సీతాకోక చిలుకల్లా రంగురంగుల డ్రస్‌లు వేసుకోవాలనే ఇష్టం చాలామందిలో ఉంటుంది. కాని వాటిని ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుందో తెలియక వాటికి దూరంగా ఉంటుంటారు. కాని వీటిని డిజైన్ చేసుకోవడం ఎంతో సింపుల్. మల్టీకలర్ ఫ్యాబ్రిక్‌ను వాడితే రంగురంగుల డ్రస్ రెడీ అయిపోయినట్టే. ఈ మల్టీకలర్ ఫ్యాబ్రిక్‌పైన రెండు రంగుల్ని ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా ప్రింట్ చేస్తారు. ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్ అయిన మల్టీకలర్ స్టయిల్ గురించి
ఈ వారం చూద్దాం..
మల్టీకలర్ ఫ్యాబ్రిక్ చాలా రకాలుగా అందుబాటులో ఉంది. అవి... మల్టీ షేడెడ్, మల్టీ కలర్ స్ర్టైప్స్, మల్టీ చెక్స్, మల్టీ కలర్ టై అండ్ డై, మల్టీ కలర్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్. మల్టీకలర్ స్ర్టైప్స్ ఫ్యాబ్రిక్‌ను ఎలా డిజైన్ చేసుకోవచ్చంటే...
చీర
చీర కుచ్చిళ్లకు మల్టీకలర్ స్ర్టైప్స్ ఫ్యాబ్రిక్‌ను వాడి పవిటెకొంగు, బ్లౌజ్‌లకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వాడాలి. మల్టీకలర్ స్ర్టైప్స్‌లో ఉన్న రంగులు కాకుండా పవిటెకొంగు, బ్లౌజ్‌లకు వేరే రంగులు వాడాలి. ఇక్కడ మీరు చూస్తున్న చీర స్కెచ్‌లో పవిటెకొంగుకి బూడిదరంగు, బ్లౌజ్‌కు ఊదారంగు ఫ్యాబ్రిక్ వాడాను. ఈ రెండు రంగులు స్ర్టైప్స్ ఫ్యాబ్రిక్‌లో లేవు. ఇలా జాగ్రత్త తీసుకోకపోతే చీర గాడీగా కనిపిస్తుంది. ఈ మల్టీకలర్ చీరను పార్టీలు, పెళ్లిళ్లు, సంగీత్, రిసెప్షన్, పండుగ వేడుకలకు కట్టుకుంటే బాగుంటుంది.
కుర్తీ
మల్టీకలర్ స్ర్టైప్స్ కుర్తీల ఫ్యాషన్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు. మల్టీకలర్ స్ర్టైప్స్ ఫ్యాబ్రిక్‌తో రెట్రో లుక్(వంటికి అతుక్కున్నట్టు) కుర్తీని కుట్టించాలి. దీనిమీద వేరే ఎంబ్రాయిడరీ లేదా డిజైన్లు ఉండకూడదు. మెడ భాగంలో డిజైన్ చాలా సింపుల్‌గా అంటే రౌండ్‌నెక్‌లా ఉండాలి. దుపట్టా, చుడీ ప్యాంట్‌లు సాదాగా, సింపుల్‌గా ఉండాలి. వీటిమీద డిజైన్లు, ప్రింట్లు, ఎంబ్రాయిడరీ ఉండకూడదు. ప్లెయిన్, స్ర్టైప్స్ కాంబినేషన్ డ్రస్‌కు మంచి లుక్ ఇస్తుంది. ఈ కుర్తీని డెయిలీ వేర్‌గా లేదా ఈవినింగ్ పార్టీలకు వేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈవినింగ్ పార్టీలకు వెళ్లేటప్పుడు యాక్సెసరీల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధవహించాలి. ఇలా చేయడం వల్ల డెయిలీ వేర్ డ్రస్‌కే కొత్త లుక్ తెచ్చినవారవుతారు.
ప్యారలల్ ప్యాంట్
వెస్ట్రన్ వేర్‌లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లూజ్ లేదా ప్యారలల్ ప్యాంట్స్. వీటిని ఎక్కువగా జాలువారుతున్నట్టు ఉండే క్రేప్, జార్జెట్ లేదా శాటిన్ మెటీరియల్స్‌తో కుడతారు. ప్యారలల్ ప్యాంట్‌కి ఉదాహరణగా ఫుల్ జంప్ సూట్స్‌ను చెప్పుకోవచ్చు. ప్యారలల్ ప్యాంట్‌ను మల్టీకలర్ స్ర్టైప్స్ ఫ్యాబ్రిక్‌తో కుట్టాలి. దీనిపైన స్లీవ్‌లెస్ టాప్ వేసుకుంటే బాగుంటుంది. ఈ టాప్ వెనకభాగంలో డిజైన్ ఉండాలి. దీంతో ట్రెండీ లుక్ వస్తుంది. ఈ డ్రస్‌ను కిట్టీ పార్టీలకు, ఆదివారాల్లో జరిగే లంచ్ పార్టీలకు వేసుకెళ్లొచ్చు. వెస్ట్రన్ వేర్ వేసుకునే పెద్దవాళ్లకే కాకుండా టీనేజి, చిన్న పిల్లలకు కూడా ప్యారల్ ప్యాంట్‌లు డిజైన్ చేయొచ్చు.

No comments:
Post a Comment