. ఇంకా వెతుకుతున్నారు..
వాయుసేన విమానాలకు ప్రమాదాలు జరగడం కొత్త కాకపోయినా ఇటీవల జాడతెలియకుండా పోయిన ఏఎన్ 32 విమానం మాత్రం కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. రష్యా రూపొందించిన ఈ విమానాలను ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కొనుగోలు చేశారు. అప్పటి వరకూ ఏఎన్ 26 రకం విమానాలు ఉండేవి కాగా అప్పుడే ఏఎన్ 32 రకం విమానాలు 32 సంవత్సరాల నుంచి ఈ విమానాలు భారత వాయుసేకు సేవలు అందిస్తున్నాయి. రక్షణ శాఖకు సంబంధించిన యంత్ర పరికరాలు, సిబ్బంది తరలింపు, వారికి ఆహారం తీసుకువెళ్లడం తదితర కార్యక్రమాలను ఏఎన్ 32 విమానాలు నిర్వహిస్తుంటాయి. డార్నియర్ విమానాలను కోస్టుగార్డు వాడుతుంటుంది. ఇవి భద్రతను గగనతలం నుంచి పర్యవేక్షిస్తుంటాయి. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న విమానాలలో ఏఎన్ 32తో బాటు డార్నియర్ విమానాలు
కూడా ఉంటున్నాయి. తొలి బ్యాచ్‌గా వచ్చిన ఏఎన్ 32 విమానాల్లో 105 విమానాలు ఇప్పటికీ భారత వాయుసేనకు సేవలు అందిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ఐదు ఏఎన్ 32 విమానాలను ఆధునీకరించారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన విమానాలు భారత్‌లోనే ఆధునీకరిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఇంకా పూర్తికాలేదు. అయితే ఎంతగా మరమ్మతులు చేసినా కూడా ఏఎన్ 32 విమానాల్లో సమస్యలు తలెత్తుతూనే ఉండేవి. ఇప్పుడు అదృశ్యం అయిన చెన్నై- పోర్టుబ్లయర్ వాయుసేన విమానంలో కూడా తరచూ సమస్యలు తలెత్తేవి. గత ఏడాది ఈ విమానానికి ఆధునిక హంగులు జోడించి మరమ్మతులు చేశారు. ఈ నెలలోనే మూడు సార్లు ఈ విమానానికి సమస్యలు వచ్చాయి. జులై రెండో తేదీన ఈ విమానం కచ్చితమైన రూట్‌లో ప్రయాణం చేయలేకపోతున్నదని గుర్తించారు. 7వ తేదీన
ఎడమవైపున ఉన్న రెక్క మొదట్లో హైడ్రాలిక్ లీక్ ఉన్నట్లుగా గుర్తించారు. జులై 14న ఎడమ వైపు తలుపు నుంచి వత్తిడి లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు. విమానం అదృశ్యం కావడానికి ఈ లోపాలు కారణం అనే అంశం ఇంకా నిర్ధారణ కాలేదు కానీ ఇలాంటి అంశాల్లో భారత వాయుసేన మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని మాత్రం ఈ ప్రమాదం గుర్తు చేస్తున్నది. ఏఎన్ 32 విమానాలు మూడు దశాబ్దాలుగా దీర్ఘకాలంగా వాడుతూ ఉండడం, ఆధునికీకరణ పూర్తి కాకపోవడమే ఈ ప్రమాదాలకు కారణంగా అధికారులు ఇప్పటికే ప్రాధమిక అంచనా వేసుకున్నారని సమాచారం. గతంలో జరిగిన ఏఎన్-32 విమాన ప్రమాదాలను గమనిస్తే, 1986 మార్చి 25న హిందూ మహాసముద్రం విూదుగా ఏడుగురితో వెళుతున్న విమానం గల్లంతు కాగా, నేటికీ దాని జాడ తెలియలేదు. 1990 జూలై
15న తాంబరం నుంచి తిరువనంతపురం బయలుదేరిన మరో విమానం మార్గమధ్యంలో కుప్పకూలింది. 2009 జూన్ 10న అరుణాచల్ ప్రదేశ్‌లో మరో ఏఎన్-32 కూలిపోగా, 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఏఎన్ 32 రకం విమానం 48 సంవత్సరాల కిందట ఒక సారి ఇదే విధంగా కనిపించకుండాపోయింది. ఆ తర్వాత విమానం మాయం అయిన సంఘటన ఇదే. చండీగఢ్ నుంచి లే కు వెళుతుండగా అప్పటిలో ప్రమాదం సంభవించగా ఇప్పుడు చెన్నై నుంచి పోర్టుబ్లయర్ వైవు వెళుతుండగా బంగాళాఖాతంలో అదృశ్యమైపోయింది. బంగాళాఖాతంలో మాయమెన ఈ విమానం ఆచూకీ లభ్యమయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో కూడా ఇలా సముద్రంలో కుప్పకూలిన విమానాల్లో జాడ తెలియనివే అధికం. ఆ తరహాలోనే ఈ విమానం కూడా తెలియకుండా పోయే అవకాశాలే ఉన్నాయని
అధికారులు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 5 వేల చదరపు కిలో విూటర్ల విస్తీర్ణంలో విమానం శకలాల కోసం అన్వేషణ సాగుతుండగా, జాడ తెలిసే అవకాశాలు 50 శాతం ఉన్నాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) చెబుతోంది. ఇక ఈ విస్తీర్ణాన్ని 9 వేల కిలో విూటర్లకు పెంచాలని నిర్ణయించడంతో విమానం ఆచూకీ తెలిసే అవకాశం 20 శాతానికి పడిపోయిందని ఓ అధికారి తెలిపారు. మరో వెపు గంటలు గడిచే కొద్దీ, విమానంలో బ్యాటరీలు పాడెపోయి, ఎటువంటి సిగ్నల్స్ వెలువడని పరిస్థితి సంభవిస్తే, దాని జాడ ఇక ఎన్నటికీ తెలిసే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. 13 నౌకలు, రాత్రి పూట స్పష్టంగా చూపించగల కెమెరాల సదుపాయమున్న రెండు పీ8ఐ సహా ఐదు విమానాలు సోదాల్లో పాల్గొన్నాయి. ఏఎన్-32, రెండు సీ-130లతో పాటు ఎంఐ-17 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. చెన్నై తీరం నుంచి 217 కిలో విూటర్ల దూరంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ సాగింది.గాలింపు బృందాలు ఉపగ్రహ చిత్రాల సాయం తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. జలాంతర్గాములతోసహా నౌకాదళానికి చెందిన 18 నౌకలు, పి81, సి130, డార్నియర్ లాంటి ఎనిమిది విమానాలు బంగాళాఖాతంలో నిరంతరాయంగా సాగుతున్న గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని, ఉపగ్రహ సమాచారాన్ని కూడా కోరామని తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిష్త్ చెబుతున్నారు. ఇక ఆచూకీ లభించదని నిర్ధారణకు వచ్చారో ఏమో తెలియదు కానీ ఎఎన్32 విమానం గల్లంతుపై వాయుసేన అధికారులు తమిళనాడు పోలీసులకు
అధికారికంగా ఫిర్యాదు చేశారు. వైమానిక దళానికి చెందిన ఎఎన్ 32 విమానం కనిపించకుండా పోవడంపై తమకు ఒక ఫిర్యాదు అందినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు సెలైయూర్ పోలీసు స్టేషన్‌కు ఈ ఫిర్యాదు అందింది. విమానంలో 29 మంది ఉన్నారని, విమానం కనిపించకుండా పోయిందని, విమానంలో ఉన్న వారిలో తమిళనాడుకు చెందిన ఒకరున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని ఆ అధికారి చెప్పారు. న్యాయపరమైన అవసరాలకోసమే ఈ ఫిర్యాదు చేశారు. ఏదైనా అద్భుతం జరిగి ఈ ప్రమాదం నుంచి అందరూ బయటపడాలని ఫ్లయిట్ లెఫ్టెనెంట్ దీపిక తల్లి కోరుకుంటున్నట్లే దేశ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు

No comments:
Post a Comment