వేలానికి రెడీ
9.2ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తింపు
సర్కార్‌కు నివేదిక పంపిన యంత్రాంగం!
రెండోదశలో మరిన్ని భూములు
సర్కారీ భూములను వేలానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాస్థాయి అధికారుల నుంచి నివేదికలు తీసుకుంది. తొలివిడతలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో నుంచి సుమారు 9.2 ఎకరాల సర్కారీ స్థలాన్ని సేకరించింది. ఈ నివేదికను రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపింది. దీనిద్వారా సుమారు రూ.230 కోట్ల నిధులు రాబట్టుకోవచ్చనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న, ఎలాంటి వివాదం లేని భూములను గుర్తించాలని నెలరోజుల క్రితం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది. ఇదువరకు ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా ఏలాంటి వివాదం లేని భూములను గుర్తుంచారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల నుంచి 42 స్థలాలను గుర్తించారు. దీనిలో సుమారు 9.20 ఎకరాల భూమి వేలానికి సిద్ధంగా ఉందని అధికారులు నివేదికలు పంపారు. ఇప్పటికే ఈ భూములు ఖాళీగా ఉండగా, దీనికి తోడు వీటికి చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేసి ఉన్నాయి. ప్రస్తుతం గుర్తించిన ఈ భూములు ఏలాంటి వివాదాలు లేనివిగా ఉన్నాయి. నగరంలో ఎక్కువగా కోర్టు కేసుల్లో, వివాదాల్లో స్థలాలు ఉండటంతో పాటు ఖాళీస్థలాలు గుర్తింపు అధికారులకు కష్టంగా మారింది. అయినా అధికారులు తొలివిడతలో 9.20 ఎకరాల భూమిని గుర్తించారు.
గుర్తించిన స్థలాలు ఇక్కడే..
జిల్లాలో ఖాళీస్థలాల గుర్తింపులో భాగంగా హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు మండలాలు, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాలను అధికారులు ఎంచుకున్నారు. దీనిలో హైదరాబాద్ డివిజన్ పరిధిలో అమీర్‌పేట్ మండలం నుంచి రెండు స్థలాల్లో 418.6 చదరపు గజాలు, అసిఫ్‌నగర్ మండలంలోని ఒక ప్రాంతంలో 1200 చదరపు గజాలు, సైదాబాద్ మండలంలోని ఒక స్థలంలో 377 చదరపు గజాల స్థలాన్ని గుర్తించారు. సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యథికంగా షేక్‌పేట మండలంలో 24 ప్రాంతాల్లోని స్థలాలను వేలానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సుమారు నాలుగున్నర ఎకరాల స్థలం ఉందని నివేదికలో పేర్కొన్నారు. దీనికి తోడు ఖైరతాబాద్ మండలంలో 11 ప్రాంతాల్లో మూడున్నర ఎకరాల స్థలాన్ని గుర్తించారు. వీటికి తోడు ముషీరాబాద్ మండలంలో 404 చదరపు గజాలు, సికింద్రాబాద్ మండలంలోని రెండు ప్రాంతాల్లో 1021 చదరపు గజాల స్థలాన్ని గుర్తించారు. మొదటి విడతలో భాగంగా వీటిని గుర్తించగా, వీటి ద్వారా సుమారు రూ.230 కోట్లను వేలం ద్వారా రాబట్టుకునే పనిలో సర్కార్ నిమగ్నమైంది. జిల్లా యంత్రాంగం మాత్రం ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా సుమారు రూ. 225 కోట్ల రావచ్చని అంచనా వేసినట్లు తెలుస్తోంది. రెండో విడతలో పాతబడిన సర్కారీ భవనాలను గుర్తించి, రెండో విడతగా ప్రభుత్వానికి నివేదిక పంపేపనిలో ప్రస్తుతం అధికారులున్నారు.

No comments:
Post a Comment