Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 30 July 2016

52 ఘాట్లలోభారీ ఏర్పాట్లు

  52 ఘాట్లలోభారీ ఏర్పాట్లు


మహబూబ్‌ నగర్‌, జూలై 30,
కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇప్పటికే పుష్కర ఘాట్లను గుర్తించి, వాటి పనులను ముమ్మరంగా చేపడుతోంది.. తాజాగా ఉత్సవాల్లో వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు పురోహితుల నియామకానికి చర్యలు చేపట్టింది.. రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా దాదాపు రెండు వేల మందిని నియమించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నది.. ఇప్పటికే ఇందుకు సంబంధించి 1900 దరఖాస్తులు రాగా, వాటిని అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నది.. దీనికితోడు పుష్కర ఘాట్ల వద్ద రూ.వందకే పూజా సామగ్రిని అందజేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది.. మహిళా సంఘాల ద్వారా సామగ్రిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది.. పిండప్రదానం, గంగాస్నానం తదితర పూజా కార్యక్రమాలకు దేవాదాయ శాఖ కమిషనరేట్‌ ధరలను నిర్ణయించింది.. ఈ ధరలనే పురోహితులకు చెల్లించి, భక్తులు పూజ నిర్వహించాల్సి ఉంటుంది.. ఘాట్ల వద్ద అధిక డబ్బులు వసూలు చేసే వారిపై నిఘా ఉంచి, వారిని వెంటనే విధుల నుంచి తొలగించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది..కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలోని 52 ఘాట్లలో దాదాపు రెండు వేల మంది పురోహితులను నియమించేందుకు దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అన్ని ఘాట్లలో పూజ కార్యక్రమ ఏర్పాట్లపై దృష్టి నిలిపిన అధికారులు అందుకు కావాల్సిన అర్చకులను దరఖాస్తుల ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటి వరకు 1900 అర్చకులు దరఖాస్తులను చేసుకున్నారు. వీరందరికీ దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నారు. వీరితో పాటు ప్రతి పుష్కర ఘాట్ల వద్ద 200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. ప్రతి పూజలోనూ అర్చకులు తీసుకునే ధరలను సైతం ముందుగానే నిర్ణయించారు. ఈ ధరలను ఆయా పుష్కరాల ప్రాంతా ల్లో సూచిక బోర్డుల ద్వారా భక్తులు గుర్తించేలా ఏర్పాట్లు చేయనున్నారు. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ విక్రయించినా, అర్చకులు పూజల పేరుతో ఎక్కువ డబ్బు వసూలు చేసినా విధుల నుంచి వెంటనే తప్పించేందుకు సర్వం సిద్ధం చేశారు.పుష్కరాల్లో నిర్వహించే వివిధ రకాల పూజలకు దేవాదాయ శాఖ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ధరలను నిర్ణయించారు. పిండప్రదానానికి రూ.251, మహాసంకల్ప పూజకు రూ.151, లవణదానానికి రూ.101, సరిగంగ స్నానం,గంగాపూజ,గౌరీ పూజ,మూస వాయినం, ప్రాయచిత్తం,నదీస్నానం,తీర్థ విధులు పూజలకు రూ.51 నిర్ణయించారు. పిండప్రదానాలకు అవసరమయ్యే 19 రకాల సామగ్రిని రూ. వందకే దేవదాయ శాఖ సమకూర్చంది. వీటిని మహిళా గ్రూపుల ద్వారా విక్రయాలు చేయించబోతున్నారు. మరో వైపుఆలయాల్లో రంగులు,క్యూలైన్లు,బారీకేడ్లు,లైటింగ్‌,తడకల పందిళ్లు,షామియానాల ఏర్పాట్లను దేవదాయశాఖ సమకూర్చనుంది. అలంపూర్‌ జోగుళాంబ ఆలయంలో టీటీ డీ నుంచి ప్రత్యేకంగా ధర్మప్రచార పరిషత్‌ ద్వారా పలు భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భజనలు,హరికథ,అన్నమయ్య కీర్తనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks