జిల్లాలోని 9 నియోజకవర్గాల్లోని గ్రామీణ రోడ్ల నిర్మాణాలకుగానూ ప్రభుత్వం రూ. 153 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ పనులను తక్షణమే చేపడతామని ఆయన వెల్లడించారు. 9 నియోజక వర్గాల్లోని సుమారు 271 కిలో మీటర్ల పంచాయతీ రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, పరిగి, తాం డూరు, వికారాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 143 పనులకుగానూ ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. తాండూరు నియోజక వర్గానికి రూ. 53.5 కోట్లు, వికారాబాద్ నియోజక వర్గానికి రూ. 20.4 కోట్లు, మహేశ్వరం నియోజక వర్గానికి రూ. 20.88 కోట్లు, చేవెళ్ల నియోజక వర్గానికి రూ. 21.8 కోట్లు, పరిగి నియోజక వర్గానికి రూ. 5.6 కోట్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రూ. 5 కోట్లు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రూ. 5 కోట్లు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 3.5 కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. జిల్లాలోని మిగిలిపోయిన రోడ్లను కూడా బీటీ రోడ్లుగా మారుస్తామని ఆయన చెప్పారు. పనులన్నీ నాణ్యతతో జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపా


No comments:
Post a Comment