అధికారుల కసరత్తు
సొంత టీం కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు
నివేదికలతో నిఘా అధికారులు
జిల్లాలో ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం అయ్యింది. మండలం నుంచి జిల్లాస్థాయి వరకు బదిలీలు చేయనున్నారు. ఈమేరకు అ ధికారులు కసరత్తు చేస్తున్నా రు. జిల్లాలోని ఎమ్మెల్యేలు త మ నియోజకవర్గంలో సొంత టీం ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ని వివిధ శాఖలలో పని చే స్తున్న జూనియర్ అసిస్టేంట్ నుంచి శాఖాధిపతి వరకు బ దిలీ కానున్నారు. కేంద్ర ప్ర భుత్వం కమలానాథన్ కమి టీ సిఫారస్‌లకు ఆమోదం తె లిపింది. ఈ సిఫారస్‌లకు అ నుగుణంగా ఏరాష్ట్రానికి చెందిన గ్రూప్‌వన్ అధికారులు, ఆ క్యాడర్‌కు చెందిన ఇతర శాఖల అధికారులు బదిలీ కానున్నారు. వారు బదిలీ రెండు నెలలోపు పూర్తికానుంది. వీరి విభజనతో పాటు వివిధ శాఖలలో పనిచేస్తు న్న ఉద్యోగులు కూడా ఆ రాష్ట్రాలకు కేటాయిస్తారు. రెండు రాష్ట్రాల క్యాడర్ స్టేంత్ ప్రకారం అధికారులను, ఉద్యోగులను విభజిస్తారు. ఈ పక్రియతో పాటే జిల్లా అధికారులను బదిలీ చేస్తారు. రెండు నెలలలోపు అన్ని బదిలీలు జ రగే అవకాశం ఉండటంతో ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండడంతో కీల క పోస్టులలో పనిచేసే అధికారులను నియమించాలని సీఎంతో పాటు, మంత్రులు భావిస్తున్నారు. అలాంటి అఽధికారులకు తప్పనిసరి గా ఈ బదిలీలలో కీలక పోస్టులలో నియమించనున్నారు. జిల్లాలో మండల, డివిజన్ స్థాయిలో చాలా ఏళ్ల నుంచి అధికారులు పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు వెనుకబడిన ప్రాంతంలో పనిచేస్తుండగా, మరికొంతమంది అఽభివృద్ధి చెందిన ప్రాంతంలో పని చేస్తున్న వీరు బదిలీ కోరుతున్నారు.
మండల, డివిజన్ స్థాయిలో పనిచేస్తున్న మరి కొంతమంది అధికారులకు పదోన్నతులు రానున్నాయి. వీరంతా కీలక పోస్టులపై కన్నెశారు. తమకు సన్నిహితంగా ఉన్న నాయకు లు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రయత్నాలు చే స్తున్నారు. జిల్లాలో ఈ సారి ఎమ్మెల్యేల, ఎం పీలలో కొత్తవారే ఎన్నికయ్యరు. వీరు జిల్లా పాలనపై తమ పట్టు ఉండే విధంగా చూస్తున్నారు. తమ నియోజక వర్గంలో కీలకమైన స్థానాలలో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులలో నచ్చిన అధికారులను తెచ్చుకున్న వారు ప్రస్తుతం రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, సాగునీటిశాఖ, ఆర్‌డబ్ల్యూఎన్, ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్ శాఖలలో పై దృష్టి పెట్టారు. మిషన్ కాకతీ య, వాటర్‌గ్రిడ్, రోడ్ల అభివృద్ధికే కోట్ల రూపాయల నిధులు వస్తుండటంతో వారు పనులు చేసే అధికారుల కోసం చూస్తున్నారు. తమకు పనిచేసే అధికారులను ఇవ్వాలని మరీ ము ఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ముఖ్యంగా తమకు అను కూలంగా ఉన్నవారినే ఆయా శాఖలకు అధికారులుగా నియమించాలని కో రుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న అఽధికారు లు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, ఆయా నియోజకవర్గాలలో తాము ఇప్పటి వరకు ఎలా సహకరించమో అంటూ వివరిస్తున్నారు. ఇందులో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ కొకసారి అవకాశం ఇవ్వాలని మరీ వారు కో రుతున్నారు. దీనిలో భాగంగా నిత్యం వారిని కలుస్తున్నారు. కొంతమంది అధికారులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. వారు కోరుకున్న స్థానాలలో అవకాశం లేదు.
ఫ ఇంటలిజెన్స్ నివేదికలు
జిల్లాలోని కీలక శాఖలలో పనిచేస్తున్న శాఖాధికారులు, డివిజన్ స్థాయి అధికారుల పై నిఘా అధికారులు నివేధికలు తయారు చేశారు. ప్రభుత్వానికి పంపించారు. వారు జిల్లాలో ఏఏ పనులు చేశారో వివరించారు. కీలక స్థానాలను కేటాయించే సమయంలో వాటిని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. దీంతో జిల్లా మొత్తంగా రెండు నెలల తరువాత అన్ని మండలాల్లో కొత్త అధికారులు ఉండే అవకాశం ఉంది.


No comments:
Post a Comment