భక్తుల రామస్మరణతో భద్రాద్రి మారు మోగింది. సీతారామ కల్యాణం తిలకించేందుకగు మండుటెండలు సైతం లెక్క చేయకుండా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. భద్రాచలం సీతా రాముల కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీసమేతంగా పట్టు వస్ర్తాలు, ముత్యాలు తలంబ్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ర్ట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ భద్రాద్రిని ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా తీర్చి దిద్దుతామని చెప్పారు. అందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు.



No comments:
Post a Comment