సోషల్ సైట్స్ లో కాజల్ హల్ చల్...
ముంబై, జూలై 30,
అందాలతో మత్తెక్కించే కాజల్‌ని ఈ మధ్య వరుస ఫ్లాపులు పలకరించడంతో కాస్త డీలా పడింది. అయితే వెంటనే తమిళం, తెలుగు సినిమాలకు సంబంధించి కొన్ని ఆఫర్లు రావడంతో ఈ అమ్మడి ఆనందం అవధులు దాటింది. ఆన్‌స్క్రీన్‌లోనే కాక ఆఫ్‌స్క్రీన్‌లోను ఈ అమ్మడు చేసే హంగామాని చూసి ఫ్యాన్స్ నోళ్ళెల్లబెడుతున్నారు. తమిళంలో విక్రమ్ సరసన గరుడ చిత్రంలో నటించనున్న కాజల్, అజిత్ మూవీలోను కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. అజిత్ మూవీకి ఇద్దరు కథానాయికలు కావలసి ఉండగా, అందులో ఒకరిగా అనుష్కను తీసుకున్నారు., మరో భామగా కాజల్‌ని ఎంపిక చేశారు. విదేశాలలో జరగనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక తెలుగులో తేజ సినిమాతో పాటు ఎన్టీఆర్ సినిమాలోను నటించనుంది కాజల్. విక్రమ్, అజిత్ చిత్రాలతో పాటు జీవా హీరోగా తెరకెక్కుతున్న కావలై వేండమ్ అనే మూవీని చేస్తోంది కాజల్. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్‌పై ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ విూడియా ద్వారా షేర్ చేస్తోంది. ఇక జీవాతో ఈ అమ్మడు చేసిన హంగామాని చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. జీవాతో పాటు పలు టూరిస్ట్ ప్లేస్‌లకు వెళుతున్న కాజల్ అక్కడి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్ సైట్స్‌లో పోస్ట్ చేస్తోంది. మొత్తానికి కాజల్ చేస్తోన్న ఈ సందడికి కారణం వరుస ఆఫర్లు రావడమే అని కొందరంటుంటే , మరో కారణం ఉండి ఉంటుందని ఇంకొందరి వాదన. ఏదేమైన ప్రస్తుతం ఈ అమ్మడు చేసే ఎంజాయ్‌మెంట్ టాపిక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది.

No comments:
Post a Comment