హైద్రాబాద్ లో ఇంటి నెంబర్లకు ఎనిమిది డిజిట్లతో కోడ్
హైద్రాబాద్, జూలై 30,
హైద్రాబాద్ నగరంలో ఏదైనా అడ్రస్ వెతకబోతే... ఆగమయ్యే పరిస్థితి నేడు... అందుకే ఇల్లు కోసం గల్లీ గల్లీ తిరిగే పనిలేకుండా.. ఈజీగా అడ్రస్ దొరికేలా బల్దియా స్మార్ట్ చిరునామాలను అందుబాటులోకి తేనుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తున్నప్పటికీ నగరంలో ఇంటి నెంబర్ల సులభతరానికి చేస్తున్న ప్రయత్నం కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైన నగరవాసులకు సులభమైన ఇంటి నెంబర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిప్పర్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నెంబర్లను సులభతరం చేసే ప్రక్రియను చేపట్టారు. గగన్‌మహెల్, కూకట్‌పల్లిలోని రెండువార్డుల్లో దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇంటి నెంబర్ చెప్పాలంటే.. పదుల సంఖ్యలో అంకెలు.. బైలు.. డ్యాష్‌లు, కామాలు.., అబ్లిక్‌లు ఎట్‌సెట్రా.. వారం రోజులు కఠస్తం చేసినా.. గుర్తుండని అడ్రస్. చెప్పేవారికి..వినేవారికి ఇది కష్టమే... అయితే ఇక కఠిన చిరునామాకు చెక్ పెట్టనున్నారు. వాహన నెంబర్ల తరహాలో ఎనిమిది అంకెల్లో కోడ్ నెంబరు ఇవ్వనున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఆ నెంబర్‌ను ఎంటర్ చేయగానే పూర్తి చిరునామా ప్రత్యక్షమవుతుంది. ఇప్పటికే గగన్‌మహెల్, కూకట్‌పల్లిలోని రెండు వార్డుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేయగా, అందులో స్వల్ప మార్పులు చేస్తూ ఈ కొత్త విధానాన్ని చేపట్టారు. జిప్పర్ అప్లికేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సహకారంతో ప్రత్యేకంగా ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే గగన్‌మహల్, కూకట్‌పల్లి వార్డుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయగా... ప్రస్తుతం స్వల్ప మార్పులతో తుదిరూపం ఇవ్వనున్నారు. నాలుగు ఆంగ్ల అక్షరాలు, మరో నాలుగు అంకెల రూపంలో మొత్తం ఎనిమిది డిజిట్లలో ఈ కోడ్ ఉండనుంది. కోడ్‌ను మొబైల్ యాప్‌లో టైప్ చేయగానే చిరునామా వివరాలు ప్రత్యక్షమయ్యేలా తయారు చేస్తున్నారు. అక్షరాలు రోడ్డు నంబర్లను... అంకెలు ఇంటి నంబర్లను సూచించనున్నాయి. గూగుల్ మ్యాప్‌కు కూడా దీన్ని అనుసంధానం చేయనున్నారు. స్మార్ట్‌ఫోన్ లేకుంటే ఎస్‌ఎంఎస్ పం పినా అడ్రస్ తెలిసేలా టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నారు. నెల రోజు ల్లో పూర్తి డేటాను సేకరించి దశలవారీగా అమలు చేయనున్నారు.ఈ కోడ్ నెంబర్‌ను మొబైల్ యాప్‌లో ఎంటర్ చేయగానే చిరునామా ప్రత్యక్షమవుతుంది. గూగుల్ మ్యాపింగ్‌తో కూడా దీన్ని అనుసంధానం చేస్తున్నారు. ప్రాంతాలవారీగా వీధుల ప్రారంభంలో బోర్డులు ఏర్పాటు చేసి ఏ ఇంటి నెంబరు నుంచి ఏ ఇంటి నెంబరు వరకు ఆ వీధిలో ఉన్నాయో సూచిస్తారు. కొత్త నెంబర్లలో నాలుగు ఆంగ్ల అక్షరాలు, మరో నాలుగు అంకెలు(నెంబర్లు) ఉంటాయి. నాలుగు ఆంగ్ల అక్షరాల్లో రెండు ప్రధాన రహదారిని, మిగిలిన రెండు అనుబంధ రహదారిని సూచిస్తాయి. అలాగే, నాలుగు అంకెల్లో రెండు ప్రధాన ఇంటి నెంబర్‌ను, మిగిలిన రెండు అనుబంధంగా ఉండే ఇంటి నెంబర్లను సూచిస్తాయి. ప్రతి వంద విూటర్ల వరకు రోడ్డును ఒక సెగ్మెంట్‌గా పరిగణిస్తారు. ఇంగ్లీష్ లెటర్స్, 1 నుంచి 8 అంకెలను ఈ కోడ్‌లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు మూసారంబాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌కు నెంబర్లు కేటాయించాలనుకుంటే.. అందులో ముందుగా విజయవాడ వెళ్లే రహదారికి ంం అని, అలాగే దానికి అనుబంధంగా వెళ్లే సబ్‌రోడ్‌కు ఃః అని,అపార్ట్‌మెంట్‌కు 01గా, అందులోని మూడో నెంబరు ఫ్లాట్‌కు 03గా కేటాయిస్తారు. మొత్తంగా ంంఃః0103 అని ఉంటుంది. ఒకవేళ ఇండిపెండెంట్ ఇల్లయితే ంంఃః0100గా ఉంటుంది. ఈ నెంబర్‌ను స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్‌లో ఎంటర్ చేయగానే ఇంటి చిరునామా వివరాలు, ఎలా వెళ్లాలో కూడా గూగుల్ మ్యాప్ ద్వారా వివరంగా వస్తుంది. నేవిగేషన్ సెట్ చేసుకుంటే గూగుల్ మ్యాప్‌ద్వారా సులభంగా ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ లేకుంటే మామూలుగా ఎస్‌ఎంఎస్ పంపినా వెంటనే చిరునామా ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంది. దీనికోసం త్వర లో టోల్‌ఫ్రీ నెంబరు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

No comments:
Post a Comment