అందరి సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రం : భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
మెదక్ : ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో వారి తల్లిదండ్రులను ఆదుకునేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వము కాల్యాణలక్ష్మి, షాధీముబారక్ లాంటి క్రొత్త పథకాల శ్రీకారం చుట్టిందని భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు వివరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి జిల్లాలో వివాహాలు జరుపుకుంటున్న పేద ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల 312 ఆడపిల్లలకు ఒక్కోక్కరికి 51వేల రూపాయల చొప్పున మంజూరి పత్రాలను అందచేశారు. మంజూరైన వారిలో 103 మంది ఫె.కులాల వారు, 90 మంది గిరిజలను, 119 మంది గిరిజలనులు, 119 మంది మైనారిటీ వధువులు ఉన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్, మే మాసాలలో ఇప్పటివరకు 1931 దరఖాస్తులు అందాయిన, అందులో 1281 దరఖాస్తులు మంజూరి చేయడం జరిగిందని, మిగితా దరఖాస్తులను కూడా త్వరలోనే పరిశీలించి ఆర్హులకు మంజూరి చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకాల అమలులో రాష్ట్రంలో మెదక్ జిల్లా అగ్రస్థానలంలో ఉందన్నారు. ఈ సందర్బంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పథకాల గురించి తమ తొటివారికి పరిసరాల వారిని కూడా వివరించి వారంతా ఈ పథకాల ద్వారా లభ్దిపొందేందుకు తమ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ పథకాల మంజూరికి ప్రక్రియను చాలా సులభతరం చేశామని ఇక నుంచి మైనర్టీల దరఖాస్తుల శీఘ్ర పరిశీలన మంజూరి బాధ్యతను కూడా తహీసీల్దార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయంచేసిందన్నారు. రైతుకూలీలను రైతులుగా మార్చాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిరుపేద దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగానే జిల్లాలో ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 659 ఎకరాల సాగుకు యోగ్యమైన భూమిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. మొదటి సంవత్సరం పంట పండించేందుకు వీలుగా ఇన్‌పుట్ సబ్సిడీని అందించేందుకు వెంటనే ప్రతిపాధనలను ప్రభుత్వానికి పంపాలని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మరో ముగ్గురు ఇషాన్‌రెడ్డి, ఆకుల సాయికుమార్, చల్లబక్కారెడ్డి కుటుంబాలకు పది లక్షల చొప్పున చెక్కులను అందచేశారు. గతంలో 52 మంది ఆమరుల కుటుంబాలకు పదిలక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని ఇంకా పెండింగులో ఉన్న 15 దరఖాస్తులను పరిశీలించి వారిలో ఆర్హులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అమరుల కుటుంబాలలో ఒక్కోకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామన్నారు. జిల్లాలోని నంగునూరులో చర్చి నిర్మాణానికి 5.89 లక్షల రూపాయలు, చిన్నకోడూరు మండలం మాచాపూర్ చర్చికి 2.00 లక్షల గ్రాంట్ ఇన్ ఏయిడ్ చెక్కులను కూడా సంబంధిత పాస్టర్లకు మంత్రి అందచేశారు.అందరి సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని శాసనసభ ఉప సభపతి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపలేదని నూతన ప్రభుత్వం చిత్తశుద్దితో శాశ్వత పరిష్కారాల కొరకు పెద్ద ఎత్తున పథకాలను రూపొందించి అమలుచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఆసరా పించన్లు దళితులకు భూపంఫిణి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగు నీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని బహుళ ప్రయోజనమున్న మిషన్ కాకతీయలాంటి బృహత్తరమైన కర్యాక్రమాలను చేపట్టి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఆర్‌టీసీ కార్మికలుకు కూడా 44 శాతం ఫిట్‌మెంటును ముఖ్యమంత్రి మంజూరి చేయడం జరిగిందన్నారు. పథకాల మంజూరి లో కుటుంబంలో మహిళలకే ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు చింతాప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ణ్రంలో అమలుచేయని విధంగా మన రాష్ట్రం పేద దళిత, గిరిజన మైనరిటీల కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల వివాహాలకు 51 వేల రూపాయాల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ శాసనసభ్యులు మదన్‌రెడ్డి జాయింట్ కలెక్టర్ వెంకటరామిరెడ్డి, డిఆర్‌ఓ దయానంద్, ఎస్సీ అభివృద్ది శాఖ డిడి శ్రీనివాసరెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment