Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad
Showing posts with label Mahaboobnagar. Show all posts
Showing posts with label Mahaboobnagar. Show all posts

Saturday, 30 July 2016

పెబ్బేరులో రియల్‌ దందా

 పెబ్బేరులో రియల్‌ దందా
మహబూబ్‌ నగర్‌, జూలై 30,  
పాలమూరులో రియల్‌ దందా ఆగడాలు తీవ్రమవుతున్నాయి. ముందు.. ప్రైవేట్‌ స్థలం తీసుకోవడం తర్వాత... పొరంబోకులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. పెబ్బేరు మండల కేంద్రం నుంచి వనపర్తికి వెళ్లే ప్రధాన రోడ్డులో కొందరు రియల్‌ వ్యాపారులు వివేకానందనగర్‌ పేరుతో ఇటీవల ఏడెకరాల్లో వెంచర్‌ ఏర్పాటుచేశారు. ఆ పక్కనే ప్రభుత్వ భూమి ఉండటంతో వారి కన్ను దీనిపై పడింది. అందూలోనూ దర్జాగా ప్లాట్లను చేసి అమ్మకానికి పెట్టారు. అక్కడ అక్రమంగా పార్కు నిర్మిస్తుండడాన్ని స్థానిక అంబేద్కర్‌కాలనీ వాసులు గమనించారు. వారం రోజుల క్రితమే ఈ పనులను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వెంచర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. సర్వే నం.3లో 14గుంటలు, ఇంకా ఇతర సర్వే నంబర్లలోనూ ప్రభుత్వ భూములున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు ఈశ్వర్‌, గోవిందు, రాముడు ఆరోపించారు. కాగా, నాలుగు రోజుల క్రితం సర్వే చేసేందుకుగాను ఆర్‌ఐ లావణ్య, సర్వేయర్‌ రామకష్ణ అక్కడికి వచ్చినా కాసేపు అటు ఇటు తిరిగి పాయింట్‌ దొరకడం లేదంటూ వెళ్లిపోయారు. పెబ్బేరు వనపర్తి ప్రధాన రోడ్‌లో ఉన్న ఈ ప్రభుత్వ భూమి ప్రస్తుతం రూ.లక్షల్లో పలుకుతుండటంతో స్థానిక రెవెన్యూ అధికారులు రియల్‌ వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తహసీల్దార్‌ దత్తాద్రీని వివరణ కోరగా త్వరలో ఆ స్థలాన్ని పకడ్బందీగా సర్వే చేయిస్తామన్నారు. హద్దులు ఏర్పాటుచేసి ప్రభుత్వ భూమిని తమ అధీనంలోకి తీసుకుంటామన్నారు.

ఇప్పటికైనా సాగునీరు అందేనా...

 ఇప్పటికైనా సాగునీరు అందేనా...
మహబూబ్‌ నగర్‌, జూలై 30,
మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ జరిగినా కూడా నీరందని దుస్థితి. కారణం చెరువు నీరు పొలాలకు అందించే కాలువల వ్యవస్థ కూలిపోవడం దీంతో పొలాలకు సాగునీరందడం కష్టంగా మారింది. కాలువల్లో పూడిక నిండడం, పిచ్చి మొక్కలు మొలవడం, కాలువలు కబ్జా గురికావడం ఇలా అనేక కారణాలతో చెరువు నుంచి పంట పొలాలకు సాగు నీరందడం లేదు. నుంచి పంటలకు సాగు నీరందించేందుకు గాను ఏర్పాటు చేసిన కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి, చెత్తా చెదారం నిండి అధ్వానంగా తయారయ్యాయి. దీంతో పంట పొలాలకు సాగు నీరందండం కష్టంగా మారింది.చెన్నూర్‌ మండలంలోని కాచన్‌పల్లి కొత్త చెరువు నుంచి అంగ్రాజ్‌పల్లి, రాయిపేట గ్రామాలలోని పంట పొలాలకు సాగు నీరందించేందుకు గాను ప్రభుత్వం 30 ఏళ్ల క్రితం కాలువలను తవ్వించింది. ఈ కాలువల ద్వారా అంగ్రాజ్‌పల్లి, రాయిపేట గ్రామాల్లోని సుమారు 500 ఎకరాల పంట పొలాలకు సాగు నీరు అందేది. గత కొన్నేళ్లుగా కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి, చెత్తా చెదారం నిండిపోవడంతో నీరు వెళ్లే మార్గం లేదు. రెండేళ్ల క్రితం కాలువకు గండిపడటంతో రైతులు ఇసుక బస్తాలను వేసి నీరు వథా కాకుండా చూశారు. ఇంత వరకు కాలువలకు మరమ్మతులు చేపట్టక కాలువల వ్యవస్థ మరీ అధ్వానంగా తయారైంది. కొందరు రైతులు కొన్ని చోట్ల కాలువలను కొద్ది కొద్దిగా చిన్నగా చేస్తూ వస్తున్నారు.కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని సైతం తొలగించడం లేదని చెబుతున్నారు. దాదాపు మండల వ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు

Wednesday, 11 May 2016

మహబూబ్‌ నగర్‌ :నీటి బకెట్‌ లో పడి చిన్నారి మ తి

నీటి బకెట్‌ లో పడి చిన్నారి మ తి
మహబూబ్‌ నగర్‌,
మహబూబ్‌ నగర్‌ జిల్లా అత్మకూర్‌ మండలం కొంకనన్నిపల్లె లో రెండేళ్ల చిన్నారి అఖిల నీటి బకెట్‌ లో పడి మ తి చెందింది. ఇంట్లో ఎవరూ లేని
సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్థుడు గొల్ల రాజన్నకు ఇద్దరు భార్యలు వున్నారు. మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో రెండో వివాహం
చేసుకున్నాడు. రెండో భార్యకు సంతానం అఖిల కలిగింది. ఈరోజు తల్లి వ్యవసాయ పనిలో వుండడంతో అఖిల ఇంట్లో వున్నబకెట్‌ లో ప్రమాదవశాత్తు
పడిపోయింది. ఘటనతో గ్రామంలో విషాదం అమలుకుంది. 

Saturday, 28 March 2015

భక్తుల రామస్మరణతో భద్రాద్రి మారు మోగింది.




భక్తుల రామస్మరణతో భద్రాద్రి మారు మోగింది. సీతారామ కల్యాణం తిలకించేందుకగు మండుటెండలు సైతం లెక్క చేయకుండా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. భద్రాచలం సీతా రాముల కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీసమేతంగా పట్టు వస్ర్తాలు, ముత్యాలు తలంబ్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ర్ట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ భద్రాద్రిని ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా తీర్చి దిద్దుతామని చెప్పారు. అందుకు  కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు.

Sunday, 4 January 2015

మహబూబ్‌నగర్‌: అమ్మేది రూ.1500కు.. కొనేది రూ.500కు...

 మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకవైపు విత్తన పత్తి (సీడ్‌ కాటన్‌) సాగు విస్తరిస్తుండడం ఆనందంగా ఉన్నా, మరోవైపు ఏజెంట్ల ప్రమేయం పెరుగుతుండడం అన్నదాతకు కష్టాలను మిగులుస్తోంది. ఆర్గనైజర్లకు, కంపెనీలకు సిరులు కురిపిస్తున్న ఈ పంట, కష్టించిన పండించిన కర్షకునికి నష్టాలను తెచ్చి పెడుతోంది. 450 గ్రాముల ఫౌండేషన్‌ సీడ్‌ విత్తనాల సంచిని రైతులకు రూ.1500కు అమ్ముతున్న కంపెనీలు, అదే విత్తనాలను అన్నదాతల నుంచి రూ.500కు మించి కొనకపోవడమే ప్రధాన కారణం. సీడ్‌ పత్తి సాగులో ఏజెంట్ల పాత్రను నిరోధించి, ప్రభుత్వ అజమాయిషీలో రైతులకు, కంపెనీలకు మధ్య ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తప్ప సీడ్‌ పత్తి పాలమూరు రైతులకు ఫలాలను అందించలేదు. 
సీడ్‌ కాటన్‌ కేంద్రంగా మహబూబ్‌నగర్‌
సమశీతోష్ణస్థితి కలిగి, భూసారమున్న, నీరు నిల్వని నల్ల, ఎర్ర నేలలున్న మహబూబ్‌నగర్‌ జిల్లా సీడ్‌ కాటన్‌ సాగుకు ప్రసిద్ధిగాంచింది. దశాబ్దకాలం క్రితం కంపెనీలు ప్రయోగాత్మకంగా జిల్లాలో మొదలెట్టిన ఈ సాగు ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యప్రాంతమైన గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లోని గద్వాల, మల్దకల్‌, ధరూర్‌, అయిజ, ఇటిక్యాల, కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట మండలాల్లో సీడ్‌ పత్తి సాగవుతోంది. గతేడాది జిల్లాలో సుమారు 60వేల ఎకరాల్లో కాటన్‌సీడ్‌ సాగు చేయగా, సీడ్‌ ఆర్గనైజర్లు (ఏజెంట్లు), రైతులకు మధ్య ఒప్పందాలు సరిగాలేక, ఈ యేడాది సాగు తగ్గింది. సుమారు 35వేల ఎకరాలకే సీడ్‌పత్తి పరిమితమైంది.
కుచ్చుటోపీ పెడుతున్న కంపెనీలు
దాదాపు 10 పత్తి విత్తన కంపెనీలు జిల్లా రైతులచే సీడ్‌ పత్తిని పండిస్తున్నాయి. కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకోకుండా, ఆర్గనైజర్ల(ఏజెంట్లు)తో వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. రైతుకు, కంపెనీకి మధ్య నేరుగా ఒప్పందం లేకపోవడం, వీరి మధ్య ఒప్పందానికి ఎలాంటి సాధికారత లేకపోవడంతో రైతులు దగాపడాల్సి వస్తోంది. విత్తన సరఫరా మొదలు పంట చేతికొచ్చి కంపెనీకి గింజలు అప్పగించేంత వరకు ఏజెంట్లు ఆడిందే ఆటగా సాగుతోంది. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి, పండించిన తర్వాత కూడా జర్మినేషన్‌ (మొలక శాతం) పేరుతో రైతులను ఏజెంట్లు దోచుకుంటున్నారు. పండించిన గింజలకు ముందస్తు ఒప్పందం ఒకలా ఉంటే, చివరకు విత్తనాలు ఏజెంట్ల చేతికి వెళ్లాక జర్మినేషన్‌ రాలేదంటూ ధరలో కోత విధిస్తున్నారని, దీంతో అప్పుల పాలవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
అమ్మేది రూ.1500కు.. కొనేది రూ.500కు
సీడ్‌ పత్తి విత్తనాల ఉత్పత్తిలో రైతులతో కంపెనీలు, ఏజెంట్లు చెలగాటమాడుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన మూల విత్తనాలను (ఫౌండేషన్‌ సీడ్స్‌) 450 గ్రాముల ప్యాకెట్‌ రూ.1500కు రైతులకు ఇస్తారు. పంట పండిన తర్వాత అవే విత్తనాలను, అదే సైజు ప్యాకెట్‌ని రైతుల వద్ద నుంచి రూ.500కు లోబడి కొంటున్నారు. ఒక్క ఎకరాకు రెండు సంచుల విత్తనాలు నాటుతారు. క్వింటాల్‌ పత్తి దిగుబడిలో కనీసం 60 కేజీల విత్తనాలు వస్తాయి. ఒక ఎకరాకు తక్కువలో తక్కువ కనీసం 6 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చినా 360కేజీల విత్తనాలు ఉత్పత్తవుతాయి. ఈ లెక్కన ఒక ఎకరాకు 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్లు 800 వరకు ఉత్పత్తవుతాయి. ఈ లెక్కన ఒక ఎకరా సాగు చేసే రైతు ఎంత నష్టపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
సీడ్‌ పత్తి సాగులో కష్ట నష్టాలెన్నో
సాధారణ పత్తి సాగుని బీటీ రకాలు ఆక్రమించిన తర్వాత క్షేత్రస్థాయిలో సాగు సులువైంది. మూడు మాసాల వరకు పచ్చ పురుగు రాకపోవడం, దోమపోటు నియంత్రణలోఉండడం లాంటి సానుకూల అవకాశాలతో తక్కువ కూలీలు, శ్రమతో బీటీ పత్తి పండుతుంది. సీడ్‌ పత్తి సాగు మాత్రం ఇందుకు భిన్నంగా కొంత శ్రమతో కూడుకుంది. ఆయా కంపెనీలిచ్చిన మూల విత్తనాల్లో ఆడ, మగ విత్తనాలను వేర్వేరుగా నాటాల్సి ఉంటుంది. 85 నుంచి 90శాతం ఆడ విత్తనాలు నాటితే కనీసం 10నుంచి 15శాతం మగ విత్తనాలను నాటుతారు. మొక్కలు పూతదశకు వచ్చినప్పుడు మగ విత్తనాలకు చెందిన పుష్పాలను ఉదయాన్నే తెంచి, ఆడ మొక్కల పుష్పాలపై చల్లాల్సి ఉంటుంది. ప్రతి ఆడమొక్క తల భాగాలపై, పుష్పాలపై పడేలా జాగ్రత్తగా ఈ ప్రక్రియ కొనసాగాల్సి ఉంటుంది. దీంతో పాటు దోమపోటు, తెగుళ్లు, పురుగుల తాకిడి నివారణకు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇలా విత్తనం నాటింది మొదలు, పత్తి తీత వరకు సీడ్‌ పత్తి సాగులో రైతులు అడుగడుగునా శ్రమ, ధనం వెచ్చించాల్సి ఉంటుంది. 
ప్రభుత్వ జోక్యంతోనే ఏజెంట్లకు చెక్‌
తెలంగాణ రాష్ట్రం మొత్తంగా సీడ్‌పత్తి సాగులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏజెంట్ల ఆగడాలకు చెక్‌ పెట్టాలి. అప్పుడే సీడ్‌పత్తి సాగు రైతులకు ఉపయోగకరమవుతుంది. కంపెనీలకు, రైతులకు మధ్య జరిగే ఒప్పందాల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. సీడ్‌పత్తి సాగుకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన విధానాన్ని రూపొందించి, ఖచ్చితంగా అమలు చేస్తే కర్షకులకు ప్రయోజనం కలుగుతుందని రైతు సంఘం నాయకులు అంటున్నారు. సీడ్‌పత్తి సాగుని శాసిస్తున్న ఏజెంట్లను నిరోధిస్తే తప్ప జిల్లాలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, నేలలు జిల్లా రైతాంగానికి ఉపయోగపడవని చెబుతున్నారు.
Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks