హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం రాత్రి మల్కాజ్‌గిరిలో నిర్వహించిన బీజేపీ, టీడీపీ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.



No comments:
Post a Comment