న్యూఢిల్లీ, జనవరి 18: బిజెపి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం బిజెపిలో చేరిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారిణి కిరణ్‌బేడీనే సిఎం అభ్యర్థి అంటూ వచ్చిన వార్తలపై రాజ్‌నాథ్ ఈ వివరణ ఇచ్చారు. సిఎం అభ్యర్థిని బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆదివారం ఇక్కడ చెప్పారు.‘ఇప్పటి వరకూ అయితే దానిపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది’అని ఆయన తెలిపారు. ఒక్కోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ముందే నిర్ణయం తీసుకోవచ్చు.. కొన్ని సార్లు సాధ్యపడకపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితమే పార్టీలో చేరిన మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీని నిలబెట్టే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు.


No comments:
Post a Comment