Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 2 January 2016

రికార్డు స్థాయిలో 11 గంటల పాటు క్యాబినెట్ భేటీ - GHMC ఎన్నికల నేపథ్యంలో వరాల జల్లు

హైదరాబాద్:రికార్డుస్థాయిలో పదకొండుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రజలపై వరాలు కురిపించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నింటికంటే మిన్నగా.. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన బడ్జెట్ రూపకల్పనలో అందరికీ ఆదర్శంగా ఉండేలా కొత్త పంథాను నిర్దేశించుకున్నారు. 


  • -కొత్తపంథాలో బడ్జెట్
  • -ప్రాథమ్యాల ఖరారు
  • - జిల్లా అభివృద్ధి పత్రాలు
  • - ఇరిగేషన్‌కు 25 వేల కోట్లు
  • - రాష్ట్ర ఆదాయంలో 15% వృద్ధి
  • - రాబోయే బడ్జెట్‌కూ అదేస్థాయిలో సన్నద్ధం
  • - ముందస్తు బడ్జెట్ తప్పేమీ కాదు
  • - రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 
  • - నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్


రాష్ట్ర ఆదాయంలో ఇప్పటికే 15% వృద్ధి కనిపిస్తున్నందున రాబోయే బడ్జెట్‌కూడా అదేస్థాయిలో ఉండేలా ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల పరిమాణాలను, ప్రాథమ్యాలను మంత్రివర్గం ఖరారు చేసుకుంది. అదే సమయంలో ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కీలక సమస్యలకు చరమగీతం పాడారు. క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. 

  • -18 వేల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ 
  • -15,628 టీచర్ పోస్టుల భర్తీ
  • -అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీగా వేతనాల పెంపు
  • -మైనారిటీ సంక్షేమ శాఖకు సొంతంగా ఉద్యోగ వ్యవస్థ- పోస్టులు మంజూరు
  • -18 వేల సెలూన్లకు గృహ వినియోగ కరెంటు చార్జీల వర్తింపు
  • -వీధి వ్యాపారులకు రక్షణ, రుణాలు, గుర్తింపు కార్డులు
  • -ట్రాఫిక్ పోలీసులకు అదనంగా 30 శాతం పొల్యూషన్ అలవెన్స్
  • -గ్రేటర్ పరిధిలో రూ.1200లోపు ఉన్న ఆస్తి పన్ను ఇకపై రూ.101
  • -15 సంవత్సరాల మంచినీటి బకాయిలు రూ.457కోట్లు రద్దు
  • -వచ్చే విద్యా సంవత్సరం నుంచి 60 మైనారిటీ గురుకులాలు
  • -గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ యూనిట్ వ్యయం రూ.7లక్షలకు పెంపు
  • -హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా 40టీఎంసీల నీటి నిల్వసామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు
  • -నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసే కాంట్రాక్టర్లకు 1.5శాతం ప్రోత్సాహకం
  • -97 అర్బన్ ఆరోగ్య కేంద్రాలు పీహెచ్‌సీల స్థాయికి అప్‌గ్రేడ్
  • -కొత్తగూడెంలో రిజర్వు పోలీసు బెటాలియన్‌కు 115 ఎకరాలు
  • -వారంలోపే కారుణ్య నియామకాలు పూర్తయ్యేలా కొత్త విధానం
  • -రిటైరైన ఉద్యోగికి విధుల చివరి రోజున ఒకేసారి బెనిఫిట్స్ ప్యాకేజీ
  • -ఒకటి రెండు రోజుల్లో శాఖల వారీగా ప్రణాళిక కేటాయింపుల వెల్లడి 
  • -గ్రేటర్ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, సడలింపులు


కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీగా పెంపు, ట్రాఫిక్ పోలీసులకు పొల్యూషన్ అలవెన్స్, బార్బర్ సెలూన్లకు డొమెస్టిక్ కరెంట్ చార్జీల వర్తింపు, కారుణ్య నియామకాల్లో వేగం, రిటైరయ్యే సమయానికే అన్ని రకాల బెనిఫిట్లతో ఒకేసారి ప్యాకేజీ, వీధి వ్యాపారులకు ప్రభుత్వ రక్షణ, వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ అంచనా వ్యయం పెంపు, నగరానికి ప్రత్యేకంగా తాగునీటి రిజర్వాయర్లు.. తదితర అంశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఆయా వర్గాల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ఈ నిర్ణయాలు ప్రకటించిన వెంటనే సచివాలయంలో పలు వర్గాల ప్రజలు, ఉద్యోగులు కేసీఆర్ ఫ్లెక్సీకి అప్పటికప్పుడు క్షీరాభిషేకం చేయడం విశేషం. పకడ్బందీగా బడ్జెట్ రూపకల్పన, పలు వర్గాలపై వరాల వానకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల వివరాలు ఆయన మాటల్లోనే..

ఈ రోజు జరిగిన మారథాన్‌లో సమావేశంలో చర్చ చేసిన అంశం ఏందంటే.. బడ్జెట్ మేకింగ్ అనేది ఇప్పటి వరకు మూస పద్ధతిలో ఉండేది. అనేక కన్ఫ్యూజన్లు.. ఇబ్బందులు..! ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ చుట్టూ అనేక ఇతర శాఖలు తిరగాల్సి వచ్చేది. దీనిపై పెద్ద డిస్కషన్ జరిగింది. అందుకే బడ్జెట్ రూపకల్పనలో కొత్త పంథా అవలంబించాలని నిర్ణయించినం. ఏ శాఖకు నాన్‌ప్లాన్ ఎంత? ప్లాన్ కింద ఎంత డబ్బు వస్తుందనే స్పష్టమైన విధానం రూపకల్పన చేయడం జరిగింది. మంచి పద్ధతిలో రూపకల్పన చేశాం. దీని ముందు జరిగిన అనేక రివ్యూ మీటింగ్‌ల్లో చూసినం. శాఖలవారీగా రాష్ర్టానికి ఎస్వోటీఆర్ (స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూ), ఎస్వోఆర్ (స్టేట్ ఓన్ రెవిన్యూ) రెండు రకాల ఆదాయ మార్గాలుంటాయి. మైన్స్, సాండ్‌మైన్స్, అటవీశాఖ ద్వారా వచ్చే ఆదాయం. ఎస్‌వోటీఆర్, ఎస్‌వోఆర్‌ను కలిపి కూడా ఎస్‌వోఆర్ అనే అంటరు. దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో 15% పెరుగుదల ఉంది. అన్ని రంగాల్లో వృద్ధి ఉంది.

వాణిజ్య పన్నులు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్, మైన్స్‌లో కూడా పెరుగుదల ఉంది. ఇది చాలా చక్కగా ఉంది. అందుకే పోయిన సంవత్సరం బడ్జెట్‌పై 15 శాతం పెరుగుదల కచ్చితంగా ఉంటది. దీని మీదనే క్యాబినెట్‌లో చాలా చర్చ జరిగింది. ఎంత పెరుగుతది? ఎక్కడ పంచాలి? ప్రాథమ్య క్రమాలు ఏంది? అనే దానిపై ఫలవంతమైన చర్చ జరిగింది. కార్యక్రమాల అమలులో వేగాన్ని పెంచుతం. టార్గెట్స్ తెలుస్తాయి. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించతలుచుకున్న లక్ష్యాలు రీచ్ అయ్యేలా ఉంటది. ఎప్పుడూ జరుగనంత విపులంగా చర్చ జరిగింది. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks