Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Friday, 1 May 2015

చెరువులకు,కుంటలకు పూర్వ వైభవం తీసుకువచ్చెందుకు మిషన్‌ కాకతీయ... మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించిన మంత్రి హారిష్‌రావు







 చెరువులకు,కుంటలకు పూర్వ వైభవం తీసుకువచ్చెందుకు మిషన్‌ కాకతీయ
మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించిన మంత్రి హారిష్‌రావు
  రాష్ట్ర ప్రభుత్వం చెరువులకు,కుంటలకు పూర్వ వైభవం తీసుకువచ్చెందుకు మిషన్‌ కాకతీయను ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. శుక్రవారం రోజు మండలంలోని కాచాపూర్‌ గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువులో మిషన్‌ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు.అనంతరం స్వయంగా గుణపంతో మట్టిని తవ్వి,జెసిబి స్వయంగా నడిపి రైతులను ఉత్సహా పరిచారు.అనంతరం చెరువులో ఏర్పటు చేసిన సమావేశంలో ఆయన మాట్లడుతు మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్దరణలో భాగంగా రాష్ట్రంలో చెపట్టిన పనులలో కాంట్రాక్టర్‌లు తమ జెబులను నింపుకొకుండ ప్రతి పైసను మిషన్‌ కాకతీయ పనుల అభివఅద్ధి కొరకు ఖర్చు చేయాలని ఆయన అధేశించారు.మిషన్‌ కాకతీయలో కాంట్రాక్టర్‌లు ఆవకతవకలకు పాల్పడితె విజిలెన్స్‌ టిమ్‌ ఏప్పటికప్పుడు పనులను పరిశిలించి సంబందిత కాంట్రాక్టర్‌కు నిధులను నిలుపుదల చేసి అట్టి కాంట్రాక్టర్‌ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.అలాగే చెరువులో నల్ల బంగారంలాంటి మట్టిని మొదట రైతులు తమ పంట పోలాలకు తీసుకెల్లెందుకు ఆవకాశం కల్పించి అనంతరం మిగిలిన మట్టిని గ్రామాలలో ఉన్న పాత బావుల పూడ్చుటకు ఉపయోగించాలని అలాగే మిగిలిన మట్టిని ఆవసరమైతె ఇటుక బట్టిలకు ఉపయోగించాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా రైతులు తమకు మట్టిని తీసుకెళ్ళెందుకు రవాణ ఖర్చులు ట్రాక్టర్‌ యజమానులు ఏక్కువ వసూలు చేస్తున్నారని మంత్రికి తెలుపగా వెంటనె స్పందించిన మంత్రి రైతులతో మాట్లడుతు చెరువు నుండి 2 కీలో మీటర్లలోపు ఉన్న వ్యవసాయ బావుల వద్ద మట్టిని తరలిస్తే ఒక్కొ ట్రిప్పుకు వంద రూపాయలు చొప్పున మాత్రమే వసూలు చేయాలని అంతకు మించి వసూలు చేస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.అలాగే కాచాపూర్‌లోని పెద్ద చెరువులో 40వేల ట్రాక్టర్‌ల నల్ల బంగారం మట్టి ఉందని దినిని రైతులు సక్రమంగా ఉపయోగించుకునె విధంగా చెరువు పునరుద్ధరణ పనులు అయ్యేంత వరకు ఎంపిడిఓ గోపాల్‌రావు దగ్గర ఉండి ప్రతి రోజు పనులను పరిశిలించాలని ఎంపిడిఓను మంత్రి హారిష్‌రావు అధేశించారు.అంతకు ముందు తొలి సారిగా మండలంలోని కాచాపూర్‌ గ్రామానికి వచ్చిన భారి నీటి పారుదలశాఖ మంత్రి హారిష్‌రావుకు నియోజక వర్గ నాయకులు ఘనస్వాగతం పలికారు.అనంతరం కాచాపూర్‌ గ్రామం నుండి 44వ జాతీయ రహాదారి వరకు 87 లక్షల రూపాయలతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను మంత్రి హారిష్‌రావు ఎంపి బిబి పాటిల్‌తో కలిసి ప్రారంభించారు.అలాగే గ్రామంలో మంచి నీటి ట్యాంకుతో పాటు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నూతనంగా నిర్మించడానికి నిదులు మంజూర చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌,జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దఫెదర్‌ రాజు,డిసిఎమ్‌ఎస్‌ చైర్మెన్‌ ముజిబద్ధిన్‌,జెడ్పిటిసి నందరమేష్‌,స్థానిక ఎంపిపి ధర్మగల్ల రాజయ్య,దోమకొండ జెడ్పిటిసిగండ్రా మధుసుదన్‌రావు,నిట్టు వేణు గోపాల్‌రావు,డిసిసిబి డైరెక్టర్‌లు లింగాల కిష్టగౌడ్‌,నాగర్తి చంద్రరెడ్డి,పార్టి మండల అధ్యక్షుడు జూకంటి మోహాన్‌రెడ్డి,అందె మహేంధర్‌రెడ్డి,స్థానిక సర్పంచ్‌ బుల్లె యాదయ్య,ఎంపిటిసిలు బైండ్ల సుదర్శన్‌,చింతమడక కవిత,వివిధ గ్రామాల సర్పంచ్‌లు,ఎంపిటిసిలు,టిఆర్‌ఎస్‌ పార్టి నాయకులు,కార్యకర్తలు,రైతులు పాల్గోన్నారు. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks