Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Tuesday, 20 January 2015

క‌దిలిన ‌ఎర్ర‌దండు ప్రారంభ‌మైన ఇంటింటికీ సి‌పి‌ఎం


                       Hyd ఉదయమే మల్కాజి గిరి లో ఇంటింటి ప్రచారంలో నిజామాబాద్ సిపిఎం నా యకులు





క‌దిలిన ‌ఎర్ర‌దండు
ప్రారంభ‌మైన ఇంటింటికీ సి‌పి‌ఎం
హెచ్‌ఎంటి హిల్స్‌లో ప్రారంభించిన ప్ర‌కాశ్‌క‌ర‌త్
గ్రేట‌ర్ అంతా ప్ర‌చారంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు
ఆహ్వా‌నిస్తు‌న్న న‌గ‌ర ప్ర‌జ‌లు

   ఫిబ్రవరి నెలాఖరులో జరిగే సిపి‌ఎం తెలంగాణ రాష్ట్ర తొలి మ‌హాస‌భ‌ను విజయవంతం చేసేందుకు నిర్వ‌హిస్తు‌న్న ‘ఇంటింటికి సిపి‌ఎం’ కార్యక్రమం న‌గ‌రంలో మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. కూక‌ట్‌ప‌ల్లి‌లోని హెచ్‌ఎంటి హిల్స్ చౌర‌స్తా‌లో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌కాశ్ క‌ర‌త్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మి‌నేని వీరభ‌ద్రం, నార్త్ జిల్లా కార్య‌ద‌ర్శి కె ర‌వితో క‌లిసి ఆ ఏరియాలోని ప‌లు ఇళ్ల‌ను తిరిగి మ‌హాస‌భ‌ ప్ర‌చారంతో పాటు విరాళాల‌ను సేక‌రించారు.
   గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోని వాడవాడల మూడు క‌మిటీల ఆధ్వ‌ర్యంలో ఈ క్యాంపెయిన్  కొన‌సాగుతోంది. మంగ‌ళ‌వారం నుంచి ఫిబ్ర‌వ‌రి ప‌ది వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. సోమవారం నార్త్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ‌8 నియోజ‌క‌వ‌ర్గా‌ల్లో 200 ద‌ళాలు రంగంలోకి దిగాయి. సెంట్ర‌ల్ సిటీ క‌మిటీలోనూ 210, సౌత్ సిటీ క‌మిటీ ప‌రిధిలో 208 ద‌ళాలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొ‌న్నాయి. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌లు మ‌హాస‌భ‌లను జ‌యప‌ద్రం చేయాల‌ని చెబుతునే, పార్టీ కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌జ‌ల నుంచి విరాళాల‌ను సేక‌రిస్తు‌న్నా‌రు.
              హెచ్‌ఎంటి కాల‌నీలో...  
     న‌గ‌రంలో ముందుగా హెచ్‌ఎంటి కాల‌నీలో ‌ఎల్ దుర్గా‌ ప్ర‌సాద్ అనే రిటైర్డ్ ఉద్యో‌గి ఇంటికి సిపి‌ఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌కాశ్ క‌ర‌త్ వెళ్లి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలో జ‌రిగే రాష్ట్ర మ‌హాస‌భ‌ల కోసం ఒక నెల పింఛ‌న్ మొత్తా‌న్ని పార్టీ‌కి విరాళంగా క‌ర‌త్‌కు అందించారు. పింఛ‌న‌ర్ల స‌మ‌స్య‌ల‌పై సిపి‌ఎం అనేక పోరాటాలు నిర్వ‌హించింద‌ని దుర్గా ప్రసాద్ గుర్తు చేశారు. తాను కార్మా‌గారంలో ప‌నిచేసిన‌ప్పు‌డు కూడా సిఐటియు త‌మ స‌మ‌స్య‌ల‌పై పోరాడింద‌ని గుర్తు చేసుకున్నా‌రు. జాతీయ పార్టీ కార్య‌ద‌ర్శి త‌మ ఇంటికి రావ‌డం సంతోషంగా ఉంద‌ని ‌ఎల్ డి ప్ర‌సాద్ అన్నా‌రు. సౌత్ జోన్ ప‌రిధిలోని రాజేంద్ర‌న‌గ‌ర్ జోన్ మణికొండ ఏరియాలో సినీన‌టుడు రాజీవ్ క‌న‌కాల‌ను సిపి‌ఎం కార్య‌క్ర‌మంలో క‌లిసారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌గ‌రంలో ఉన్న చెట్లను కోట్టే‌స్తు‌న్నా‌ర‌ని, అలా కాకుండా చెట్ల‌ను పెంచేలా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావాల‌ని కోరారు. ఆయ‌న్ను క‌లిసిన వారిలో సిపి‌ఎం మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లా కార్య‌ద‌ర్శి జ‌బ్బ‌ర్, నాయ‌కులు ప‌ర్వ‌తాలు, గీతా, జ‌గ‌దీష్ ఉన్నా‌రు.
    సెంట్ర‌ల్ సిటీలో..
     న‌గ‌రంలోని సెంట్ర‌ల్ సిటీ ప‌రిధిలో జూబ్లి‌హిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఖ‌మ్మ జిల్లా కార్య‌ద‌ర్శి పోతినేని సుద‌ర్శ‌న్, అంబ‌ర్ పేట్ నియోజ‌క‌వ‌ర్గంలో సోమ‌య్య‌, నాంప‌ల్లి‌లో బుగ్గ‌వీటి స‌ర‌ళ‌, ఉప్ప‌ల్ లో మ‌చ్చ వెంక‌టేశ్వ‌ర్లు‌, బాగ్ లింగంప‌ల్లి‌లో సెంట్ర‌ల్ సిటీ కమిటీ కార్య‌ద‌ర్శి ‌ఎం శ్రీనివాస్ పాల్గొ‌న్నా‌రు. గోషామ‌హాల్ లో టి జ్యో‌తి,  రాంన‌గ‌ర్ ఏరియాలో పాల‌డుగు భాస్క‌ర్, రాజారావు, అడిక్ మెట్ ఏరియాలో మెరుగు స‌త్య‌నారాయ‌ణ‌, ఆర్ సైదులు, ర‌మ‌ణ పాల్గొ‌న్నా‌రు.  జూబ్లి‌హిల్స్ లోని మ‌ధురాన‌గ‌ర్లో సినీన‌టుడు చ‌ల‌ప‌తి రావు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌గా, నాంప‌ల్లి‌లో డాక్ట‌ర్ మ‌ల్లే‌షం ప్రారంభించారు.
      నార్త్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో..
     కంటోన్మెంట్ ఏరియాలో రాష్ట్ర నాయ‌కులు భిక్ష‌మ‌య్య‌, గంగాధ‌ర్, ముకుంద‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇంటింటికి సిపి‌ఎం కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. మ‌ల్కా‌జ్ గిరి ఏరియాలోని ఆర్టీ‌సీ కాల‌నీలో రాష్ట్ర నాయ‌కులు టి సాగ‌ర్, నిజామాబాద్ జిల్లా కార్య‌ద‌ర్శి దండి వెంక‌ట్, స‌న‌త్ న‌గ‌ర్ ఏరియాలో రాష్ట్ర నాయ‌కులు లంకా రాఘ‌వులు, కూక‌ట్ ప‌ల్లి లో రంగారెడ్డి జిల్లా కార్య‌ద‌ర్శి న‌ర్సింలు, శేర్ లింగంపల్లి‌లోని చందాన‌గ‌ర్లో సుధాభాస్క‌ర్, సికింద్రాబాద్ లో ‌పి‌ఎన్‌ఎన్ మూర్తి‌, తార్నా‌క‌లో చుక్క‌య్య‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి‌, కుత్భు‌ల్లా‌పూర్ ఏరియాలో ‌మెద‌క్ జిల్లా కార్య‌ద‌ర్శి ఎ మ‌ల్లే‌శం పాల్గొ‌న్నా‌రు.
    సౌత్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో...
‌ఎల్ బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని హుడా కాంప్లె‌క్స్  ఏరియాలో మాజీ ‌ఎమ్మె‌ల్సీ చెరుప‌ల్లి సీతారాములు, హ‌య‌త్ న‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలో న‌ల్గొండ జిల్లా కార్య‌ద‌ర్శి  నంద్యాల న‌ర్సింహారెడ్డి, మ‌ల‌క్ పేట్ ఏరియాలో మాజీ ‌ఎమ్మె‌ల్యే జూల‌కంటి రంగారెడ్డి, రాష్ట్ర నాయ‌కులు లెల్లె‌ల బాల‌కృష్ణ‌, ఎల్బీనగర్ ఒకటో విభాగంలో తిరందాసు గోపి పాల్గొ‌న్నా‌రు. యాక‌త్ పురాలో ‌ఎం రాములు, ఆశ‌య్య‌, రాజేంద్ర‌న‌గ‌ర్ ఏరియాలో జాన్ వెస్లీ‌, మ‌హేశ్వ‌రంలో జంగారెడ్డి‌, కొండూరి రాములు, శ్యామ్యూ‌ల్ , చంద్ర‌యాన్ గుట్ట‌లో ధ‌ర్మా‌నాయ‌క్, గ‌యాజ్ త‌దిత‌రులు పాల్గొ‌న్నా‌రు.
           ప్ర‌త్యా‌మ్నా‌యం క‌మ్యూ‌నిస్టు‌లే...
  ‘నేడు దేశంలోని బ‌హుళ‌జాతి కంపెనీలు రాజకీయ పార్టీ‌ల‌నే కొనేస్తు‌న్నా‌యి. ఇలాంటి స‌మ‌యంలో దేశంలో రాజ‌కీయ పార్టీల‌న్నింటికీ క‌మ్యూ‌నిస్టు పార్టీ‌లే ప్ర‌త్యా‌మ్నా‌యం. క‌మ్యూ‌నిస్టు‌లు దేశంలో,రాష్ట్రంలో మ‌రింత బ‌ల‌ప‌డాలి’ అని తెలుగుదేశం ‌ఎమ్మె‌ల్యే రేవంత్ రెడ్డి అన్నా‌రు. ఇంటింటికి సిపి‌ఎం కార్యక్ర‌మంలో భాగంగా ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సిపి‌ఎం రాష్ట్ర క‌మిటీ స‌భ్యు‌లు బండారు ర‌వికుమార్ ఆయ‌న ఇంటికి వెళ్లా‌రు. ఈ సంద‌ర్భంగా సిపి‌ఎం బృందాన్ని సాధారంగా ఆయ‌న స్వా‌గ‌తించారు. ఈ సంద‌ర్భంగా వారితో రేవంత్ రెడ్డి మాట్లా‌డుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి నిజ‌మైన వార‌సులు క‌మ్యూ‌నిస్టు‌ల‌ని, కానీ ప్ర‌స్తు‌త ముఖ్య‌మంత్రి కెసిఆర్ త‌ప్పు‌దోవ ప‌ట్టించే ప‌నిలో ఉన్నా‌ర‌ని అన్నా‌రు. న‌గ‌రంలో తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూ‌పం నిర్మించాల‌ని అంద‌రం క‌లిసి డిమాండ్ చేద్దా‌మ‌ని కోరారు. ఈసంద‌ర్భంగా సిపి‌ఎం నాయ‌కులు బొంతు రాంబాబు, బీరెడ్డి సాంబ‌శివ‌, మీనాకుమారి, అజ‌య్ బాబు,రామారావు త‌దిత‌రులు ఉన్నా‌రు.
        ఏడుప‌దుల వ‌య‌స్సు‌లోనూ...
  ఆమె ఓ సిపి‌ఎం కార్య‌క‌ర్త‌. ప్ర‌స్తు‌తం 72 సంవత్స‌రాలు. త‌నకు వ‌య‌స్సు మీద‌ప‌డింది క‌దా.. అని అనుకోలేదు. ఖ‌మ్మం జిల్లా నుంచి నగరంలో ఇంటింటికి సిపి‌ఎం కార్య‌క్ర‌మంలో పాల్గొ‌నేందుకు వ‌చ్చింది. న‌గ‌రంలోని జియాగూడ‌లోని ఇంటింటికి తిరిగి రాష్ట్ర మ‌హాస‌భ‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించింది. పార్టీ విశిష్ట‌త‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించింది. ‌‘ఎవ‌రండీ ఈ బామ్మ.. యువ‌తి లాగే ఉత్సా‌హంగా ఈ క్యాంపెయిన్లో పాల్గొంటుంది ’ అని అక్క‌డ‌నున్న ఓ మ‌హిళ ప‌క్క‌నున్న ఆమెను అడిగింది. దీంతో ఆమె ‘ఆవిడ సిపి‌ఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మి‌నేని వీర‌భ‌ద్రం గారి అమ్మ, పేరు క‌మ‌లమ్మ.. మ‌హిళా సంఘం నాయ‌కురాలు’ అని చెప్ప‌గానే అమ్మో.. మీ రాష్ట్ర నాయ‌కుల అమ్మ‌లు కూడా పాల్గొంటారా..’ అంటూ విస్తుపోయింది. ఏడు ప‌దుల వ‌య‌స్సు దాటినా కార్య‌క‌ర్త‌లంద‌రికీ ఉత్సా‌హాన్ని నింపుతూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొ‌న‌డం గ‌మ‌నార్హం. జియాగూడ ఏరియాలో సిపి‌ఎం రాష్ట్ర నాయ‌కురాలు హైమావ‌తి, నాయ‌కురాలు సుగుణ‌మ్మ‌(64) త‌దిత‌రులు పాల్గొ‌న్నా‌రు.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks