నిజామాబాద్ : అభివృద్ది పనుల కోసం ఆస్థి, నీటి పన్ను వసూలు : జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్
అభివృద్ది పనులు చేపట్టడానికి పెండింగ్ బిల్లులు చెల్లించడానికి నిధుల కొరత ఉందని, ఆస్థి,నీటి పన్నులు యుద్ద ప్రతిపాధికన సేకరించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మున్సిపల్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మున్సిపల్ ఇంజనీర్లు, అధికారులు, రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖ ఇంజనీర్లతో నగరాభివృద్దికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ యేడాది జారీ చేసిన డిమాండ్ నోటిసు రూ.2.83 కోట్లతో పాత బకాయిలతో కలిపి రూ.6.64 కోట్లు ఆస్తి పన్ను నీటి పన్ను బకాయిలు ఉన్నాయని, అందులో కేవలం 54 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలుపగా పన్నుల వసూలుకు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.


No comments:
Post a Comment