Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Tuesday, 12 May 2015

దావూద్‌పై దోబూచులు!

 మాఫియా డాన్ దావూద్ ఇబ్రహిం ఎక్కడున్నాడన్నది ఎప్పటికప్పుడు ఎడతెగని మీమాంస. బాబరి విధ్వంసం అనంతరం ముంబయిలో జరిగిన గొలుసు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ను పట్టుకునేందుకు గత పాతికేళ్లుగా భారత్ చేయని ప్రయత్నం లేదు. కాని ఇంత వరకూ దావూద్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల నేపథ్యంలో గత పక్షం రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు దిగ్భ్రాతిని కలిగిస్తున్నాయి. ముంబయి గొలుసు పేలుళ్లతో పాటు దేశంలో జరిగిన అనేక మారణ కాండలకూ కుట్రదారుగా భావిస్తున్న దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పటి వరకూ అనేక సందర్భాల్లో విశ్వసనీయ సమాచారం వెలుగులోకి తెచ్చాయి. వాటన్నింటిని ప్రాతిపదికగా చేసుకునే కేంద్ర ప్రభుత్వం ఈ మాఫియాడాన్ విషయంలో చాలా స్పష్టంగానే ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోనే ఉన్నాడని, అక్కడి ప్రభుత్వం అతడికి వెన్నుదన్నుగా నిలుస్తోందని కూడా వెల్లడించింది. అయితే పక్షం రోజుల క్రితం ఇందుకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామంతో అంత వరకూ మరుగున పడిపోయిన దావూద్ విషయం తెరపైకి వచ్చింది. ముంబయి పేలుళ్ల అనంతరం లొంగిపోవడానికి దావూద్ సిద్ధ పడ్డా అందుకు సానుకూల పరిస్థితి ఏర్పడలేందంటూ మాజీ సిబిఐ అధికారి ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ అంశంపై భిన్న కథనాలు మొదలయ్యాయి. అంతకు ముందు వరకూ దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని చెబుతూ వచ్చిన కేంద్రం మాట మార్చింది. ఎక్కడన్నాడో తెలియదంటూ విస్మయకర ప్రకటన చేసి వ్యవహారాన్ని జటిలంగా మార్చింది. ఎప్పుడైతే భారత ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా దావూద్ పాక్ లో లేడని స్పష్టం చేసిందో అది అక్కడి పాలకులకు బలమైన అవకాశంగా మారాయి. ఇప్పటి వరకూ తమపై అనవసరమైన నిందలు వేశారంటూ పాక్ పాలకులు విరుచుకు పడ్డారు. ఈ అంశాన్ని ఒక్క దావూద్ విషయానికే పరిమితం చేయకుండా తమపై చేసిన ఉగ్రవాద ఆరోపణలన్నింటికీ ఆపాదించారు. అసలు తమ విషయంలో భారత్ చేసిన ఆరోపణలేవీ నిజం కాదని, అభూ త కల్పనలేన్నట్టుగా ఎదురుదాడికి దిగింది.
దావూద్ పాక్‌లోనే ఉన్నాడని, అతడ్ని పట్టుకుని స్వదేశానికి తీసుకొచ్చే వరకూ విశ్రమించేదే లేదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రకటించడమే తడవుగా భారత్‌లోని పాక్ రాయబారి ఆబ్దుల్ బాసిత్ ఆయన ప్రకటనను ఖండించారు. ‘దావూద్ సాహెబ్ మా దేశంలో లేడు’అంటూ రాజ్‌నాథ్ ప్రకటనను తిరస్కరించారు. దాంతో దావూద్ విషయంలో పాకిస్తాన్-్భరత్‌ల మధ్య దోబూచులాటే సాగుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముంబయి గొలుసు పేలుళ్ల వెనుక దావూద్ ముఠా ప్రమేయం ఉందన్న విషయం స్పష్టం కావడంతో అనేక కేసులు దాఖలయ్యాయి. అతడ్ని పట్టుకునేందుకు అంతర్జాతీయ సహకారాన్ని కూడా భారత్ తీసుకుంది. అంతర్జాతీయంగా రెడ్‌కార్నర్ నోటీసులూ జారీ చేసింది. అమెరికా కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా అతడిపై ముద్ర వేసింది. ఇవన్నీ కూడా దావూద్ అప్పగింత విషయంలో పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో నైతికంగానూ ఇతరత్రానూ వత్తిడి తీసుకొచ్చిన పరిణామాలే. కానీ ఇంత వరకూ ఈ ఉగ్రవాది ఆచూకీకి సంబంధించి భారత్ తరచూ ప్రకటన చేయడమే తప్ప పాకిస్తాన్ నుంచి మాత్రం ఒక్క సానుకూల ప్రకటనా రాలేదు. నిజానికి నాలుగేళ్ల క్రితమే భారత హోం మంత్రిత్వ శాఖ పాకిస్తాన్‌కు దావూద్, టైగర్ మెమన్ సహా మొత్తం 50మంది ఉగ్రవాదుల జాబితాను అందించింది. అంతే కాదు, వీరందరూ పాకిస్తాన్‌లో ఎక్కడుంటున్నారన్న వివరాలనూ ఆ జాబితాలో పొందుపరిచింది. అంత విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో ఉన్న కారణంగానే దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ భారత అధికారులు చాలా స్పష్టంగానే చెప్పగలిగారు. దావూద్ ఎక్కడున్నాడో తెలియదంటూ మొన్న పార్లమెంట్‌లో ప్రకటించడం..రెండు రోజులు తిరక్కుండానే పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ హోం మంత్రి ఉద్ఘాటించడంతో గందరగోళం ఏర్పడింది. భారత పాలకుల్లోనే ఇంత అయోమయం ఉన్నప్పుడు దాన్ని కచ్చితంగా పాక్ తనకు అనుకూలంగానే మార్చుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే! భారత ప్రభుత్వ అయోమయం పాక్‌కు అన్ని విధాలుగా కలిసొస్తోంది. అందుకే దావూద్ తమ దేశంలో లేనేలేడంటూ భారత్ గడ్డపైనే ఆ దేశ హైకమినర్ విస్పష్టంగా వెల్లడించే సాహసం చేశారు. ఒక్క దావూద్ విషయంలోనే కాదు 26/11 సహా అనేక ఘాతుకాలకు సంబంధించి పాకిస్తాన్ వ్యవహార శైలి ఇదే విధంగా ఉంది. దావూద్‌ను అప్పగించాలని కోరుతూ ఎన్ని రకాలుగా సాక్ష్యాధారాలను పాక్‌కు అందించిందో అంతకు మించిన రీతిలోనే ముంబయి దిగ్బంధం విషయంలోనూ ఆధారాలను సమకూర్చింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా వంటి ఉగ్రవాద సంస్థల ప్రమేయంతోనే ముంబయిపై దాడి జరిగిందని, హఫీజ్ సరుూద్ సహా ఈ దోషులందరినీ పట్టుకుని చట్ట ప్రకారం శిక్షించాలనీ కోరింది. ఇంత వరకూ వారిని అరెస్టు చేసిన దాఖలాలు లేవు. హఫీజ్ సరుూద్ ఇప్పటికీ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పాక్‌లో స్వేచ్ఛగానే తిరుగుతున్నా అక్కడి పాలకులకు పట్ట డం లేదు. మరో పక్క సరిహద్దుల్లోనూ భారత దళాలతో చెలగాటమాడే ధోరణిని పాక్ విడిచిపెట్టలేదు. ఇలా అన్నివైపుల నుంచీ ఉగ్రవాద సెగలు కక్కడమే కాకుండా ఆధారుల్నా దోషులైన ఉగ్రవాదులను అప్పగించడంలో తాత్సా రం చేస్తున్న పాకిస్తాన్ పీచమణచాల్సింది పోయి మన పాలకులే తప్పించుకునే అవకాశాలను, ఎదురుదాడికి దిగే సౌలభ్యాన్నీ కల్పించడం విడ్డూరమే. ఎప్పుడైతే పాక్‌లో దావూద్ ఇబ్రహిం లేడని లోక్‌సభలో సంబంధిత మంత్రి ప్రకటించారో..దాన్ని అన్ని విధాలుగా పాక్ తనకు అనుకూలంగా మలచుకుంటూనే ఉంటుంది. అంతర్జాతీయ వేదికలమైనా భారత అయోమయాన్ని ఆసరా చేసుకుని లబ్ది పొందేందుకూ, ఉగ్రవాదంతో తనకు సంబంధం లేదని చెప్పుకునేందుకూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్న తేడాలకు ఆస్కారం ఉండకూడదు. దేశీయంగా ఎంతగా దూషించుకున్నా..దేశ ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించి అన్ని పార్టీలు ఏకం కావాల్సిందే. దావూద్ విషయంలో ప్రభుత్వ పొరపాటు ప్రకటనను సరిదిద్దేందుకు హోం మంత్రి రాజ్‌నాథ్ చేసిన ప్రకటన కొంత మేరకు దోహదం చేసేదే అవుతుంది. దీన్ని పాక్ ఖండించిందా లేక దావూద్ వ్యవహారాన్ని మరింత జటిలం చేసేందుకు ప్రయత్నిస్తుందా అన్నది పక్కన పెడితే...దేశంలోని అన్ని పార్టీలు చేతులు కలిపి ఈ విషయంలో పాక్‌పై వత్తిడి తీసుకురావాలి. ఆ విధంగా 1993 గొలుసు పేలుళ్ల కేసును ఓ కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటెలిజన్స్ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారాన్ని నిగ్గుదీసి ప్రభుత్వం దావూద్‌కు సంబంధించిన అసలు గుట్టును రట్టు చేయాలి. అందుకు ఉమ్మడిగా ముందుకెళ్లడమొక్కటే మార్గం. ఇప్పటికే జరుగకూడనంతగా జాప్యం జరిగిపోయింది. ఇంకేమాత్రం తాత్సారం జరిగినా క్షమార్హం కాదు. భారత్‌తో నిజంగా సత్సంబంధాలను కోరుకుంటే దావూద్‌పై దోబూచులాటను పాక్ కట్టి పెట్టాలి.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks