ఉదయం 11 గంటలకు ప్రారంభం
కార్యక్రమానికి ప్రముఖుల హాజరు
మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులను గెలుచుకోవాలి
నిర్వాహకులు శ్రీ సరస్వతీ హైస్కూల్,
యూనివర్సల్ జిమ్
మెదక్/ అర్బన్/ దుబ్బాక: ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’, సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీ పవర్డ్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు, బెంగళూరు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు మెదక్ పట్టణంలోని శ్రీసరస్వతీ కాన్వెంట్ హైస్కూల్, అజంపుర, దుబ్బాకలు వేదికయ్యాయి. ఆదివారం ఉదయం 11 గంట లకు ముగ్గుల పోటీలను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెదక్‌లో ఈ పోటీలను శ్రీ సరస్వతీ కాన్వెంట్ హైస్కూల్, దుబ్బాకలో యూనివర్శల్ జిమ్ సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. పాల్గొనదలచిన మహిళలు ముగ్గు, రంగులు, వగైరా సామగ్రిని వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొనే మహి ళలు రిజిసే్ట్రషన్ కౌంటర్‌లో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. ప్రారంభమైన 2 గంటల వ్యవధిలోనే ముగ్గును పూర్తి చేయాల్సి ఉంటుంది. విజేతల ఎంపికలో జడ్జి లదే తుది నిర్ణయం. విజేతలకు మొదటి బహుమతిగా 5వేల రూపాయాలు, రెండో బహుమతి రూ.3 వేలు, మూడో బహుమతి రూ.2వేలను అందజేస్తారు. ఔత్సాహిక మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని బహుమతులను అందుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. మెదక్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఆర్డీవో మెంచు నగేశ్‌గౌడ్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంఈవో నరేష్‌లు ముఖ్య అతిథులుగా, దుబ్బాకలో నిర్వహించే కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, ఎంపీపీ ర్యాకం పద్మ, జడ్పీటీసీ గౌతమి, పీఏసీఎస్ చైర్మన్ అమ్మన రవీందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.


No comments:
Post a Comment