వైవిధ్యమైన పాత్రలు ఏరికోరి ఎంచుకొనే నటుల్లో కమల్ తరువాత స్థానం విక్రమ్‌దే. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘నాన్న’ వంటి చిత్రాలతో తిరుగులేని నటుడిగా నిరూపించుకున్న విక్రమ్ ఇప్పుడు ‘ఐ’తో మరోసారి భారతీయ సినీ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ భారీ చిత్రం బుధవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘ఐ’ గురించి చియాన్ విక్రమ్ చిత్రజ్యోతికి చెప్పిన విశేషాలు మీ కోసం...
శంకర్ ‘ఐ’ కథ చెప్పిన వెంటనే మీకేమనిపించింది.
సూపర్... చితక్కొట్టేశారు అనిపించింది (నవ్వుతూ..).
ఇందులో మీ క్యారెక్టర్లని ఛాలెంజ్‌గా తీసుకుని చేశారా?
ఛాలెంజ్‌గా తీసుకున్నాను అనేకంటే నటుడిగా ఆ పాత్రల్ని ఎంతో ఆస్వాదించాను అని చెబితే కరెక్టుగా ఉంటుంది. వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయడమంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ‘ఐ’లో ఒకేసారి మూడు భిన్న క్యారెక్టర్లు చేసే అవకాశం రావడం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. కష్టం కంటే సంతృప్తినిచ్చిందే ఎక్కువ.
ఈ సినిమా కోసం మీరు చాలా రిస్క్ తీసుకున్నారు. మీ ఆహార ్యం చూసి విక్రమ్ ఇలా అయిపోయారేంటి అనిసాధారణ ప్రేక్షకుల సైతం బాధపడ్డారు. ఇంత రిస్క్ అవసరమంటారా?
నిజమే కానివ్వండి.. ఇలాంటి సినిమా కోసం ఎటువంటి రిస్క్ చేసినా ఫర్వాలేద నిపించింది. అందుకే చేసేశాను. సినిమా చూసిన తరువాత మీరే చెబుతారు ఎందుకు అంత రిస్క్ చేశానో! ఒక్కమాటలో చెప్పాలంటే ! ఇదే చివరి సినిమా అయినా ఫర్వాలేదనుకుని నటించాను. హాలీవుడ్ నటీనటులు చేస్తున్నప్పుడు మనమెందుకు చేయలేమని అనిపించింది. ఖచ్చితంగా మనం కూడా ట్రై చేయాలని చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి.
మిమ్మల్ని మీరు తెరపై చూసినప్పుడు ఎలా ఫీలయ్యారు?
ఆ పాత్రల్లో ఉండే పవర్.. నేను చేసిన మరే పాత్రలోనూ ఫీలవ్వలేదు. నటించేకొద్దీ ఆ పాత్రలపై ఇష్టం పెరిగిపోయింది.
జాతీయ అవార్డు ఆశిస్తున్నారా?
వస్తే బాగుంటుందనుకుంటున్నాను.
మీ తరువాత చిత్రం ‘పత్తు ఎండ్రత్తుకుల్ల’ ఎలా ఉండబోతుంది?
యాక్షన్ ఓరియెంటెడ్ కమర్షియల్ మూవీ. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా ఉంటుంది.
‘ఐ’లాంటి సినిమా తరువాత మీరు చేయబోయే సినిమాలు ఇలానే ఉండాలని భావిస్తున్నారా?
అలాంటిదేమి లేదు. వైవిధ్యంగా ఉంటే చాలు, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా చేయడానికి నేను సిద్ధమే.
చైనాలో షూటింగ్ మీకు బాగా నచ్చిందని విన్నాం?
అవును. నిజం చెప్పాలంటే ప్రపంచంలోని అందమైన ప్రదేశాలు చైనాలోనే ఉన్నాయనిపించింది. పీసీ శ్రీరాం అంత గొప్పగా చైనా అందాలను తెరకెక్కించారు.
మీరు పోషించిన పాత్రలకు గొప్ప పేరు వచ్చి, ఆ సినిమాలు పరాజయం పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు ఏది ముఖ్యం... సినిమా విజయమా? మీ పాత్రకు పేరా?
నాకు రెండూ కావాలి... నా పాత్రకు మంచి పేరు రావాలి, సినిమా గొప్ప విజయం సాధించాలి. ఒక్కోసారి మన ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఒక్కోసారి మనం ఊహించకుండానే విజయాలు పొందవచ్చు. ఇదీ అంతే.
శంకర్ దర్శకత్వంలో మళ్లీ నటించాలనుకుంటున్నారా?
తప్పకుండా. ‘ఐ’తో నటుడిగా నా కల నిజమైనట్టనిపించింది. మరోసారి శంకర్ దర్శకత్వంలో అవకాశం వస్తే తప్పక నటిస్తాను.
తెలుగులోను మీకు చాలా క్రేజ్ ఉంది. మరి తెలుగులో డైరెక్టు సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటి?
నిజానికి తమిళంలోనే టైం దొరకడం లేదు. ఇక తెలుగులో అంటారా... భాష నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఎప్పుడు చేస్తానో తెలీదు కానీ, తప్పకుండా తెలుగులో డైరెక్టు సినిమా చేస్తా.

No comments:
Post a Comment