ఎస్సీ, ఎస్టీల చట్టాలపై పూర్తిస్థాయి అవగాహాన కల్పించాలి : కలెక్టర్ రోనాల్డ్ రోస్
నిజామాబాద్ : ఎస్సీ, ఎస్టీల రక్షణకు ఉద్దేశించిన చట్టాలపై వారికి అవగాహాన కల్పించే కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సరైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. తగురువారం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల అట్రాసిటి కేసులకు సంబందించి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పిర్యాదులపై కేసులు నమోదు చేయాలని, అంటరానితనం కొనసాగుతున్న గ్రామాలను గుర్తించుటకు సంయుక్తంగా విచారణ జరపాలని అధికారులకు సూచించారు. అన్యాయానికి గురి అయిన ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయడంతో పాటు సత్వర చర్యలకు నష్టపరిహారానికి ఆలస్యం జరగకుండ చర్యలు తీసుకోవాలన్నారు.
పేద దళితులకు భూమి కొనుగోలు పథకానికి సంబంధించి గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో లేనందున ప్రభుత్వానికి భూమిని అమ్మడానికి యజమానులు అధిక ధరలకు ఇవ్వగలమని చెబుతున్నందున ఆయా గ్రామాల దళితులు సంబందిత భూ యజమానులతో మాట్లాడి ధరలు నిర్ణయిస్తే వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. ఇందుకై 15కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కళ్యాణలక్షీ పథకం కింద వివాహాం చేసుకునే వారికి నెల రోజుల ముందుగానే 51 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని, అయితే ఈ పథకంపై ప్రజలకు మరింత అవగాహాన కల్పించి అర్హూలు సకాలంలో ధరఖాస్తు చేసుకునేలా సభ్యులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తసమావేశాలకు సంబందించి చర్చించిన వివరాల మినిట్స్‌ను వారం రోజుల్లోగా సభ్యులకు అందజేయాలని, సమావేశపు వివరాల చర్యలపై సమావేశానికి ముందుగానే ఒక రోజు మందుగా ఏ.టి.ఆర్. అందించాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అట్రాసిటి కేసులకు సంబందించి పోలీసు అధికారులు నమోదైన కేసులపై త్వరగా విచారణ పూర్తి చేసి సకాలంలో వారికి న్యాయం జరిగేలా యంత్రాంగానికి నివేదికలు అందించాలన్నారు. జిల్లాలో 35 కేసులు విచారణలో ఉన్నాయని, 84 ట్రయల్ కేసులు పెండింగులో ఉన్నాయని, 11.90 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం జరిగిందని వివరించారు.
జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే మాట్లాడుతూ భూ ఆక్రమణలపై శాసనసభ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, గతంలో సీలింగ్ సీలింగ్ సర్‌ప్లస్ క్రింద ప్రభుత్వం భూస్వాముల నుండి తీసుకున్న దళితులకు కేటాయించిందని, ప్రస్తుతం ఆ భూములు ఎవరి ఆధినంలో ఉన్నాయో పిర్యాదులను స్వీకరించనున్నదని, ఎస్సీ,ఎస్టీ కమిటీ జిల్లాలో పర్యటించినప్పుడు ఆ వివరాలు కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. తెమ్‌ఎల్‌సి విజి గౌడ్ మాట్లాడుతూ తతెలంగాణ విశ్వవిద్యాలయంలో నింబంధనలకు విరుద్దంగా రోస్టర్ పాయింట్లను పరిగణలోకి తీసుకోకుండా నియమాకాలు చేసారని చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ తదుపరి సమావేశానికి తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి అధికారి అన్ని వివరాలతో సమావేశానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ రవీంధర్ రెడ్డి, అదనపు జెసి రాజారాం, డిఆర్‌ఓ మనోహార్, ఆర్‌డిఓలు యాదిరెడ్డి, శ్యాంప్రసాద్ లాల్, నగేష్, సాంఘీక సంక్షేమశాఖ జెడి కాలేబ్, డియస్‌పిలు భాస్కర్, రామిరెడ్డి, ఆనంద్‌కుమార్, కమిటీ సభ్యులు బంగారు సాయిలు, డా.రాంమోహాన్ రావు, నాగమణి, సిద్దయ్య, ప్రభస్వామి, తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment