Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Thursday, 29 January 2015

నిజామాబాద్‌ :బంగారు తెలంగాణ నిర్మాణానికి కెసిఆర్‌ వినూత్న కార్యక్రమం...మూడేళ్లలో విద్యుత్‌ సమస్య నివారణ : రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేంధర్‌

బంగారు తెలంగాణ నిర్మాణానికి కెసిఆర్‌ వినూత్న కార్యక్రమం
మూడేళ్లలో విద్యుత్‌ సమస్య నివారణ : రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేంధర్‌
నిజామాబాద్‌ : తెలంగాణ సాధించుకున్నది ప్రజలంతా సుఖ శాంతులతో జీవించడానికేనని, బంగారు తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ వినూత్న కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేంధర్‌ అన్నారు. గురువారం జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలోని గుండెనెమ్లి గ్రామం వద్ద కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన 33/11 కె.వి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌ పూర్తయితే గుండెనెమ్లి, వాజిద్‌నగర్‌, బండరెంజల్‌లో లో వోల్టెజీ సమస్య తీరడంతో పాటు విద్యుత్‌ సమస్యనివారించబడుతుందని అన్నారు.
2వేల కోట్లతో 9300 చెరువుల పునరుద్దరణ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
మిషన్‌ కాకతీయ క్రింద రాష్ట్రంలో 46 వేల చెరువులు, కుంటలు ఉండగా ఈ యేడాది 9300 చెరువులను 2వేల కోట్ల రూపాయలతో పునరుద్దరించి సాగునీటి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో 701 చెరువుల ఉండగా ఈ సంవత్సరం ఆధునీకరిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసిన వర్షాలు పడకుంటే సాగునీటి సమస్య, విద్యుత్‌ సమస్య తీరదన్నారు. వర్షాలు కురవాలంటే భూమిపై పచ్చదనం అవసరమని, అందుకోసం వచ్చే మూడేళ్ళలో 230 కోట్ల చెట్టు పెట్టి పెంచాలని మంత్రి ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు హన్మంత్‌షిండే అధ్యక్షత వహించారు. జడ్పీచైర్మన్‌ ధఫేదార్‌ రాజు, జహిరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు బిబి పాటిల్‌, ఎంఎల్‌సి రాజేశ్వర్‌ రావు, సంయుక్త కలెక్టర్‌ రవీంధర్‌ రెడ్డి, ఆర్‌డివో శ్యాంప్రసాద్‌లాల్‌, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks