ఇసన్నపల్లిలో బోరు మోటర్ ప్రారంభించిన ఎంపిటిసి
నిజామాబాద్ ( కామారెడ్డి ) : భిక్కనూర్ మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో సోమవారం స్థానిక ఎంపిటిసి బైండ్ల తోగరి సుదర్శన్ బోరు మోటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లడుతు గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిని తీర్చడానికి స్థానిక ప్రభుత్వ విప్,ఎమ్మెల్యె గంప గోవర్ధన్ సహాకారంతో బోరు మోటర్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యెకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్,గ్రామస్తులు,తదితరులు పాల్గోన్నారు.


No comments:
Post a Comment