గ్రామ గ్రామానికి ఆర్టీసి సేవలు : రవాణా శాఖ మంత్రి పి. మహింధర్‌రెడ్డి
నిజామాబాద్ : తెలంగాణ ఆర్టీసి సేవలు గ్రామ గ్రామాలకు విస్తరించి ప్రజా రవాణా వ్యవస్థ దేశంలోనే మేటిగా నిలిచేందుకు కృషి చేస్తామని, చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి పి. మహింధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆయన పర్యటించి డిపోలో 25 లక్షల అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రోడ్ల రవాణా స్థం రాష్ట్రంలోని 94 డిపోల పరిధిలో 10,466 బస్సులు, 57,500 సిబ్బందితో ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. ఇప్పటికి 1300 గ్రామాలకు బస్సు సదుపాయాలు లేనందున ఆ గ్రామాలకు ఆర్టీసి సేవలు అందిస్తుందని ఆయన అన్నారు. ఇందుకు గాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 10 వేల కోట్లతో ఆర్‌అండ్ బి రోడ్లు , 5 వేల కోట్లతో పిఆర్ రోడ్లకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో జర్ని కేంద్రాల నుండి మండల కేంద్రాల నుండి రాజధానికి రోడ్ల విస్తరణతో బస్సు సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. 150 కోట్లతో పల్లె వెలుగు బస్సులు అన్ని గ్రామాలకు వేస్తున్నట్లు తెలిపారు. 100 ఓల్వో బస్సులు జిల్లా కేంద్రాల నుండి రాజధానికి, అంతర్ జిల్లా సర్వీసులుగా ముంబాయి, బెంగళూర్ తదితర ప్రాంతాలకు ప్రాధాన్యత క్రమంగా వేస్తామని తెలిపారు.


No comments:
Post a Comment