ఎంసెట్ లీకవుతుందని ముందే జ్యోతిష్యం
హైద్రాబాద్, జూలై 30,
2016, ఏప్రిల్ 8? దుర్ముఖి నామ సంవత్సరం ప్రవేశించిన వేళ, రవీంధ్రభారతిలో యువ సిద్ధాంతి, పంచాంగకర్త చెప్పిన మాటలు సాకారమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు రవీంధ్రభారతిలో ఆసీనులైన వేళ? పంచాంగ శ్రవణం చేసిన సంతోష్ కుమార్ శర్మ, ఈ సంవత్సరం విద్య, వైద్య రంగాల్లో అవినీతి పెరుగుతుందని, అక్రమాలు జరిగి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భవిష్యత్తు గురించి హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేసారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ? పంచాంగకర్త సంతోష్ కుమార్ చెప్పిన ముందస్తు అంచనాలను ప్రస్తావిస్తూ, మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని నవ్వుతూ సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే నాడు సరదాగా చేసిన వ్యాఖ్యలే నేడు సీరియస్ రూపం సంతరించుకోవడం విశేషం. తాజా ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన తరువాత, నాటి పంచాంగ శ్రవణం నిజమైందని ఈ సందర్భంగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఆనాటి వీడియో క్లిప్పింగ్స్ లో పంచాంగకర్త సంతోష్ వ్యాఖ్యలను, కేసీఆర్ హెచ్చరికలను చూపిస్తూ, టీవీ చానళ్లలో ఇప్పుడు ప్రత్యేక కధనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా, ఎంసెట్-2 నిర్వహణ బాధ్యతలు తమవి కావంటే తమవి కావని అటు విద్యా శాఖ మంత్రి, ఇటు ఆరోగ్య శాఖా మంత్రులు చెబుతుండటం గమనార్హం. విద్యార్ధులు మాత్రం మరోసారి ఎంసెట్ రాసేందుకు ససేవిూరా అంటున్నారు. జ్యోతిష్యం నమ్మకం లేని వారికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు పంచాంగ నమ్మకస్తులు.

No comments:
Post a Comment