Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Tuesday, 5 January 2016

జిల్లా కేంద్రంగా భూపాలపల్లి చేసే యోచనలో ఉన్నాం : కెసిఆర్ ప్రకటన


  • కేటీపీపీలో జాతికి అంకితమైన 600 మెగావాట్ల ప్లాంటు
  • బంగారు తెలంగాణ సాధిస్తాం
  • జిల్లాకు మంచి రోజులు
  • రిజర్వాయర్లుగా గణపుర సముద్రం చిలివాగు
  • గాంధీనగర్‌లో టీఎస్ఎస్‌పీ బెటాలియన్ ఎర్పాటు

వరంగల్, మేజర్‌న్యూస్ బ్యూరో : పేదల సంక్షేమమే లక్ష్యంగా అభివ్రుద్ధి కోసం రాజీ లేని పోరాటం చేస్తూ ప్రజా దీవెనలే శ్రీరా మరక్షగా బంగారు తెలంగాణ సాధనలో ముందుకు పోతు న్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరులో 4.334 కోట్ల రూపా యలతో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) 600 మెగావాట్ల రెండో దశ విద్యుత్ ప్లాంటును మంగళవారం పైలా న్‌ను ప్రారంభించారు. అనంతరం ప్లాంటును జాతికి అంకితం చేశారు. సమైక్య రాష్ట్రంలో నీళ్లు రాక తెలంగాణకు అన్యాయం జరిగిందని, సాధించుకున్న తెలంగాణలో దేవాదుల మూడో దశ ఫేస్‌తో సుసంపన్నం చేయ నిర్ణయించామన్నారు. కాకతీయుల కాలం నాటి లక్నవరం, రామప్ప, గణపసముద్రం చెరువులను నింపడానికి గోదావరి జలాలు వచ్చే రామప్ప నుంచి కాలువలు తవ్వి గణపురం, చలివాగు ప్రాజెక్టులను రిజర్వాయర్‌లు చేసా ్తమని హామీనిచ్చారు.

అదేవిధంగా ఈ మూడు చెరువులను నింపి ఏటా రెండు పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు. వాటి కోసం ఈ సీజన్‌లోనే ఈ పనులను ప్రారంభించి వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని చెప్పారు. అదే విధంగా గోదావరి జలాలతో నిండే భీంగణపురం చెరువు చుట్టూ గ్రామాలను సస్యశ్యామలం చేసేం దుకుగాను లిఫ్ట్ ఇరిగేషన్ చేపడుతామని, వచ్చే నెలలోనే ఆ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అక్కడ లిఫ్ట్ ఏర్పాటుకు వీలు దొరికితే తానే వచ్చి శంకు స్థాపన చేస్తానన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కాకతీయ కాలువలు(డీబీఎం 38) కోసం 130 కోట్లతో మరమ్మతులు చేసి త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు. ఆ కాల్వల రిపేర్లకు ఎంత ఖర్చైనా భరిస్తామని, ప్రతి ఎకరాకు నీరందించడమే తమకు ముఖ్యమని చెప్పి ఆయన సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. కాళేశ్వరం వద్ద బ్యారేజి నిర్మాణానికి ప్రతి ఏటా 25వేల కోట్లు ఖర్చు చేస్తామని, ఈ విధంగా హామీలను క్రమక్రమంగా నెరవేరుస్తామని తెలిపారు. 

ఖరీఫ్ నుండి 9 గంటల కరెంటు : వచ్చే ఖరీఫ్ నుంచి పగటి పూట తొమ్మిది గంటల కరెంటునిస్తామని, 2018 నుంచి 24 గంటలు నిరంతరంగా కరెంటు వుంటుందని, కనీసం కనురెప్ప పాటు కూడా కరెంటు పోదని సీఎం తెలిపారు. వరంగల్ జిల్లాకు మంచి రోజులొచ్చాయని ప్రత్యేకించి కాకతీయులు పాలించిన ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివ్రుద్ధి చేస్తామని, యావత్తు తెలంగాణ జిల్లాలోనే వరంగల్ అతిపెద్ద రెండో పట్టణమని, గణపురం మండలంలోని గాంధీనగర్ వద్ద పోలీసు బెటాలియన్‌ను త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు.

భూపాలపల్లికి వరాల జల్లు : భూపాలపల్లిలో పోస్టు గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్ కళాశాల మంజూరుతో పాటు నియోజకవర్గంలో 2 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరుచేస్తామని సీఎం హామీనిచ్చారు. ఉగాది, క్రిస్మస్, రంజాన్ వంటి పండుగలను సమానంగా వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. రేషన్‌కార్డు వున్న ప్రతి కుటుంబానికి ఇక నుంచి కల్యాణలక్ష్మీ పథకం వర్తిస్తుందని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని, ఇది వారికి తీపికబురని, సీజెఎల్ఎంలను రెగ్యులర్ చేస్తామని తెలిపారు. వారు రేపటినుంచే జేఎల్ఎంలుగా నియామకమవుతారని, రాష్ట్రంలో వచ్చే సంవత్సరంలో 200 గురుకుల పాఠశాలలు నిర్మిస్తామని హామీనిచ్చారు. ప్రజలే తమకు దేవుళ్లని, వారి సహకారం దీవెనల బలంతో పురోగమిస్తున్నామని ఆయన తెలిపారు. 

అపరభగీరథుడు : అపర భగీరథుడు, కాకతీయుల వారసుడు, అభివ్రుద్ధి ప్రదాత కేసీఆర్ లాంటి సీఎంను తాను ఇంతవరకు చూడలేదని, అది తమ అద్రుష్టమని సభకు అధ్యక్షత వహించిన స్పీకర్ మధుసూదనచారి అన్నారు. ప్రతి ఇంటికి నల్లా నీరు ఇచ్చిన సీఎం, గత పాలకులు 60 ఏళ్లుగా కుంటుపరిచిన అభివ్రుద్ధిని కేసీఆర్, ఐదేళ్లలో ప్రగతిపథంలో నడుపుతారని చెప్పారు. భూపాలపల్లిని జిల్లాను చేయాలని, వెనుకబడిన ఈప్రాంతాన్ని అభివ్రుద్ధి పరచాలని ఆయన అన్నారు. ప్రత్యేక ద్రుష్టితో జిల్లా అభివ్రుద్ధికి క్రుషి చేసే ముఖ్యమంత్రి బాటలో నడిచి సంక్షేమాభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, సీతారాంనాయక్, వినోద్‌కుమార్, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, చల్లా ధర్మారెడ్డి, టి. రాజయ్య, ఆరూరి రమేశ్, శంకర్‌నాయక్, జడ్పీ చైర్మన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ప్రభాకర్, గణపురం ఎంపీపీ పోతారపు శారద తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks