హైదరాబాద్, మార్చి 11: రానున్న ఆర్థిక సంవత్సరం 2015-16కు సంబంధించి తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి కడియం శ్రీహరి బుధవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సుమారు 64వేల, 306 కోట్ల ప్రణాళికేతర వ్యయం, మరో రూ. 52వేల 383 కోట్ల ప్రణాళిక వ్యయంతో కలిపి మొత్తం దాదాపు రూ. లక్షా 15వేల 689 కోట్ల భారీ బడ్జెట్‌పై మంత్రి సుమారు గంట పది నిమిషాల సేపు సభలో ప్రసంగించారు. గత సంవత్సరం నవంబర్‌లో ప్రవేశపెట్టిన స్వల్పకాలిక బడ్జెట్‌లో కేటాయింపులు, ప్రస్తుతం బడ్జెట్‌లోని కేటాయింపులకు వ్యత్యాసం, వివిధ విభాగాల వారీగా సర్కారు ఇచ్చిన ప్రాధాన్యతలను వివరిస్తూ మంత్రి ప్రసంగం కొనసాగింది. గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన పలు శాఖల పటిష్టపరిచేందుకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ఓ మహోన్నతమైన మంచి సంకల్పం, లక్ష్యంతో బడ్జెట్‌ను రూపొందించిందన్నారు. మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను ఈ నెల 13వ తేదీ ఉదయం పది గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.


No comments:
Post a Comment