అమలాపురం,
ఫిబ్రవరి 1: ముక్కోటి దేవతలు దిగివచ్చి తిలకించే కల్యాణంగా పేరున్న తూర్పు
గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణంలో అపచారం
జరిగింది. స్వామివారి కల్యాణంలో చాపకింద నీరులా అన్యమత ప్రచారం
సాగిపోయింది. కల్యాణానికి రూపొందించిన పాసులకు ఒకవైపు స్వామివారి ఫొటో,
వెనుకవైపు క్రీస్తు ఫొటో ముద్రించారు. కల్యాణానికి హాజరైన విఐపిలు,
ఉన్నతాధికారులు, భక్తులకు, మీడియాకు వీటిని పంపిణీ చేశారు. కల్యాణం రోజే
అధికారులు గుర్తించినప్పటికీ, గోప్యంగా ఉంచారు. ఈ విషయం ఆదివారం బహిర్గతం
కావడంతో దుమారాన్ని రేపుతోంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం
జనవరి 29వ తేదీ రాత్రి జరిగింది. కల్యాణానికి హాజరయ్యే విఐపిలు, దాతలు,
మీడియా ప్రతినిధులకు ఇవ్వడానికి అధికారులు పాసులు ముద్రించి, పంపిణీ
చేశారు. అట్టపై ముద్రించి, చుట్టూ రిబ్బనుతో కుట్టిన ఈ పాసులకు ముందువైపు
లక్ష్మీ నరసింహస్వామి ఫొటో ముద్రించారు. అయితే పాసుకు వెనుకవైపు మాత్రం
క్రీస్తు రెండు చేతులు చాచి ఉన్న ఫొటో ఉంది. ఈ వ్యవహారం ఆదివారం వెలుగులోకి
వచ్చింది. దీనితో హిందూ సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ
వ్యవహారంపై వెంటనే ఉన్నత స్థాయి అధికారిచే నిష్పాక్షిక విచారణ జరిపించి,
బాధ్యులను సస్పెండ్ చేయాలని ధర్మజాగరణ ఆంధ్రప్రదేశ్ సంయోజక్ బులుసు జగదీష్,
హిందూ ధర్మరక్షణ సమితి నాయకులు ఇ.సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఒక పథకం
ప్రకారం ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. ఉత్సవాలకు ఎన్ని పాసులు
ముద్రించారు, ఎన్ని పంపిణీ చేశారు, దీనివెనుక ఉన్న కుట్రదారులు ఎవరు అనే
అంశాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్
బాధ్యత వహించాలని, ఆయనను వెంటనే విధుల నుండి తప్పించి, విచారణ
చేపట్టాలన్నారు. ఆలయంలో తలనీలాల వేలం విషయంలోనూ కుంభకోణం జరిగిందని, దీనితో
పాటు స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంగా జరిగిన ప్రతీ అంశంపై సమగ్ర
విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా
ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
అమలాపురం ఆర్డీవో వివరణ
పాసుల ముద్రణలో జరిగిన తప్పిదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్ తెలిపారు. స్వామివారి కల్యాణానికి గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా పాసులు ముద్రణకు ఇచ్చామని, ముద్రణ పూర్తయ్యాక ఎంపిడిఒ తన వద్దకు తీసుకువచ్చారని, అన్నీ సక్రమంగా ఉండటంతో ఆమోదం తెలిపానన్నారు. అయితే కల్యాణం సమయంలో వేరే పాసులు పంపిణీ చేసినట్టు గుర్తించి, వెంటనే ఎంపిడిఒకు నోటీసు ఇచ్చామన్నారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా వౌఖికంగా ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.

No comments:
Post a Comment