బోధన్: ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పాకిస్తాన్ దిష్టిబొమ్మను శివసేన నాయకులు, కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. అంతకుముందు వారు ఆ దిష్టిబొమ్మతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు, ఐఎస్‌ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శివసేన జిల్లా అధ్యక్షుడు పసులోటి గోపికిషన్ మాట్లాడుతూ మన వైమానిక స్థావరంపై ఐఎస్‌ఐ ఉగ్రవాదులు దొంగదెబ్బ తీశారని, అయితే మన సైనికులు వీరోచితంగా పోరాడి వారిని తుదముట్టించారని అన్నారు. ఈ దాడిలో మృతిచెందిన ముగ్గురు జవాన్‌లకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శివసేన నాయకులు దీపక్, వాసు, ప్రీతమ్‌గౌడ్, భూమేశ్, గోవింద్, బాబు, మధు పాల్గొన్నారు.



No comments:
Post a Comment