Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad
Showing posts with label జాతీయం. Show all posts
Showing posts with label జాతీయం. Show all posts

Saturday, 30 July 2016

ముంబయిలో అవిభక్త కవలలు

ముంబయిలో అవిభక్త కవలలు


ముంబై, జూలై 30, 
అవిభక్త కవలలు అనగానే అందరికీ వీణా వాణి గుర్తొస్తారు. తాజాగా ఇలాంటి కేసే ముంబైలోని ఓ హాస్పిటల్‌ లోని డాక్టర్లకు ఎదురయ్యింది. అయితే ఇక్కడ మాత్రం ఆ ఇద్దరు కవలలకు తలలు తప్పించి శరీరంలోని అన్ని కీలకమైన అవయాలు కలిసి ఉన్నాయి. వీరిద్దరి పుట్టినప్పుడు 4.5 కేజీల బరువు ఉన్నారని డాక్టర్లు తెలిపారు. చాలా అరుదైన సందర్భాల్లోనే ఇలాంటి కవలలు పుడతారని వారంటున్నారు. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ రిపోర్టర్ల ప్రకారం వారిలో గుండె,మూత్రపిండాలు,లివర్‌ వేరు వేరుగా ఉన్నాయని.. కానీ ఊపిరితిత్తులు మాత్రం ఒక బిడ్డలోనే ఉందని వెల్లడించారు. ప్రతీ రెండు లక్షల జననాల్లో ఇలాంటి కేసు ఒకటి ఉంటుందని అలానే వారు బ్రతికే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని అన్నారు

మోడీ టూర్‌ ఇలా... నాలుగు గంటల్లో ఆరు కార్యక్రమాలు..

 మోడీ టూర్‌ ఇలా...
నాలుగు గంటల్లో ఆరు కార్యక్రమాలు..


న్యూఢిల్లీ, జూలై 30,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో తొలిసారి వస్తున్నారని, ప్రధాని పర్యటన ఏర్పాట్లు అదరాలె అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వచ్చేనెల 7న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'మిషన్‌ భగీరథ' ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి రానున్నారు. మిషన్‌భగీరథ ప్రారంభానికి కోమటిబండకు వస్తున్న ప్రధాన మంత్రికి ప్రాజెక్టుకు సంబందించిన డిజైన్లుతో పాటు చేపట్టిన పనులపై ఫోటో ప్రదర్శన ఏర్పాట్లు చేయాలనికోరారు. ప్రధాన మంత్రి పర్యటనకు రాష్ట్రంలోని అన్నిశాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ప్రధాన మంత్రి పాల్గొనే బహిరంగ సభకు జనసవిూకరణతో పాటు ఏర్పాట్లు సైతం ఘనంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటలను జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు
ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
ప్రధాన మంత్రి ¬దాలో తొలిసారిగా తెలంగాణ పర్యటనకు ఈనెల 7న ప్రధాని వస్తున్నారు. ఇందులోభాగంగా 4 గంటల వ్యవధిలో 6 కార్యక్రమాలను ప్రారంభం, శంఖుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.10గంలలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. 2.20గంటల కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 2.25గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌ నియోజవర్గం కోమటిబండకు బయిలుదేరుతారు. 2.50కు హెలిప్యాడ్‌లో దిగుతారు. హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా మిషన్‌భగీరథ ప్రారంభ ప్రాంతానికి మ.3.గంటలకు చేరుకుంటారు. మద్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.15 వకు పలు అభివృద్ధి పనులను ప్రారంభం, శంఖుస్థాపన చేస్తారు. మిషన్‌భగీరథ తొలిదశను సీఎం కేసీఆర్‌తో కలిసి మోడీ ప్రారంభించనున్నారు. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించే 1600 మెగావట్ల ధర్మల్‌ విద్యుత్‌ప్లాంట్‌, రామగుండం ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌కు రిమోట్‌ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీని రిమోట్‌ ద్వారా ప్రారంభించనున్నారు. మనోహరబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేసి ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. సాయంత్రం 4.25గంటలకు గజ్వేల్‌ హెలిప్యాడ్‌ నుంచి బేగంపేటకు బయల్దేరుతారు. సాయంత్రం 5.15గంటలకు లాల్‌బహదూర్‌ స్టేడియం చేరుకుని బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం 6.35గంటలకు బేగంపేట చేరుకుని ఢిల్లీ బయలుదేరుతారు.

మార్చి తర్వాత ఎస్‌ బీహెచ్‌ ఉండదు

మార్చి తర్వాత ఎస్‌ బీహెచ్‌ ఉండదు
ముంబై, జూలై 30,
దశాబ్దాల పాటు సేవలందించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ వచ్చే మార్చి నుంచి పూర్తిగా అంతర్థానం కానుంది. ఎస్‌ బీ ఐ ఛైర్‌ పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. ఎస్‌ బి హెచ్‌ తో పాటు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌ కోర్‌, మరో మూడు బ్యాంకులు స్టేట్‌ బ్యాంకులో విలీనమైపోతాయని చెప్పారు. అయితే ఖాతాదారుల ప్రయోజనాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని, ఎవరికీ నష్టం రానీయబోమని, ఇప్పటికే ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లు చేసిన వారికి అదే రీతిన వడ్డీరేట్లు కంటిన్యూ అయ్యేట్లు చూస్తామని తెలిపారు. ఓ పక్క విలీనాన్ని వ్యతిరేకిస్తూ 80 వేల మంది ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ సిబ్బంది సమ్మె చేస్తుండగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మార్పు తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. ఎస్‌బీఐ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అందిస్తున్న ఎస్‌బీఐ ఎక్స్‌క్లూసిఫ్‌ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో అరుందతీ భట్టాచార్య అన్నారు.

బీజేపీతో తెగతెంపులకు బాబు నో..

 బీజేపీతో తెగతెంపులకు బాబు నో..
న్యూఢిల్లీ, జూలై 30,
పార్లమెంట్‌ లో ఏపీకి మళ్లీ అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా నిరాకరించడాన్ని తప్పుపట్టారు. ''అవమానాలను.. అన్యాయాలను సహించేది లేదన్నారు. ప్రత్యేక ¬దాపై అరుణ్‌ జైట్లీపై సమాధానం అసంతృప్తి కలిగించింది. బాధను మిగిల్చింది. విభజన చేసిన తర్వాత ఆర్థిక సంఘం చివరి వరకు ఏపీకి లోటు బడ్జెట్‌ ఉంటుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది ఏవిూ లేదు. పార్లమెంట్‌ చర్చలు బాధేస్తుంది. ప్రత్యేక చర్చతో ఒరిగింది ఏమిటి..? మొదటి రెండు రోజులు హంగామా చేసిన కాంగ్రెస్‌.. పరిణతి చెందిన పార్టీగా ప్రవర్తించలేదు. విభజన చట్టంలో పెట్టిన వాటిపై ఎందుకు పెదవి విప్పలేదు. నిమిషంలోనే అంతా తేల్చేసింది. బీజేపీ కూడా అన్యాయం చేసింది. మూడు రోజులు కూడా ఓపిక పట్టింది రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఎదురుచూశాను. కేంద్రంపై నేను ఆధారపడటం లేదు. మన కష్టమే మనకు మిగులుతుందని చెబుతున్నాను.మిత్రపక్షమైనంత మాత్రాన సాయం చేయలేమన్నారు జైట్లీ. ఆ రోజు విూకు తెలియదా..? డబ్బులు లేనప్పుడు విభజన ఎందుకు చేశారు.? మా మానాన మమ్మల్ని వదిలేయొచ్చు కదా.. రెండేళ్ల పసిబిడ్డపై కనికరం చూపరా..? యాభై రెండు శాతం ప్రజలనున్న ఏపీకి 47 శాతం ఆదాయం.. 42 శాతం ఉన్న ప్రజల తెలంగాణ ఆదాయం 57 శాతం. అడ్డగోలుగా విభజించారు. సుప్రీం కోర్టు కూడా తప్పుపట్టింది. సమతుల్యం లేకుండా విభజన జరిగిందని చెప్పింది. ఇంత వరకు ఏం చేయలేకపోయింది కేంద్రం. బాధతో అడుగుతున్నాం. త్వరగా పరిష్కరించండి. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఎదిగే శక్తి మాకు ఇవ్వండి. ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరు.. మరింత ఓపికగా పనిచేస్తాను'' చెప్పుకొచ్చారు చంద్రబాబు.ఏపీకి న్యాయం చేసే విషయంలో అవసరమైతే ఒక కమిటీ వేయాలంటూ.. సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి చేసిన ప్రతిపాదనను చంద్రబాబు సమర్థించారు. దీనిపై కేంద్రం దృష్టిసారించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కోరారు.మరోవైపు బీజేపీతో తెగతెంపులపై విలేఖర్లు అడిగిన ప్రశ్నకు దాటవేత ధోరణితో మాట్లాడారు చంద్రబాబు. స్పష్టత ఉండాలి.. కమిట్‌ మెంట్‌ లేకుండా పని చేయలేనని చెప్పారు. మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటామని చెప్పారు. ఇంకా టైమ్‌ ఉంది. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారు. ఎలా వెళ్లాలో అలా వెళ్లి కేంద్రం నుంచి రావల్సినవి రాబట్టుకుంటానని చెప్పారు.

Saturday, 11 June 2016

సచివాలయం పనులు చకచకా

సచివాలయం పనులు చకచకా


విజయవాడ, జూన్‌ 11, (
అంధ్రప్రదేశ్‌ లో పాలనకు అన్నీ రెడీ అవుతున్నాయి.వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.ఎల్‌అండ్‌టీ చేపట్టిన 3,4,5 బ్లాకుల్లో గ్రౌండ్‌ఫ్లోర్‌ పై అంతస్తులో తేలికపాటి బ్రిక్స్‌తో గదుల నిర్మాణం చివరిదశకు చేరుకుంది.షాపూర్జీ అండ్‌ పల్లోంజీ కడుతున్న1,2 బ్లాకుల్లో కింది ఫ్లోర్లలో గదుల పనులు కూడా పూర్తికావచ్చాయి. పై అంతస్తుల్లో సెంట్రింగ్‌ తొలగించి గదుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐదు బ్లాకుల్లోనూ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.గోడలు కట్టేందుకు బ్రిక్స్‌ను కూలీలతో భవనాల్లోకి చేర్చుతున్నారు. కట్టిన గదులకు సిమెంట్‌లో తయారు చేసిన రెడీమేడ్‌ విండోస్‌ను అమర్చుతున్నారు. ఇప్పటికే సచివాలయానికి సామాగ్రి కూడా చేరుకుంటుంది. ఎలక్ట్రికల్‌, ఫ్లోరింగ్‌, సీలింగ్‌, ఫ్లంబర్‌ పనులు చేసేందుకు సామాగ్రి సచివాలయ ప్రాంగణానికి వచ్చేసింది. రాజస్థాన్‌ నుంచి కజారియా కంపెనీ నుంచి షాపూర్జీ సంస్థ టైల్స్‌ను కూడా తెప్పించారు. ఫ్లంబర్‌ పని చేపట్టేందుకు కూడా వర్కర్లు సిద్ధమౌతున్నారు. ప్రస్తుతం గదుల నిర్మాణం పూరైన బ్లాకుల్లో ఎలక్ట్రికల్‌ వైర్లు అమర్చే పని జరుగుతోంది. సచివాలయ ప్రాంగణంలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు కుడా వేగంగా సాగుతున్నాయి. మందడం- ఐనవోలు రోడ్డు నుంచి సచివాలయ భవనాల వద్దకు మొదట రెండు రోడ్లల పనులు మొదలు పెట్టారు. తాజాగా మరో రోడ్డు వేస్తున్నారు.అలాగే ప్రతి రోడ్డును, ప్రతి భవనాన్ని కలుపుతూ అడ్డంగా మరో మూడు రోడ్లు మొదలు పెట్టారు. అయితే కొద్దిరోజులుగా వాతావరణం మారి అడపాదడపా వాన జల్లులు పడుతుండడంతో సచివాలయ నిర్మాణ పనులకు కొద్దిగా ఆటంకం ఏర్పడిందని అధికారులు అంటున్నారు. సచివాలయ పనులకు అదనంగా కూలీలను రప్పించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి రెండు వందల మందికి పైగా కూలీలు ఇప్పటికే ఇక్కడకు చేరుకుని పనులు చేస్తున్నారు. 

Sunday, 5 June 2016

  కోటి లడ్డూల ప్రసాదం


తిరుపతి, జూన్‌ 6,
కలియుగ వైకుంఠం తిరుమల. ఆ శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తుల వస్తుంటారు. భక్తులకు శ్రీవారంటే అంత భక్తో.. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే అంతే మక్కువ. తిరుమల వచ్చిన ప్రతి భక్తుతు లడ్డూ ప్రసాదం తినకుండా వెళల్డు. అలాంటి తిరుమల శ్రీవారి లడ్డూ మరో కొత్త రికార్డ్‌ సృష్టించింది.
వేసవిలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీకి తగ్గట్టు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంటుంది. ప్రసాదం పంపిణీలో కూడా అలాంటి భారీ ఏర్పాట్లనే చేస్తుంది. ఈ ఏడాదీ మే నెలలో ప్రసాదం పంపిణీలో టీటీడీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. భక్తులకు ఏకంగా కోటి లడ్డూలు పంపిణీ చేసింది. ఆలయ చరిత్రలో అదే అత్యధికం. ఈ విషయాన్ని శ్రీవారి ఆలయ పోటు అధికారులు లెక్క తేల్చి ప్రకటించారు.
గత నెలలో 25.08 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు రూ.20కి రెండు లడ్డూలు, రూ.50చొప్పున అదనంగా మరో రెండు లడ్డూల వంతున ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలు అందిస్తారు. కాలినడకన వచ్చే భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా.. రాయితీపై 2, అదనంగా మరో 2 లడ్డూలు కలిపి మొత్తం 5 లడ్డూలు ఇస్తారు. వికలాంగులకు, వృద్ధులకు కూడా ఇదే కోటాను టీటీడీ వర్తింపజేస్తోంది. ఇక వీఐపీ, స్పెషల్‌ దర్శనం టికెట్లపై రెండు లడ్డూలు ఉచితంగా, మరో రెండు లడ్డూలు అదనంగా ఇస్తోంది. ఆర్జిత సేవలపైనా ఉచితలడ్డూతో పాటు అదనపు లడ్డూలను విక్రయిస్తోంది.
ఈ లెక్కన 25.08లక్షల భక్తులకు సగటున నాలుగు లడ్డూల చొప్పున కోటికిపైగా లడ్డూల పంపిణీ జరిగింది. గతనెల 28న ఒక్క రోజులో 4.05లక్షల లడ్డూలను టీటీడీ భక్తులకు అందించింది. అంటే కోటి లడ్డూలతో టీటీడీ రికార్డ్‌ సృష్టించింది. వేసవి సెలవులు కావడంతో సాధారణంగా మే నెలలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గత నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో లడ్డూల పంపిణీ కూడా అదే స్థాయిలో జరిగింది. 

కొత్త ఫీచర్‌ తో ఇన్‌ స్ట్రాగ్రాం

  కొత్త ఫీచర్‌ తో ఇన్‌ స్ట్రాగ్రాం
సెంట్రల్‌ డెస్క్‌, జూన్‌ 6,
ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాగ్రాం కొత్త అప్‌డేట్‌తో త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వెర్షన్‌లో ఇన్‌స్టాగ్రాం మరింత ఆకర్షణీయమైన లుక్‌తో యూజర్లకు దర్శనమివ్వనుంది.ఇన్‌స్టాగ్రాం యాప్‌లో ఇప్పటి వరకు యూజర్లు అప్‌లోడ్‌ చేసిన తేదీ, సమయాన్ని బట్టి ఫొటోలు, వీడియోలు ఓ వరుస క్రమంలో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ వరుస క్రమాన్ని ఇన్‌స్టాగ్రాం ప్రతినిధులు మార్చి యూజర్లకు అందివ్వనున్నారు. ఇకపై కొత్త ఇన్‌స్టాగ్రాం వెర్షన్‌లో ఫొటోలు, వీడియోలు యూజర్ల అభిరుచులకు అనుగుణంగా కనిపించనున్నాయి. యూజర్‌ వయస్సు, అతను సెర్చ్‌ చేసే కంటెంట్‌ తదితర వివరాలకు అనుగుణంగా ఆయా ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రాం తెరపై దర్శనమివ్వనున్నాయి. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం అంతర్గతంగా టెస్ట్‌ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్‌తో కూడిన అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రాం విడుదల చేయనుందని సమాచారం. అయితే ఫైనల్‌ అప్‌డేట్‌ విడుదలైతే గానీ కొత్త వెర్షన్‌ ఎలా ఉంటుందనే విషయం ఇంకా చెప్పలేమని పలువురు టెక్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కొనసాగుతున్న జాట్‌ ల అందోళన

 కొనసాగుతున్న జాట్‌ ల అందోళన
హిస్సార్‌, జూన్‌ 6,
హర్యానాలో 9 జిల్లాలు అట్టుడుకుతున్నాయి.. జాట్లు రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని మళ్ళీ ప్రారంభించడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తమకు రిజర్వేషన్లను 15 రోజుల్లోగా అమలు చేయాలని జాట్లు హర్యానా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.జాట్లు ఈసారి పట్టణాల్లో కాకుండా గ్రావిూణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హిస్సార్‌ జిల్లాలోని మయ్యర్‌, భివానీ జిల్లాలో ధనానా, రోహ్‌తక్‌ జిల్లాలోజసియా, పానిపట్‌ జిల్లాలో మత్లోడ, రేవారి జిల్లాలో బేవల్‌ గ్రామాల్లో నిరసనలు ప్రారంభించారు. మరో వైపు శాంతిభద్రతలను కాపాడేందుకు 55 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు.
9 జిల్లాల్లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 144ను విధించారు. ఎక్కడైనా ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కు మంది గుమిగూడి ఉండకూడదని పేర్కొన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, రైల్వే ట్రాకుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రోహ్‌తక్‌, జజ్జర్‌, సోనిపట్‌, జింద్‌, భివా?న, హసార్‌, ఫతేబాద్‌, పానిపట్‌, కైతల్‌ జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.
సోనిపట్‌ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్‌ సర్వీసులను నిషేధించారు. రోడ్ల దిగ్బంధం, ఆస్తుల విధ్వంసం, ప్రాణ హాని వంటి చట్టవిరుద్ధ సంఘటనలు ఇంటర్నెట్‌ ద్వారా జరగకుండా జాగ్రత్త తీసుకోవడానికే ఈ విధంగా నిషేధ: విధించినట్లు తెలుస్తోంది.జాట్లకు రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతో జాట్లలోని ఓ వర్గం రిజర్వేషన్ల పోరాటాన్ని మళ్ళీ ప్రారంభించింది.

Wednesday, 11 May 2016

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో ఎంపి కవిత భేటీ

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో ఎంపి కవిత భేటీ

నిజామాబాద్ ఎంపి కవిత ఆధ్వర్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, 50మంది రైతులు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ను బుధవారం కలిశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. రైతు సమస్యలను పరిష్కరించాలని, కరవు నిధులను ఇవ్వాలని కవిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ముంచుకొస్తున్న క షా? పుష్కరాలు - పూర్తికాని ఫ్లయివోవర్‌ పనులు

ముంచుకొస్తున్న క షా? పుష్కరాలు - పూర్తికాని ఫ్లయివోవర్‌ పనులు


విజయవాడ,
బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మరో ఉత్సవం సమీపిస్తోంది....అదే క షా? పుష్కరాలు. ఆంధ్రపదేశ్‌ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగనున్న ఈ పుష్కరాలకు లక్షల్లో భక్తులు వస్తారని అంచనా. వీరి ఒత్తడిని తట్టుకోవాలంటే, అత్యవసరంగా దుర్గగుడి వద్ద ఫ్లయివోవర్‌ నిర్మాణం పూర్తవ్వాలి. సరిగ్గా పుష్కరాలకు మూడు నెలల గడువు ఉండగా, ఇంకా ఫ్లయివోవర్‌ నిర్మాణం ఓ కొలిక్కి రాలేదు. దీనితో పుష్కరాలకు ఫ్లయివోవర్‌ సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు.
నవ్యాంధ్ర ప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని విజయవాడ... ఓ ట్రాఫిక్‌ పద్మవ్యూహంగా మారిపోయింది. హైదరాబాదు నుంచి విజయవాడకు రావడం ఒక ఎత్తు... విజయవాడ నగర శివారు నుంచి నగరంలోకి రావడం మరో ఎత్తు... దుర్గగుడి వద్ద ఇపుడు ఫ్లయివోవర్‌ నిర్మాణ పనులు చేస్తుండటంతో, హైవేని దారి మళ్లించారు. ఇపుడు నగరంలోకి ఏ వాహనం రావాలన్నా... బైపాస్‌ రోడ్డులో విజయవాడ వన్‌ టౌన్‌ మీదుగా రావాల్సిందే. ఈ ట్రాఫిక్‌ కష్టాల సంగతి ఎలా ఉన్నా... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దుర్గగుడి ఫ్లయి వోవర్‌ నిర్మాణం అవుతున్నందుకు బెజవాడవాసులు సంత ప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఈ ఫ్లయివోవర్‌ నిర్మాణం వచ్చే క షా? పుష్కరాలకు పూర్తి అవుతుందా అనే అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. ఆగస్టు 11 నుంచి క షా? పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ లోగా ఫ్లయివోవర్‌ పనులు పూర్తి చేయాలని అధికారులు హడావుడి పడుతున్నారు. దుర్గగుడి ఫ్లయివోవర్‌ పనులను 333 కోట్లతో చేపట్టిన సోమా కనస్ట్రక్సన్‌ కంపెనీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే తాము యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని, కానీ భూసేకరణ, ఇరిగేషన్‌, విద్యుత్‌ అనుమతులు రావడంలో కొంత ఆలస్యం వల్ల పనులు అనుకున్నట్లు సాగడం లేదని చెపుతున్నారు. పుష్కరాల లోగా ఫ్లయివోవర్‌ సాద్యం కాదని చేతులెత్తేస్తున్నారు.
ఈ ఫ్లయివోవర్‌ ప్రాజెక్టును మొత్తం 447 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఇందులో 6 లైన్ల ఫ్లయి వోవర్‌, దాని కింద 4 లైన్ల రోడ్డు నిర్మాణాలున్నాయి. దుర్గ గుడి వద్ద 50 పిల్లర్లతో ఫ్లయివోవర్‌... అందులో 12 పిల్లర్లు క షా? నదిలోకి నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే తప్పించి దుర్గ గుడి వద్ద పుష్కరాల ట్రాఫిక్‌ రద్దీని తట్టుకోవడం కష్టం. కానీ, ఫ్లయివోవర్‌ పనులు పుష్కరాలకు పూర్తి చేయడం అసాధ్యమని, వచ్చే ఆగస్టు కల్లా కనీసం 4 లైన్ల రోడ్డయినా పూర్తి చేయాలనే పట్టుదలతో అధికార యంత్రాంగం ఉంది. ఇప్పటికే ట్రాఫిక్‌ ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.
ఫ్లయివోవర్‌ నిర్మాణం చేపట్టిన 5 నెలలకే చాలా ప్రగతిని కనబరిచిన అధికార యంత్రాంగం, పుష్కరాల లోగా ట్రాఫిక్‌ ఇబ్బందులను క్లియర్‌ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ఉచిత బహుమతుల వాన

 చెన్నై:
మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు. ఎన్నికల సీజన్‌లో తమిళనాడులో ఉచిత బహుమతుల వాన కురుస్తున్నది. ప్రణాళికల్లో, వాగ్దానాల రూపంలో ఎవరెన్ని ఉచిత సరుకులివ్వగలరన్న దానికి పోటీపడుతున్నారు. డీఎంకే తన ప్రణాళిక ప్రచురించిన తర్వాత, ఎన్నికలకు కేవలం పది రోజుల
ముందు ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించారు. ఏఐఏడీఎంకే ఈసారి ప్రణాళికలో చెప్పిందేమంటే....
తాము మళ్ళీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణం పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. రేషన్‌ కార్డున్న ప్రతి ఒక్కరికీ మొబైల్‌ ఫోన్‌ ఇస్తారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్నెట్‌తో సహా ల్యాప్‌టాప్‌లు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ 'అరస' నుండి టీవీ కనెక్షన్‌ కోసం సెట్‌ టాప్‌ బాక్స్‌ ఉచితంగా ఇస్తామన్నారు. 100 యూనిట్ల వరకు విద్యుత్‌ వాడకానికి ఛార్జీలు చెల్లించక్కర్లేదు. దీనివల్ల సుమారు 78 లక్షల కుటుంబాలకు మినహాయింపు లభిస్తుంది. సర్వత్రా ఉచితంగా
వైఫై కనెక్షన్‌ హామీ కూడా ఇచ్చారు. అన్నిటికంటే ఆకర్షణీయమైన హామీ మహిళలకు స్కూటర్‌ / మోపెడ్‌ కొనుక్కోడానికి 50 శాతం ధర ప్రభుత్వం
చెల్లిస్తుంది. 'అమ్మ' గారి తాయిలాల సంచి నుండి ఉప్పొంగుతున్న హామీలకు కారణం గత కొద్ది రోజులుగా ఏఐడీఎంకే ప్రజాభిమానంలో కొంత కొరత
ఏర్పడటమే. హామీల పరుగులో డీఎంకే పెద్ద సవాలే చేసింది. తాను అధికారంలోకి వస్తే 16 లక్షలమంది పాఠశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ ఇస్తామని
ప్రకటించారు. పేద కుటుంబాల వారందరికీ స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తామన్నారు. వ్యవసాయ, విద్యా రుణ మాఫీ, విద్యుత్‌-పాల ధర తగ్గింపు ప్రకటించారు. జయలలిత తన ప్రణాళికలో వీటన్నిటితో పాటు తనవి కొన్ని జోడించారు. సాధారణంగా లెక్కలు వేసి చూస్తే తెలుస్తున్నది ఏమంటే ఏఐడీఎంకే ప్రణాళికా హామీలు అమలుపర్చడానికి ఏడాదికి రు.10 వేల కోట్లు అదనంగా ఖర్చవుతుంది. తమిళనాడులో విద్యా రుణాల పరిమాణం 2015 మార్చి 31 నాటికి రు.16,482 కోట్లు ఉంది. ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరూ ఈ రుణమాఫీ హామీ ఇవ్వటంతో ఈ బరువు రాష్ట్ర ఖజానాయే భరించాల్సి ఉంటుంది. తమిళనాడులో ఈ విధంగా సరుకులు, సేవలు పంపకం కొత్తేమీ కాదు. తమిళనాడులో రు.2/-లకు కిలో బియ్యం పథకం చాలాకాలం క్రిందే అమలులోకి వచ్చింది. ఆ తర్వాత అది దేశమంతటా విస్తరించింది.
ఎం.జి.రామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పిల్లలు బడి మానేసే రేటును
తగ్గించింది. తర్వాత అది జాతీయ పథకంగా 'మిడ్‌ డే మీల్‌' పేరుతో దేశంలో ఇతరత్రా విస్తరించింది. విద్యార్థినులకు సైకిళ్ళు ఇచ్చే పథకం కూడా
తమిళనాడులోనే మొదలైంది. క్రమంగా దీరెకాలపు ఆర్థిక సామాజిక కార్యక్రమాలకు బదులు సరుకులు చేతికందించడం ద్వారా ఓట్లు అడిగే ప్రక్రియ
బలపడింది. కలర్‌ టీవీ, ల్యాప్‌టాప్‌, వంటింటి సామాగ్రి - ఈ మూడు పథకాల వల్ల ఒక దశాబ్దంలో రాష్ట్ర ప్రభుత్వం రు.11,561 కోట్లు ఖర్చు పెట్టింది.
ఇదికాక తమిళనాడు ప్రభుత్వం పంచెలు, చీరలు, చెప్పుల కొరకు కూడా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ విధంగా ఉచితంగా హామీలతో
తమిళనాడు ఆర్థిక వ్యవస్థకి నష్టం జరుగుతున్నదా లేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చనియాంశమవుతున్నది.

రాజమహేంద్రవరం : కాంతుల్లో రోడ్డు కమ్‌ రైల్వే బ్రిడ్జికి...

రాజమహేంద్రవరం,
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్డు కం రైలు వంతెనగా పేరుగాంచిన ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రధాన వారధి అయిన రోడ్డు కం రైలు వంతెన ఇకపై విద్యుత్‌ వెలుగులతో కాంతులీననుంది. గోదావరి మహా పుష్కరాల సందఠంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 20 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్రంగానే ఉండి ప్రత్యక్షంగా ఈ ప్రాంతాన్ని వీక్షించారు. ఈసందఠంగా రోడ్డు కం రైలు వంతెనకు రాత్రి సమయాల్లో విద్యుత్‌ సదుపాయం లేకపోవడాన్ని గుర్తించారు. అయితే పుష్కరాల సందఠంగా తాత్కాలికంగా విద్యుత్‌ను ఏర్పాటు చేశారు. పుష్కరాల 12 రోజులపాటు రోడ్డు కం రైలు వంతెన విద్యుత్‌ అలంకరణతో కాంతులు చిమ్మింది. అనంతరం మళ్లీ వంతెనను చీకటి ఆవరించింది. ఈనేపథ్యంలో ఈ వంతెనకు శాశ్వతంగా విద్యుత్‌ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పర్యాటకశాఖాధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. రెండు నెలలుగా ఈ వంతెనపై విద్యుత్‌ అలంకరణ పనులను రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో సంబంధిత ఎలక్ట్రికల్‌ విభాగం చేపట్టింది. ఈ వంతెనకు విద్యుత్‌ అలంకరణ పనులు పూర్తయ్యాయి.
ఈనేపథ్యంలో ఈనెల 18వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్‌ అలంకరణను ప్రారంభించనున్నారు. ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని నగరంలోని మున్సిపల్‌ స్టేడియంలో జరిగే కార్యక్రమం సందఠంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్‌ స్టేడియంలో జరిగే కార్యక్రమం మధ్యాహ్నం పూట కావడంతో రాత్రి సమయంలో విద్యుత్‌ అలంకరణకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేలా అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో జరిగే బహిరంగ సభ ఆ రోజు సాయంత్రం ఆరు గంటల దాటిన తర్వాత జరిగే అవకాశం ఉంది. ఈ సందఠంగా పెద్దాపురంలో జరిగే బహిరంగ సభ వేదికపై నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రోడ్డు కం రైలు వంతెనపై విద్యుత్‌ అలంకరణకు సంబంధించిన స్విచ్‌ను చంద్రబాబునాయుడు ఆన్‌ చేయనున్నారు. పెద్దాపురంలో స్విచ్‌ ఆన్‌ చేయగానే రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్నత స్థానంలో నిలిచి హైటెక్‌ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు మరోసారి హైటెక్‌ హంగులతో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా మరోసారి హైటెక్‌ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేందుకు వీలుగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

ఫేస్‌ బుక్‌ నుంచి సరికొత్త యాప్‌

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కొత్త ఆవిష్కరణతో భారత కంపెనీలను ఆకట్టుకుంటోంది. ఫేస్‌ బుక్‌ ఎట్‌ వర్క్‌ః అనే సర్వీసును కొన్ని నెలల్లో భారత్‌లో ఆవిష్కరించనుంది. ఇప్పటికే ఈ సర్వీసు చాలా ప్రాముఖ్యం పొందింది. భారత్‌ ఈ సర్వీసును ఆవిష్కరించడం ఓ మైలురాయి లాంటిదని ఫేస్‌ బుక్‌ ఎగ్జిక్యూటివ్‌లు అభివరి?ంచారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ కు వచ్చిన ఆదరణతో భారత్‌ లో కూడా అన్ని వ్యాపారాల్లో దీన్ని టెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యామని ఫేస్‌ బుక్‌ ఎట్‌ వర్క్‌ డైరెక్టర్‌ జూలియన్‌ కోడోర్‌ నియో తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఈ యాప్‌ విజయవంతం కావడం తమకు ఆనందదాయకంగా ఉందని, భారత్‌ లోని అన్ని వ్యాపారాలతో కలిసి పనిచేసేందుకు ప్రస్తుతం ద ష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
తోటి ఉద్యోగులతో కలిసి సమర్థవంతంగా పనిచేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఫేస్‌ బుక్‌ ఎట్‌ వర్క్‌ కొత్త ప్లాట్‌ ఫాం అని, పనిస్థలాల్లో ఉత్పాదకతను ఇది పెంచుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్‌, టెలికమ్యూనికేషన్‌, ట్రావెల్‌, రిటైల్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ఈ యాప్‌ విజయవంతమైంది. భారత కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ, ఇనోాటెేక్‌, గోద్రెజ్‌, ఎస్‌ బ్యాంకు, యూఎస్టీ గ్లోబల్‌, పేటైమ్‌, జుమోటో, బుక్‌ మై షో, ఆస్క్‌ మీ, అర్బన్‌ లాడర్‌, టెలినార్‌, విజన్‌ ఇండియా ఫౌండేషన్‌, ల్యాండ్‌ మార్క్‌ గ్రూప్‌ వంటి కంపెనీలు ఇప్పటికే ఫేస్‌ బుక్‌ ఎట్‌ వర్క్‌ ను వాడుతున్నాయని జూలియన్‌ తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు ఈ యాప్‌ ఎంతో సహకరిస్తుందని చెప్పారు. ఈ సోషల్‌ మీడియా దిగ్గజం ద్వారా న్యూస్‌ ఫీడ్‌ ను, గ్రూప్స్‌ ను, మెసేజ్‌ లను, ఈవెంట్లను, సెర్చ్‌ వంటి ఎన్నో ఫీచర్లను ఫేస్‌ బుక్‌ ఎట్‌ వర్క్‌ షేర్‌ చేస్తుంది. 

హైదరాబాద్‌ : స్నేక్‌ గ్యాంగ్‌ కు యావజ్జీవ జైలు శిక్ష

హైదరాబాద్‌ లో సంచలనం స ష్టించిన స్నేక్‌ గ్యాంగ్‌ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. కేసులో నిందితులుగా నిర్ధారణ అయిన ఎనిమిది మందిలో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చారు. వీరంతా తమ చేష్టలతో సమాజంలో ఉండే అర్హతను కోల్పోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ-8గా ఉన్న నిందితుడికి 20 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్టు తెలిపారు. వీరి నేరాలు తీవ్రమైనవని, అభియోగాలు తనకు దిగ్బ్రాంతిని కలిగించాయని, లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు కానప్పటికీ, స్వల్ప శిక్షకు వీరు అనర్హులని అన్నారు.
పహాడీషరీఫ్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో 2014, జులై 31న స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులు ఫాంహౌజ్‌లోకి చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఫైజల్‌ దయానీ నేత త్వంలో 8 మంది సభ్యుల గల ముఠా పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చేసిన అరాచకాలు ఒక్కసారిగా బయటపడడంతో అప్పట్లో పెద్ద కలకలం రేపింది. పహాడీషరీఫ్‌ ప్రాంతంలో షాహీన్‌ నగర్‌లోని ఓ ఫాం హౌస్‌లో కుటుంబం ఉండేది. కుటుంబ సభ్యులందరూ వెళ్లిపోగా పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయింది.విషయం తెలుసుకున్న స్నేక్‌ గ్యాంగ్‌ అక్కడికి వెళ్లి వాచ్‌మన్‌పై దాడి చేసి జంట ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ విక తమైన చేష్టలతో ఆ యువతిపై విరుచుకుపడి గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాకుండా వీడియోలు తీసి తమ పైశాచికత్వాన్ని బయటపెట్టారు. ఈ జంట ఎంత ప్రాధేయపడినా గ్యాంగ్‌ వినిపించుకోకుండా యువతిపై అఘాత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి నుంచి రూ.60 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తమకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను బయటపెడతామని బెదిరించారు.
తమ కుటుంబ నేపథ్యం, పేదరికాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని నిందితులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. నేరస్థుల కుటుంబ నేపథ్యం కాకుండా.. జరిగిన నేరాలను పరిగణనలోకి తీసుకుని శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, హైదరాబాద్‌ శివార్లలో కనిపించే జంటలకు పాములు చూపించి అత్యాచారాలు, దోపిడీలు చేసినట్టుగా వీరిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి అత్యాచారాలను నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లభించకపోగా, దోపిడీ, భయభ్రాంతులను చేయడం వంటి ఆరోపణలు రుజువయ్యాయి. మొత్తం 9 మందిపై చార్జ్‌ షీట్‌ దాఖలు కాగా, 8 మందిపై అభియోగాలు నిరూపితమయ్యాయి. దాదాపు 37 మంది స్నేక్‌గ్యాంగ్‌ యువతులపై అక త్యాలకు పాల్పడినట్లు కోర్టు నిర్దారించింది.

డెహ్రాడూన్‌ :మేజారిటీ నిరూపించుకున్న హరిశ్‌ రావత్‌

అందరూ వూహించినట్లే నిన్న ఉత్తరాఖండ్‌ లో జరిగిన బలపరీక్షలో హరీశ్‌ రావత్‌ విజయం సాధించారు. ఆయన నెగ్గినట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. హరీశ్‌ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకున్నారని వ్యాఖ్యానించింది. అంతకుముందు రాష్ట్ర సీఎస్‌ ఓ సీల్డ్‌ కవర్‌ లో విశ్వాస పరీక్ష ఓటింగ్‌ వివరాలు ధర్మాసనానికి అందించారు. రావత్‌ గెలిచినట్టు ధర్మాసనం వ్యాఖ్యలు విన్న ఏజీ, ఉత్తరాఖండ్‌ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ వర్గాలు విజయోత్సవాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో హరీశ్‌ రావత్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిన సంగతి తెలిసిందే. మార్చి 27 న రాష్ట్రపతి పాలన విధించారు.
బుధవారం ఉత్తరాఖండ్‌ శాసనసభలో జరిగిన బలపరీక్షలో 61 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులుంటే... 9 మంది కాంగ్రెస్‌ రెబల్‌పై అనర్హతవేటు పడింది. దీంతో అసెంబ్లీలో జరిగిన బలపరీక్షకు 61 మంది సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్‌కు 27 మంది సభ్యులుంటే.. బలపరీక్షకు ముందు రేఖా ఆర్య బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ 28 ఎమ్మెల్యేలు ఉండగా, బీమ్‌లాల్‌ ఆర్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌కు మద్దుతు ప్రకటించారు. అసెంబ్లీలోని ఇద్దరు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెట్లు కూడా రావత్‌కు అనుకూలంగా నిలించారు.
సభలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా... 9 కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.
దీంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బలపరీక్షలో హరీశ్‌రావత్‌కు మద్దతుగా 33 ఓట్లు వచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిందిగా ఆయనకు సూచించింది. దీంతో గత రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఎదుర్కొటున్న బీజేపీకి ఈ పరిణామం భంగపాటుగా భావించవచ్చు. 

Saturday, 16 April 2016

ఎండలకు కాగుతున్న విశాఖ

ఎండలకు కాగుతున్న విశాఖ
విశాఖపట్నం, ఏప్రిల్‌ 16:
భానుడి ప్రతాపంతో విశాఖ జిల్లా అట్టుడుకుతోంది. మూడ్రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జిల్లా వాసులు అల్లాడుతున్నారు. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్ధితి ఉంటుందని అధికారులు స్పష్టం చేయడంతో బయటకు రావడానికే జంకుతున్నారు. వడగాలులను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన కూడళ్ళు కర్ఫ్యూ ను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్ననికి ఎండతో పాటు వేడిగాల్పులు వీయడంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. రోజువారీ పనులపై బయటకు వచ్చిన వారి పరిస్థితి దారుణంగా ఉంది.. ఇక పాఠశాలలు వదిలిన తర్వాత ఇళ్లకు చేరుకోవటానికి పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎండ దాటికి ముఖమంతా మండిపోవటంతో స్కార్ఫ్‌లతో ఒళ్లు దాచుకుంటున్నారు. అలానే నెత్తిన గొడుగులు వేసుకుని మరీ బయటకు వస్తున్నారు.
ఉదయం 11 దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావటానికి సాహసించటం లేదు. దాంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మూడ్రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నమోదైంది. అలానే రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. మొన్నటి వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీలుగా నమోదైతే, గడచిన మూడ్రోజులుగా రాత్రి సమయంలో 27 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతతో పాటు ఉక్కబోతను భరించలేకపోతున్నారు. మరోవైపు జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఎండబారిన పడకుండా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏప్రిల్‌ లోనే ఇలా ఉంటే మేలో ఎండల పరిస్ధితి ఎలా ఉంటుందోననే ఆందోళన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. వాతావరణ శాఖ కూడా ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయనే సమాచారం ఇస్తుండటంతో ఎలా గడిపేది దేవుడా అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఆత్మహత్యలకు కేంద్రమవుతున్న ప్రకాశం బ్యారేజ్‌

ఆత్మహత్యలకు కేంద్రమవుతున్న ప్రకాశం బ్యారేజ్‌
విజయవాడ, ఏప్రిల్‌ 16 :
విజయవాడ అంటే ముందుగా గుర్తుకు వచ్చేదే అమ్మలగన్నఅమ్మ కనకదుర్గ అమ్మవారు. తరువాత కృష్టానదీపై ఉన్న ప్రకాశం బ్యారేజీపై నుంచుని కృష్టనదిని చూస్తు పర్యాటకులు పరవశించిపోతారు. కృష్ణానది అందాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. విజయవాడ నుండే కాకుండా... వివిధ దేశాల నుండి కూడా విజయవాడలోని ప్రకాశం బ్యారేజి అందాలను చూసేందుకు పర్యాటకు వస్తుంటారు. ఇక సాయంత్రం సయయంలో వృద్దులు నుండి చిన్న పిల్లల వరకూ.... ప్రతి ఒక్కరూ... ఒక్కడకు వచ్చి ప్రతి ఒక్కరూ... తినుబండారాలు తింటూ అందరూ.... చంటి పిల్లలు మాదిరి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు.
కానీ, ఇప్పడు ప్రకాశం బ్యారేజికి రావాలంటేనే... పర్యాటకులు భయపడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రోజుల మారుతున్న... కొద్ది ప్రకాశం బ్యారేజ్‌ కళతప్పుతుంది. కుటుంబ కలహాలతో.... క్షణకావేశంతో ఇంటిలో గోడవ పడిన వారు వచ్చి... ప్రకాశం బ్యారేజ్‌ పై నుండి దూకేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో పర్యాటకు ప్రకాశం బ్యారేజ్‌ అందాలను చూద్దామని ఇక్కడకు వచ్చి కృష్ణానదిలోకి చూస్తేంటే.... కళ్ళు కంపు కొడుతున్న మృతదేహాలను చూసి భయందోళనకు గురి అవుతున్నారు. ఇలాగే కొనసాగితే... ప్రకాశం బ్యారేజి.. డెత్‌ స్పాట్‌ గా మారే అవకాశముందని పర్యాటకులు అందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌ లో ట్యాంక్‌ బండ్‌ ఏవిధంగా పేరు ఉన్నదో విజయవాడ అంటే కృష్టా బ్యారేజీకి అంత పేరు ఉందని కానీ గత నెలలనుండి కొంతమంది తమ కుటుంబపరిస్దితులను బట్టి ఇక్కడకు రాడం ఇదే బ్యారేజీ నుండి చనిపోవడంతో ఇక్కడకు వచ్చే యాత్రికులకు చనిపోయిన శవాలను చూడవలసి వస్తుంది. ప్రభుత్వం దీనిపై ఆలోచించి చర్యలు తీసుకుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఒకవైపు ఆరాటం..మరోవైపు ఆర్బాటం

ఒకవైపు ఆరాటం..మరోవైపు ఆర్బాటం
హైదరాబాద్‌ , ఏప్రిల్‌ 16 :
వేసవి లో భానుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చాడు.రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సగటు జీవిని బెంబేలెత్తిస్తుంది.ఇక ఈ వేసవిలో నీటి సమస్య అంతా ఇంతా కాదు.ఓవైపు నీటు కోసం జనాలు పడిగాపులు పడుతుంటే మరో వైపు నీటి తో ఆటలు ఆడుతున్నారు.జనాలు గుక్కెడు నీరు కోసం ఇబ్బందులు పడుతుంటే...నీటి తో ఆటలు ఆడుతున్నది ఎవరు.
తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొడుతున్నాయి.మార్చి నుండి మొదలైన ఎండలు రోజు రోజు కి టెంపరరేచర్‌ ను పెంచెస్తున్నాయి.దాదాపు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 46డిగ్రీల వరకు నమోదయ్యాయి.ఈ ఎండలో తాగాడానికి గుక్కెడు నీరు లేక ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నీటిని కూడా రైళ్ళలలో తరలించే పరిస్థితి వచ్చిందంటే దేశం లో నీటి ఎద్దడి ఏ స్థితి లతో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఓ వైపు తాగడానికి నీరు లేవని ప్రజలు అల్లాడుతుంటే నీటి తో ఆటలాడుతున్నారు బడా బాబులు. స్విమ్మంగ్‌ పూల్స్‌ లో నీటిని వృథా చేస్తున్నారు.ఇక సంపన్న వర్గాల వారైతే పండగ వచ్చిన పబ్బం వచ్చినా..వాటర్‌ తో చేయాల్సినా నానా రచ్చ చేసేస్తున్నారు. పూల్‌ డాన్స్‌, రైన్‌ డాన్స్‌, ఇలా అన్ని రకాలుగా వాటర్‌ ని వృధా చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎండా కాలం కాబట్టి నీటి లో సేద తీరుతున్నామని కవరింగ్‌ మరీ...
ఇక మరో వైపు అయితే ఐపిఎల్‌ మ్యాచ్‌ లకు వాటర్‌ ను దేశవ్యాప్తంగా ఉన్న గ్రౌండ్‌ ల ను క్లీన్‌ చేయడానికి వినియోగిస్తున్నారు.రాష్ట్రాలలో నెలకొన్న తీవ్ర కరువు, నీటి సమస్యను పరిష్కరించేందుకు ముంబాయ్‌ ప్రభుత్వం తొలి అడుగుగా మహరాష్ట్ర లో మ్యాచ్‌ లను కాన్సిల్‌ చేసుకున్నాయి. నీరు అందుబాటులో లేక కొంత మంది మృత్యువాత పడుతున్న నేపథ్యం లో ఇలా నీటిని గ్రౌండ్‌ క్లీన్‌ చేయడానికి వాడడం ఎంటని విమర్శకులు పెదవి విరుస్తున్నారు.

గుంటూరు పడగవిప్పిన ల్యాండ్‌ మాఫియా

గుంటూరు పడగవిప్పిన ల్యాండ్‌ మాఫియా
గుంటూరు, ఏప్రిల్‌ 16 (న్యూస్‌ పల్స్‌)
గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం నేపథ్యంలో భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. అదే స్థాయిలో భూ వివాదాలు, పంచాయితీలు, బెదిరింపులు, హత్యలు తారాస్థాయికి చేరాయి. గడిచిన కొద్ది సంవత్సరాలుగా గుంటూరు నగరంలో ల్యాండ్‌ మాఫియా చెలరేగుతోంది. కోట్ల ఖరీదు చేసే భూములకు పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ కి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఇదే తరహా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్యామలానగర్‌లో కోట్ల ఖరీదు చేసే భూకబ్జా ఘటన మొదలుకుని తాజాగా మంగళగిరి, గుంటూరు నగరంలో వెలుగు చూసిన అనేక ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భూ కబ్జా కేసుల్లో పోలీసుల ఉదాశీనత వల్లే ల్యాండ్‌ మాఫియా రెచ్చిపోతుందనే విమర్శలున్నాయి. బాధితులు పోలీస్‌ స్టేషన్లకు వెళితే విచారించకుండానే సివిల్‌ వివాదం అంటూ తప్పించుకుంటున్నారు. దీంతో ల్యాండ్‌ మాఫియా రోజురోజుకు చెలరేగిపోతోంది. ల్యాండ్‌ మాఫియాపై కఠిన వైఖరి అవలంభించకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా అమాయకుల ఆస్తులు హారతి కర్పూరం కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
గుంటూరు నగరంలో సంచలనం సృష్టించిన శ్యామలానగర్‌ భూవివాదం ఘటనల్లో అప్పటి డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు సస్పెన్షన్‌ గురికాగా సుమారు 16 మందిని అరెస్టు చేశారు. అందులో ఓ మహిళ కీలకపాత్ర పోషించిన విషయం విదితమే. ఆ తరువాత అనేక భూకబ్జా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్నింటిపై మాత్రమే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ మహిళ పలు మోసాలకు పాల్పడుతుంటడంతో పోలీసుల ఆమె గురించి ఆరా తీస్తున్నారు. దీంతో నగరంపాలెం పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్లలో కేసుల ఫైళ్లను బయటకు తీశారు. ఆమెకు ఒక పోలీసు అధికారికి మధ్య ఉన్న సంబంధంపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. అంతేగాక ఆమె ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా మోసాలకు పాల్పడిందనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈమె నగరానికి చెందిన ఓ భూకబ్జాదారుడితో చేతులు కలిపినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. గడిచిన కొద్ది సంవత్సరాలుగా భూ వివాదాలకు సంబంధించి ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం విూద ఆమెపై షీటు తెరవాల్సిందిగా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు.

పట్టాభిపురంలో కేసులో ఓ న్యాయవాది పాత్రపై కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. న్యాయవాది ముసుగులో భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తేలింది. న్యాయవాదిపై పట్టాభిపురం, అరండల్‌పేట, పాతగుంటూరు స్టేషన్లలో భూకబ్జా కేసులు ఉన్నాయి. ఇతడిపై పోలీసులు షీట్‌ కూడా తెరిచారు. గుంటూరులోని బృందావన్‌ గార్డెన్స్‌ సవిూపంలో మున్సిపల్‌ స్థలాన్ని కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వ్యూహాత్మకంగా ఆ స్థలానికి డాక్యుమెంట్లు సృష్టించి లోపాయకారిగా ఒకరిపై ఒకరు కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమై స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో న్యాయవాదిని నగరం నుంచి బహిష్కరించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని సమాచారం. ఈ మేరకు వీరిని నగర బహిష్కరణకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గత జనవరిలో పట్టాభిపురం పోలీసులు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. నగరంలో ల్యాండ్‌ మాఫియాపై ఎన్ని కేసులు పెట్టినా అరెస్టులు చేసినా వారిలో మార్పు కనిపించకపోవడంతో వారిని కూడా నగరం నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకొని ల్యాండ్‌ మాఫియా అమాయకుల భూములను అమాంతం సొంతం చేసుకుంటుంది. దానికి సబ్‌ రిజిస్ట్రార్లు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. వాస్తవానికి ఒక భూమికి ఒక సారి రిజిస్ట్రేషన్‌ జరిగిన తరువాత అదే అమ్మిన వ్యక్తి ఆ ఆస్తిని మరోసారి వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేస్తున్న ఉదంతాలు కోకొల్లలున్నాయి. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ జరిగితే దానిని రద్దు చేయాలంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాల్సిందే. ఈ నేపథ్యంలో బాధితుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. చివరకు మాఫియాకు బాధితులు తలొగ్గాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ల్యాండ్‌ మాఫియా ఆగడాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
నగరంలో సుమారు 20 మంది ల్యాండ్‌ మాఫియాగా తయారయ్యారు. భూకబ్జాదారుల ముఠాలో తాజాగా చేరిన ఓ మహిళ చురుకైనపాత్ర పోషిస్తుంది. పండరీపురం ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు చేరిన భూకబ్జాదారుల ముఠాలో తాజాగా చేరిన ఓ మహిళ ఆ తరువాత అదే ఇంటిని కొనుగోలు చేస్తానని వృద్ధుడైన ఇంటి యజమానితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తనకు మత్తు ఇచ్చి విక్రయ బయానా అగ్రిమెంట్‌ బదులు విక్రయ స్వాధీన అగ్రిమెంట్‌ రాయించుకుని మోసం చేసినట్లు బాధితుడి ఫిర్యాదుతో 2014లో పట్టాభిపురంస్టేషన్‌లో కేసు నమోదైంది. గత ఏడాది కన్నావారితోటలోని బొగ్గవరపు నారాయణమ్మకు చెందిన కోట్లు ఖరీదు చేసే ఇంటికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ మహిళే నలుగురికి విక్రయించింది. విషయం తెలుసుకున్న బాధితులు రిజిసే?ట్రషన్‌ అధికారులకు, నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమోతో పాటు మరో ఎనిమిది మందిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులు మూలనపడ్డాయి. మంగళగిరి పరిధిలోని ఎన్నారై ఆసుపత్రి ఎదుట ఉన్న కోట్ల ఖరీదు చేసే భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.30 లక్షల చలానా కూడా తీశారు. మంగళగిరి సబ్‌ రిజిసా?ట్రర్‌ కార్యాలయంలో రిజిసే?ట్రషన్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో బాధితుడు, న్యాయవాది వాకా రామ్‌గోపాల్‌గౌడ్‌ మంగళగిరి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుతో కేసు నమోదైంది. రాజధానిగా మారిన నేపద్యంలో గుంటూరు జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ల్యాండ్‌ మాఫియా ఇక్కడి భూముల కబ్జాపై దృష్టిసారించిందని రియల్టర్లు చెబుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు కూడా ల్యాండ్‌ మాఫియాకు కలసివస్తోందన్నారు.

చల్ల చల్లని రోగాలు

చల్ల చల్లని రోగాలు
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 16:
ఐస్‌ తయారి దారులు నాణ్యతను పాటించకపోవడంతో సామాన్యులకు రోగాలు తప్పడం లేదు. కేవలం కుళాయి, బోరు వాటర్‌ మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా కాలువలు, చెరువుల్లోను ఉండే మురుగు వాటర్‌ తో కుడా ఐస్‌ తయారు చేస్తున్నారు. ఇది చుట్టుపక్కల వున్న జ్యూస్‌ సెంటర్లకు చేరుతుంది. భానుడి దాటికి సామాన్యుడు తాగే చెరకు, పళ్లరసాల్లో ఈ ఐస్‌ కలవడంతో అనారోగ్యాలు పాలౌతున్నారు.
వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు ఎండలకు ఎంతో భయపడతారు. ఒక ఏడాదికి మించి ఇంకో ఏడాది భనుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు వడగాల్పులకు తట్టుకోలేకపోతున్నారు. సాద్యమైనంత వరకు ఇంటిలో నుండి బయటకు రావడానికి ఇష్టపడడంలేదు. కానీ రెక్కాడితేనే గాని డొక్కాడని ప్రజలు మండుటెండలోనే పనులు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చల్లని పానియాలను సేవిస్తుండడంతో అవే వారి అనారోగ్యాలకు కారణాలవుతున్నాయి. వేసవిలో చల్లదనాన్ని అందించే పండ్లరసాలు, చెరుకురసాలు మొదలైనవి కనిపిస్తుంటాయి. సహజ సిద్దంగా వీటికి వేడిమి నుండి సేదదీర్చే గుణం ఉంటుంది. కాబట్టి వైద్యులు కూడా వీటిని తాగమని చెబుతుంటారు. కానీ సహజ సిద్దంగా వీటికున్న గుణంతో పాటు కృత్రిమంగా ఐస్‌ ను కలపడంతో ఇవే రోగాలను తెచ్చిపెడుతున్నాయి. వేసవిలో చెరుకురసాలు, పండ్ల రసాల వ్యాపారం జోరందుకుంటుంది. ఈ ప్రధాన వ్యాపారానికి మూలకం అయిన ఐస్‌ వ్యాపారానికి కూడా హద్దులంటూ ఉండవు విచ్చల విడిగా రేట్లను పెంచీ జోరుగా వ్యాపారం సాగిస్తుంటారు. అయితే వ్యాపారం పేరుతో సొమ్ము చేసుకొనే క్రమంలో న్యాణ్యత పాటించకపోవడం, నియమనిబంధనలు పాటించకపోవడం శుభ్రతను పాటించకపోవడమే ఇక్కడ ప్రాణాల విూదికి తెస్తున్నాయి.
ఐస్‌ తయారి కోసం పాటించాల్సిన నిబంధనలను తయారి దారులు గాలికి వదిలేయడంతో సమస్యలు వచ్చి పడుతున్నాయి. శుద్ది చేసిన మంచి నీరు లేదా శుద్ది చేసిన భూగర్భ జలాలను తీసుకోని ఐస్‌ తయారు చేయాలి. కానీ తూర్పుగోదావరి జిల్లాలోని చాలా చోట్ల ఈ వేసవి కాలంలో కాలవల్లోను, చెరువుల్లోను లభించే మురుగు నీటినే ఐస్‌ తయారికి వాడేస్తున్నారు. చెరుకు రసాలు, జ్యూస్‌ షాపులు వంటి వాటిల్లో శుభ్రత పాటించకపోవడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. చల్లని పానియాలు ఉపయోగించే చోట గ్లాసులను సరిగా శుభ్రం చేయాలని లేదంటే పేపర్‌ క్లాసులను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
సేదదీరడానికి చల్లని పానియాలు తాగాలంటేనే భయం వేస్తుందని సామాన్యులు వాపోతున్నారు. వేడిమిని తప్పించుకోవడానికి చల్లని పానియాలు తాగక తప్పడంలేదని కానీ శుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో రోగాల బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు. సంబందిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. తాపాన్ని చలార్చే చల్లని పానియాలని ఆశ్రయించి డబ్బులిచ్చి మరీ జబ్బులను కొనుగోలు చేసినట్లు అవుతుందని కొనుగోలుదారులు అంటున్నారు. వ్యాపారులు నియమ నిబందనలు పాటించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.
Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks