కోటి లడ్డూల ప్రసాదం
తిరుపతి, జూన్ 6,
కలియుగ వైకుంఠం తిరుమల. ఆ శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తుల వస్తుంటారు. భక్తులకు శ్రీవారంటే అంత భక్తో.. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే అంతే మక్కువ. తిరుమల వచ్చిన ప్రతి భక్తుతు లడ్డూ ప్రసాదం తినకుండా వెళల్డు. అలాంటి తిరుమల శ్రీవారి లడ్డూ మరో కొత్త రికార్డ్ సృష్టించింది.
వేసవిలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీకి తగ్గట్టు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంటుంది. ప్రసాదం పంపిణీలో కూడా అలాంటి భారీ ఏర్పాట్లనే చేస్తుంది. ఈ ఏడాదీ మే నెలలో ప్రసాదం పంపిణీలో టీటీడీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. భక్తులకు ఏకంగా కోటి లడ్డూలు పంపిణీ చేసింది. ఆలయ చరిత్రలో అదే అత్యధికం. ఈ విషయాన్ని శ్రీవారి ఆలయ పోటు అధికారులు లెక్క తేల్చి ప్రకటించారు.
గత నెలలో 25.08 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు రూ.20కి రెండు లడ్డూలు, రూ.50చొప్పున అదనంగా మరో రెండు లడ్డూల వంతున ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలు అందిస్తారు. కాలినడకన వచ్చే భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా.. రాయితీపై 2, అదనంగా మరో 2 లడ్డూలు కలిపి మొత్తం 5 లడ్డూలు ఇస్తారు. వికలాంగులకు, వృద్ధులకు కూడా ఇదే కోటాను టీటీడీ వర్తింపజేస్తోంది. ఇక వీఐపీ, స్పెషల్ దర్శనం టికెట్లపై రెండు లడ్డూలు ఉచితంగా, మరో రెండు లడ్డూలు అదనంగా ఇస్తోంది. ఆర్జిత సేవలపైనా ఉచితలడ్డూతో పాటు అదనపు లడ్డూలను విక్రయిస్తోంది.
ఈ లెక్కన 25.08లక్షల భక్తులకు సగటున నాలుగు లడ్డూల చొప్పున కోటికిపైగా లడ్డూల పంపిణీ జరిగింది. గతనెల 28న ఒక్క రోజులో 4.05లక్షల లడ్డూలను టీటీడీ భక్తులకు అందించింది. అంటే కోటి లడ్డూలతో టీటీడీ రికార్డ్ సృష్టించింది. వేసవి సెలవులు కావడంతో సాధారణంగా మే నెలలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గత నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో లడ్డూల పంపిణీ కూడా అదే స్థాయిలో జరిగింది.

No comments:
Post a Comment