Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Wednesday, 11 March 2015

ఆశా - నిరాశాల మధ్య ఈటెల ' పద్దు '

రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక అవసరాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించాం. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో నెరవేర్చడానికి వీలుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. 

తెలంగాణ రాష్ట్ర తొలి పూర్తిస్థాయి బడ్జెట్
సంతృప్తి ఇచ్చింది.
భారీ బడ్జెట్‌తో తెలంగాణ ఆర్థిక బండి కదిలింది.
రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలి పూర్తిస్థాయి
బడ్జెట్‌ను బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. లక్షా 15 వేల 689 కోట్ల రూపాయల బడ్జెట్‌ను సభకు
ప్రతిపాదించారు. గత ఏడాది కంటే ఇది 15వేల కోట్లు
అదనం. కేంద్రం నుంచి గ్రాంట్స్ తగ్గినప్పటికీ
భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు. ప్రణాళికా వ్యయంలో సగపాలు (47శాతం) సంక్షేమ పథకాలకు కేటాయంచారు.
హైదరాబాద్, మార్చి 11: రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో లక్షా 15వేల 689కోట్లతో భారీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ప్రభుత్వ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. గత సంవత్సరం కన్నా ఇది పదిహేనువేల కోట్ల రూపాయలు ఎక్కువ. కేంద్రం నుంచి గ్రాంట్స్ తగ్గినప్పటికీ భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్టు ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు. బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రణాళికా వ్యయంలో 47శాతం అంటే 24,771 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు ప్రతిపాదించారు. సంక్షేమ కార్యక్రమాల తరువాత 9,156 కోట్ల రూపాయలతో 18 శాతం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రతిపాదించారు. 8,492 కోట్ల రూపాయలు(16%) ఇరిగేషన్‌కు ప్రతిపాదించారు. ప్రణాళికా వ్యయం 52,383 కోట్ల రూపాయలు, ప్రణాళికేతర వ్యయం 63,306 కోట్ల రూపాయలు. ఆర్థిక మిగులు 531కోట్లు, ద్రవ్య లోటు 16,969 కోట్ల రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 43శాతం ప్రకటించడంతో 2014-15 కన్నా ఈ సంవత్సరం ప్రణాళికేతర వ్యయం గణనీయంగా పెరిగింది. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే ప్రణాళికా వ్యయాన్ని తగ్గించడం వల్ల 2015-16 సంవత్సరపు ప్రణాళికా నిధులు పెంచేందుకు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం కేంద్రం నుంచి వచ్చే పన్నుల రాబడి 12,823 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ తగ్గించిందని, దాంతో 2014-15లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రణాళిక నిధులు 11,781 కాగా, ఈ సంవత్సరం 6,497 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినట్టు చెప్పారు.
వాటర్ గ్రిడ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ నాలుగువేల కోట్ల రూపాయలు కేటాయించారు. మిషన్ కాకతీయతోపాటు చీఫ్ ఇంజనీర్, చిన్ననీటి పారుదల శాఖతోకలిపి 2,083 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ పథకాలకు కావలసిన నిధులను నాబార్డుతోపాటు ఇతర బ్యాంకుల ద్వారా సమీకరిస్తారు. 2014-15లో మిషన్ కాకతీయ పథకం కింద 9,305 చెరువుల పునరుద్ధరణ చేపట్టినట్టు చెప్పారు. 1835.42 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 5,761 చెరువులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2015-16లో 9,308 చెరువులను పునరుద్ధరిస్తారు. రహదారుల అభివృద్ధికి ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయం కింద రోడ్లు భవనాల శాఖకు 4,980 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం కోసం మిషన్ కాకతీయతో కలిపి ఇతర సాగునీటి ప్రాజెక్టులన్నింటికి కలిపి వార్షిక ప్రణాళికలో 8,500 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు.
విద్యుత్ రంగానికి 7,400 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు. 2015-16 సంవత్సరంలో హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో వరంగల్‌లో వస్త్రోత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కొత్తగా ఏర్పడే ఫార్మా సిటీ, ఇండస్ట్రియల్ పార్క్‌లకు అనుసంధానంగా మినీ పారిశ్రామిక టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 30 నిమిషాల ప్రయాణ దూరంలో ముచ్చర్ల గ్రామంలో 11వేల ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం 973.74 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు.
ఉద్యోగుల జీతభత్యాల కోసం 22,889 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. సబ్సిడీ బియ్యం పథకానికి 2,200 కోట్ల రూపాయలు కేటాయించారు. అంగన్‌వాడి కార్యకర్తల జీతం 4200 రూపాయల నుంచి ఏడువేల రూపాయలకు, అంగన్‌వాడి సహాయకుల జీతం 2450 రూపాయల నుంచి 4,500 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రతి అంగన్‌వాడి కేంద్రానికి వెయ్యి రూపాయల చొప్పున గ్రాంట్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళా, శిశు సంక్షేమానికి 771 కోట్ల రూపాయలు కేటాయించారు. బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల భృతి కోసం 188 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించారు. మైనారిటీల సంక్షేమానికి 1105 కోట్ల రూపాయలు, ఆసరా పించన్ల పథకానికి నాలుగువేల కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. బిసిల సంక్షేమానికి 2,172 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలంగాణ ప్రభుత్వం మూడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మొదటిది బలహీన వర్గాల సంక్షేమం, రెండు వ్యవసాయ రంగం, అభివృద్ధి మూడవది అని పేర్కొన్నారు. ఈ మూడు తమ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలే కాకుండా ప్రభుత్వ విధానాలు కూడా అని ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణకు ఉన్న తలసరి ఆదాయ వనరులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం వల్ల తెలంగాణ తిరోగమనం పాలయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన లలిత్ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు చెప్పారు.తెలంగాణ వాటాను ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఖర్చు చేశారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఆదాయ వ్యయాల ధోరణి బట్టి వేసిన అంచనా ప్రకారం 2015-16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి సొంత ఆదాయం 11,872 రూపాయలు కాగా, రెవెన్యూ వ్యయం 18,281 రూపాయలని తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం తలసరి సొంత ఆదాయం 16,274 రూపాయలు కాగా, రెవెన్యూ వ్యయం 16,042 రూపాయలు మాత్రమేనని తెలిపారు. జాతీయ స్థాయిలో ఆర్థిక రంగ పురోగమనానికి తోడు, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2015-16 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
అంకెల్లో బడ్జెట్
* బడ్జెట్ 1,15,689 కోట్లు
* ప్రణాళికా వ్యయం 52,383 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం 63,306కోట్లు
* ఆర్థిక మిగులు 531 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా 16,969 కోట్లు.
* పన్నుల రాబడి 12,823 కోట్లు
* ఎస్సీల సంక్షేమానికి 5,547 కోట్లు
* గిరిజన సంక్షేమానికి 2,878 కోట్లు
* బిసి సంక్షేమానికి 2,172 కోట్లు
* మైనారిటీ సంక్షేమానికి 1105 కోట్లు
* ఆసరా పెన్షన్లకు 4వేల కోట్లు
* హైదరాబాద్ అభివృద్ధికి 526 కోట్లు
* విద్యా రంగానికి 11,216 కోట్లు
* విద్యుత్ శాఖకు 7400 కోట్లు
* మిషన్ కాకతీయ 2,083 కోట్లు
* ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు 22,889
* ఎర్రజొన్న రైతులకు 13.5 కోట్లు
* హైదరాబాద్ నీటి సరఫరాకు
వెయ్యి కోట్లు
* స్ర్తిశిశు సంక్షేమ శాఖకు 771 కోట్లు
* ఆర్టీసీకి 400 కోట్లు
* రైతు రుణమాఫీ 4,250 కోట్లు
* గ్రీన్ హౌస్ వ్యవసాయానికి 200 కోట్లు
* ఉస్మానియా యూనివర్సిటీకి
238 కోట్లు
* అటవీ శాఖ,హరిత హారంకు 325 కోట్లు
* తెలంగాణ వాటర్ గ్రిడ్‌కు
నాలుగువేల కోట్లు
* రోడ్ల అభివృద్ధికి 2,421 కోట్లు
* డ్రిప్ ఇరిగేషన్‌కు 200 కోట్లు
* పారిశ్రామిక ప్రోత్సహాలకు 974 కోట్లు
* బీడీ కార్మికుల భృతికి 188 కోట్లు
* దళిత కుటుంబాలకు మూడెకరాల
భూమి కొనుగోలుకు 1000 కోట్లు
* అంగన్‌వాడీ కార్యకర్తలకు
ఏడువేల రూపాయలు,
సహాయకులకు రూ. 4,500 వేతనం
* వైద్య శాఖకు 4932 కోట్లు
* సబ్సిడీ బియ్యంకు 2,200 కోట్లు
* హైదరాబాద్‌లో స్కై వేలకు 1600 కోట్లు
* మార్కెటింగ్ శాఖకు 411 కోట్లు
* గిడ్డంగుల నిర్మాణానికి 403.50 కోట్లు
* నగరంలోని పోలీస్ స్టేషన్ల నిర్వాహణకు
నెలకు 75వేల రూపాయలు,
జిల్లా కేంద్రాల్లో 50వేలు,
గ్రామాల్లోని స్టేషన్లకు 25వేలు
* పంచాయితీరాజ్‌కు 2421 కోట్లు
* విద్యుత్ రంగానికి 7400 కోట్లు
* రోడ్లు భవనాలకు 4980 కోట్లు
* వాటర్ గ్రిడ్‌కు నాలుగువేల కోట్లు.
* 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలలో
బారోయింగ్ పరిమితులను
3.5శాతాని పెంచింది.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks