చాంద్రాయణగుట్ట,
ఫిబ్రవరి 1: రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో
ట్రాఫిక్ సమస్యలు అంతే వేగంగా పెరుగుతున్నాయి. రహదారిపై ఇష్టం వచ్చినట్లు
అతివేగంగా కార్లు, ద్విచక్ర వాహనాలను నడపడంతో నగర వాసులు అనేక ఇబ్బందులకు
గురవుతున్నారు. నగరానికి చెందిన పలువురు పౌరులు ట్రాఫిక్ సమస్యలను అరికడుతూ
అతివేగంగా వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ట్రాఫిక్
పోలీసులకు వేల సంఖ్యలో ఫిర్యాదు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్
పోలీస్ అదనపు కమిషనర్ జితేందర్ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో
ప్రత్యేక తనిఖీలను నిర్వహించారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4
గంటల వరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో దాదాపు 676 కార్లు, 193 ద్విచక్ర
వాహనాలను నడిపిన 869పై కేసులు నమోదు చేశారు. అతివేగంగా వాహనాలను
నడిపేవారికి చెక్ పెట్టడంతోపాటు వారిపై కేసులు నమోదుచేయడంతో కొంతవరకు
ట్రాఫిక్ సమస్యలను అధికమించవచ్చని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.
ఆదివారం కెబిఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు, ఎన్టీఆర్ ట్రస్ట్భ్‌వన్,
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ముఫకంజా కాలేజీ నుండి ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్
వరకు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ
తనిఖీల్లో ఓవర్ స్పీడ్‌తో కారులను నడిపిన 617 మందిపై, ద్విచక్రవాహనాలను
నడిపిన 151మందిని కలుపుకుని మొత్తం 768 కేసులను నమోదుచేసినట్లు వారు
తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రమాదభరితంగా, అతివేగంగా కారును నడిపిన 49మంది,
ద్విచక్రవాహనాలను నడిపిన 34మందితో కలుపుకుని మొత్తం 83 మందిపై కేసులు
నమోదయ్యాయి. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించి
ఏడుగురిపై, అదేవిధంగా లైసెన్స్ లేకుండా కారు, ద్విచక్రవానలను నడిపిని 11
మందిపై కేసులు నమోదుచేసినట్లు హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్
జితేందర్ తెలిపారు.


No comments:
Post a Comment