రోగుల సహనాన్ని టెస్ట్ చేస్తున్న చెస్ట్
హైదరాబాద్, జూన్ 11,
పేదలకు మెరుగైన వైద్యమందించేందుకు ఏర్పాటైన చెస్ట్ హాస్పెటల్ లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఇక్కడి వసతులలేమి రోగుల సహనానికి పరీక్షపెడుతోంది. బ్లడ్ టెస్ట్ లు చేయించుకోవాలన్నా, హాస్పిటల్లో బెడ్ దొరకాలన్నా నెలల తరబడి వేచి ఉండాల్సిందే. చాంతాడంత ఉంటే వెయిటింగ్ లిస్ట్ లో తమ టర్న్ ఎప్పుడొస్తుందో తెలీక రోగులు నానాపాట్లు పడుతున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడి పరిస్థితి చూసి విసిగెత్తిపోతున్నారు.
టిబి, ఆస్తమా రోగాల ట్రీట్ మెంట్ కు చెస్ట్ హాస్పిటల్ ను ఏర్పాటుచేశారు. అయితే ఆసుపత్రి తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉంది. చికిత్స కోసం రోజుల తరబడి రోగులు వేచి ఉండాల్సిన స్థితి నెలకొంది. టెస్ట్ ల పేరుతో కాలయాపన జరుగుతోంది. ఈ హాస్పిటల్ కు సాధారణంగా పేద రోగులే అధికంగా వస్తుంటారు. దీంతో ఇంటికి వెళ్లి తిరిగి రాలేక ఆసుపత్రి ప్రాంగణంలోనే అనేకమంది కాలం వెళ్లదీస్తున్నారు.
చెస్ట్ హాస్పిటల్ లో టీబీ, ఆస్తమా రోగులందరికీ ఒకే ప్రాంగణంలో చికిత్సనందించడం ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నా హాస్పిటల్ లో మార్పులు చేపట్టకపోవడం మరో సమస్య. మొత్తంగా చెస్ట్ హాస్పిటల్ రోగుల సహనాన్ని టెస్ట్ చేస్తోంది. ఆసుపత్రిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించి మెరుగైన చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

No comments:
Post a Comment