వామ్మో.44.... 61, 63 రోడ్లా..
అదిలాబాద్, జూలై 30,
ఇదేంటి ఇవోదే కొత్త లెక్కలు అనుకుంటున్నారా... నేషనల్ హైవే 44, 61, 63 రోడ్లంటే ఆదిలాబాద్ జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోని నిర్మల్ మండలం సోన్ నుంచి జైనథ్ మం డలం పిప్పల్‌కోఠి వరకు జాతీయ రహదారి నం.44, తానూర్ మండలం బేల్ తరోడ నుంచి లక్షెట్టిపేట వరకు హైవే నం.61, దండేపల్లి మండలం గూడెం నుంచి కోటపల్లి మండలం అర్జున్‌గుట్ట వరకు హైవే నం.63 మూడు జాతీయ రహదారులున్నాయి. వీటితో పాటు ముథోల్ మం డలం బాసర గోదావరి వంతెన నుంచి భైంసా చెక్‌పోస్టు వరకు, ఖానాపూర్ నుంచి బాదన్‌కుర్తి వరకు కొత్తగా జాతీయ రహదారుల పరిధిలోకి చేరుతున్నాయి.
గ్రామాల మధ్యలో నుంచి జాతీయ రహదారి ఉండగా, ఇరువైపులా రాక పోకలకు సర్వీసు రోడ్లు లేవు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే బస్సులు కుడి వైపున ఉన్న బస్టాండ్‌లోకి వెళ్లి వస్తుండగా, హైవేపై వేగంగా వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. బస్టాండ్‌లోకి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల ఆర్టీఓ, ఎన్‌హెచ్, ఆర్టీసీ, పోలీసు శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమై జాతీయ రహదారి మధ్యలో దారిని మూసివేశారు. దీంతో నిర్మల్ వైపు వెళ్లే వాహనాలను డొంగర్‌గావ్ చౌరస్తాకు వెళ్లి యూటర్న్ తీసుకొని బస్టాండ్ వచ్చి.. జవహర్ నగర్ వైపు వెళ్లి అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్లీ నిర్మల్ వైపు వెళ్లాల్సి వస్తున్నది. డొంగర్‌గావ్ వద్ద యూటర్న్ తీసుకునేప్పుడు ఒకేసారి మలుగక.. రివర్స్ తీసుకుంటున్నారు. దీంతో వేగంగా వచ్చే వాహనాలు ఢీ కొట్టే ప్రమాదాలున్నాయి. గుడిహత్నూర్ వద్ద రెండు వైపులా సర్వీసు రోడ్లు, అండర్ పాస్‌లు లేక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రతి గ్రామం వద్ద కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. జాతీయ రహదారుల నిర్మాణంలో నిబంధనలు సరిగా పాటించడం లేదు. నాలుగు దశల్లో రోడ్డు భద్రత తనిఖీ చేస్తుండగా.. అసలు డిజైన్ కావాలని ఎన్‌హెచ్ అధికారులను రవాణా శాఖ అధికారులు పలు మార్లు కోరినా స్పందన లేదు. ఇప్పటికే నిర్మించిన హైవే నం.44, 61కు సంబంధించి నిబంధనలు, ప్రమాణాలు సరిగా పాటించలేదు. ఎక్కడా ప్రయాణికులు, వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి ఎక్క కూడదు. గ్యాప్ ఇన్ విూడియం (రహదారిపై డివైడర్ అంతరాయం) వచ్చిన చోట అదనపు లైన్ తప్పకుండా ఉండాలి. గ్రామస్తులు, ఆర్టీసీ బస్సులు రాక పోకలు సాగించేందుకు సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లు, అదనపు లైను పెట్టాలి. ఇది జిల్లాలో ఎక్కడా సరిగా అమలు కాలేదు. గ్యాప్ ఇన్ విూడియం వచ్చిన చోట 200-250విూటర్ల దూరంలో హెచ్చరికలు సూచించే బోర్డులు ఉండాలి. 100విూటర్లకు మరో హెచ్చరిక బోర్డు తప్పని సరిగా పెట్టాలి. రెండు కిలో విూటర్లలోపు ఎక్కడ కూడా గ్యాప్ ఇన్ విూడియం ఉండకూడదనే నిబంధన ఉంది.విస్తరించిన జాతీయ రహదారులపై గ్రామాలు వచ్చిన చోట సర్వీసురోడ్లు, అండర్‌పాస్‌లు, అదనపు లైన్లు లేవు. వాటి కోసం స్థలం కూడా కేటాయించ లేదు. పెట్రోల్ బంక్‌లు ఉన్నచోట యూటర్న్, డివైడర్ అంతరాయం ఉంది. గ్రామాలు ఉన్న చోట వాహనాలు, ప్రయాణికులు ఇతర పశువులు నేరుగా రోడ్డుపైకి ఎక్కుతున్నాయి. దీంతో 80-100కిలో విూటర్ల వేగంతో వచ్చే వాహనాలు వీరిని ఢీకొడుతున్నాయి. పెద్ద గ్రామాల్లో కూడా సర్వీసు రోడ్లు, అదనపు లైన్లు, అండర్ పాస్‌లు లేక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా లాంటి పెద్ద పట్టణాలకు వెళ్లే బైపాస్ రోడ్లకు కూడా అదనపు లైన్, అండర్‌పాస్‌లు లేక పోవడంతో.. జాతీయ రహదారి నుంచే నేరుగా రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌లోకి వచ్చే భోరజ్, మావల, నిర్మల్‌కు వెళ్లేందుకు బుర్కపల్లి, కర్తాల్ వద్ద ఇదే దుస్థితి ఉంది. నిర్మల్ మండలం మాదాపూర్, గంజాల్, ఇచ్చోడ బైపాస్‌లో ఇన్, ఔట్ రోడ్డు, గుడిహత్నూర్, ఆదిలాబాద్ బైపాస్‌లో ఇన్, ఔట్ ఇలాగే ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విస్తరించిన జాతీయ రహదారి 61పై బెల్‌తరోడ నుంచి నిర్మల్ వరకు ఒక్క చోట కూడా సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లు లేవు. భోరజ్ వద్ద జైనథ్ వెళ్లేందుకు సర్వీసు రోడ్డు ఒకే వైపే ఇవ్వడంతో.. ఎడమ వైపునకు వెళ్లాల్సిన వాహనాలు కుడివైపు వచ్చి హైవే ఎక్కడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
అదిలాబాద్ జిల్లాలో తరచూ పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి రవాణా శాఖ అధికారులు ప్రమాద స్థలాలను గుర్తించారు. 20కి పైగా ప్రమాదాలు జరిగితే ఏ కేటగిరి, 10 కంటే పైగా జరిగితే బీ, ఐదు కంటే పైగా జరిగితే సీ కేటగిరిగా తీసుకున్నారు. సీ లో జాతీయ రహదారులకు సంబంధించి హైవే నం.44పై గుడిహత్నూర్, నిర్మల్ మండలం మాదాపూర్ ఎక్స్‌రోడ్డు, గంజాల్, హైవే నం.61పై మాటేగావ్ బస్టాండ్, సిర్గాపూర్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. హైవే నం.63పై గుడిపేట, పాత మంచిర్యాల, శ్రీరాంపూర్ భారత్ పెట్రోల్ బంక్, జైపూర్ ప్రభుత్వ కళాశాల, చెన్నూర్ మండలం కిష్టంపేటను ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. రాష్ట్ర రహదారులకు సంబంధించి ఏ కేటగిరిలో ఎస్‌హెచ్ నం.24 పై బాసర ట్రిపుల్ ఐటీ వద్ద, ఎస్‌హెచ్ నం.1పై మంచిర్యాలలోని పాత మంచిర్యాల, బెల్లంపల్లి ఎక్స్‌రోడ్డు, బీ కేటగిరిలో ఎస్‌హెచ్ 24పై బిదిరెల్లి చెక్‌పోస్టు, రైల్వే స్టేషన్, ఎస్‌ఎన్ నం.1పై జైపూర్ మండలం ఇందారం బస్టాండ్, మంచిర్యాలలోని ఎస్‌బీహెచ్ ప్రధాన శాఖ, ఎఫ్‌సీఐ గోదాం, మందమర్రి మండలం రమణకాలనీ, సీ కేటగిరిలో జైపూర్ మండలం పావునూర్ ఎక్స్‌రోడ్డు, ఇందారం ఫారెస్టు చెక్‌పోస్టు, వరలక్ష్మీ రైస్ మిల్, మంచిర్యాలలోని లక్ష్మీ టాకీస్ ప్రాంతాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

No comments:
Post a Comment