ఉగ్రవాదులు చెరబట్టిన పంజాబ్ పోలీసు ఉన్నతాధి కారి, మొన్నటిదాకా ఆ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లా గురుదాస్ పూర్ ఎస్పీగా పనిచేసిన సల్వీందర్ సింగ్ మంగళ వారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. ఓ వైపు సల్వీందర్ సింగ్ వ్యవహా ర సరళిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన నేష నల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు ఆ యనతో పాటు ఆయన వెంట వెళ్లిన వంట మనిషి మదన్ గోపాల్ ను కూడా విచారించారు. విచారణ సందర్భంగా పొంతన లేని సమాధానాలు ఇచ్చిన సల్వీందర్ సింగ్ విచారణాధికారులకు చిర్రెత్తిం చారు. మంగళవారం ఉదయం మీడియా ముందుకు వచ్చిన సల్వీందర్ సింగ్, తానిచ్చిన సమాచారం కారణంగానే పెద్ద ముప్పు తప్పిం దని చెప్పారు. పఠాన్ కోట్ లోని ఓ గుడికి వెళ్లి వస్తున్న తనను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత వదిలేశారని సింగ్ చెప్పారు. ఆ తర్వాత సమీపం లోని గోల్ పూర్ సింబ్లీ గ్రామానికి చేరుకున్నానని ఆయన తెలిపారు. గ్రామస్తు లకు తానెవరో చెప్పి, అక్కడి నుంచే తన పై అధికారులకు ఈ విషయంపై సమాచారం చేరవేశానని చెప్పారు. తానిచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ సహా, పలు కీలక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారన్నా రు. దీంతోనే ఎయిర్ బేస్ లోకి చొచ్చుకువెళ్లినా, ఉగ్రవాదులు కీలక స్థావరాల దరికి చేరలేక పోయారని ఆయన చెప్పారు.
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్ర వాద దాడిలో ఆ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన సీనియర్ అధికారి సల్వీందర్ సింగ్ వ్యవహార సరళి ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ పోలీసు అధికారి హోదాలో ఉన్న సల్వీందర్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వదిలేసి నగల వ్యాపారం చేస్తున్న ఓ స్నేహితుడు, వంట మనిషితో కలిసి పఠాన్ కోట్ వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రస్తుతం సల్వీందర్ తో పాటు ఆయన వంట మనిషి మదన్ గోపాల్ లను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ప్రశ్నిస్తున్నా రు. విచారణ సందర్భంగా సల్వీందర్ పొంతన లేని సమా� దానాలు చెబుతున్నారట. తమను అపహరిం చిన ఉగ్ర వాదుల సంఖ్యపై ఆయన ముందో మాట, ఆ తర్వాత మరో మాట చెప్పినట్లు సమాచారం. ఇక అత్యంత రహస్యంగా పఠాన్ కోట్ వెళ్లాల్సిన అవసరమేమిటన్న విషయంపై సల్వీందర్ నోరు విప్పడం లేదని సమాచారం. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు బయలుదేరిన ఉగ్రవాదులు, సల్వీందర్ కారు కంటే ముందు మరో కారును వినియోగించారు.
సదరు కారు డ్రైవర్ ను ఉగ్రవాదులు చంపేశారు. మరి పోలీసు అధికారి అయిన తనను ఎలా విడిచిపెట్టారన్న ప్రశ్నకు సల్వీందర్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నీలి బుగ్గ ఉన్న కారులో పఠాన్ కోట్ వెళ్లిన సల్వీందర్, పోలీస్ డ్రెస్ లో కాక సివిల్ డ్రెస్ లో ఉన్నారు. తాను పోలీసు అధికారిని కాదని, సాధారణ పౌరుడినని ఉగ్రవా దులను కన్విన్స్ చేయగలిగానని సల్వీందర్ ఎన్ఐఏ అధికా రులకు చెప్పారట. పొంతన లేని సమాధానాలు చెబుతున్న సల్వీందర్, ఆయన వంట మనిషి మదన్ గోపాల్ లను బుధవారం విచారించే అవకాశాలున్నట్లు సమాచారం.



No comments:
Post a Comment