పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : జాయింట్ కలెక్టర్ అమ్రపాలి
రంగారెడ్డి : జిల్లాలో పదవ తరగతి పరిక్షలు పకడ్బందీగా నిర్వలహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అమ్రపాలి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని స్పూర్తిభవన్‌లో పదవ తరగతి పరిక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జెసి మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పరిక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. అతి సున్నిత కేంద్రాల వద్ద గట్టి పోలాసు బందోబస్తు ఏర్పాటు చేయాలని. ప్రతి పరిక్షా కేంద్రం వద్ద మెడికల్ కిట్‌తో పాటు ఒక ఎఎన్‌ఎం ను నియమించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లను అందుబాటులో ఉంచుకోవాలని ఆమె సూచించారు. నిరంతరం విద్యుత్ సదుపాయం అలాగే ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని సంబందిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లాలో మొత్తం 427 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, మొత్తం 94,181 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు, ఇందులో 86,531 మంది రెగ్యులర్ విద్యార్తులు కాగా 8,830 మంది ప్రైవేట్ విద్యార్థులని జెసి వెల్లడించారు. పరీక్షల నిర్వహాణకు గాను 4,710 మంది ఇన్విజిలేటర్లు, 45 రూట్ అధికారులు, 427 చీఫ్ సూపరింటెండెంట్‌లను, 20 ప్లయింగ్ ప్వాడ్‌లను నియమించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను ఉదయం 9.30 నుండి 12.15 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, నూతన సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు వీలుగా 15 నిమిషాలు అదనంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రయివేట్ విద్యార్థులకు మాత్రం ఉదయం 9.30 నుండి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. గత సంవత్సరం నిర్వహించిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సహాకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సుభాష్ చంద్రబోస్, ఆర్డివో దుర్గాదాస్, సైబారాబాద్, వికారాబాద్ పోలీసు అధికారులు, పోస్టల్, ఆర్టీసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment