సంచారానికి దిగివస్తేనేమిటి? తన హృదయ చక్రవర్తి, తన ప్రేమమూర్తి దూరదూరంగానే ఉండిపోతే తనకు నిదురెలా పడుతుంది? అదేమిటో గాని, కంటి మీద కునుకేలేక తానిలా అల్లాడిపోతుంటే లోకానికేమీ పట్టనట్లు లోకం తనదైన మత్తులో ఊగిపోతోంది. అయినా బాహ్యలోకం ఎంత బాగుంటేనేమిటి? ఎలా ఉంటేనేమిటి? మనోలోకాన్ని మహిమాన్వితం చేసే ప్రియతముని రాకకోసం ఎదురుచూడాల్సిందే కదా! అతన్ని రమ్మని కబురంపాల్సిందే కదా! దానికోసం ఎవరెవరో ఎందుకు? రాయబారం చేయడానికి మనసునే నియమించడం అన్ని విధాలా ఉత్తమం. పైగా మనసును మించిన మహావేగం ప్రపంచంలో మరిదేనికీ లేదు కదా మరి!

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks