సరైన పర్యవేక్షణలో ఆఫీసర్స్‌క్లబ్‌ను నిర్వహించాలి
నిజామాబాద్ : నిజామాబాద్ అఫీసర్స్‌క్లబ్‌లో సరైన కార్యకలాపాలు జరగాలని, పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సూచించారు. శనివారం తన చాంబర్‌లో నిజామాబాద్ ఆఫీసర్స్‌క్లబ్ అధికారులు, కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాత్రి 9 గంటలలోగా తమతమ కార్యకలాపాలను ముగించాలని పేకాట మినహా క్యారమ్, టేబుల్‌టెన్నిస్, బ్యాడ్మింటన్ తదితర పోటీలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. గజిటెట్ స్థాయి అధికారులకు మాత్రమే సభ్యత్వ నమోదు ఇవ్వాలని, ప్రతి సంవత్సరం వీరి నుంచి 1200 రూపాయలు ఫీజుగా వసూలు చేయాలని, సభ్యులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. జనవరి నుండి జూన్ వరకు క్లబ్‌కు సంబంధించిన లెక్కలను చూపించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ రవిందర్‌రెడ్డి, డిసివో శ్రీహరి, ఆర్డీఓ యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment