యంత్ర లక్ష్మి క్రింద ట్రాక్టర్లను పంపిణి చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి . బుధవారం బాన్సువాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం వద్ద ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. యంత్ర లక్ష్మీ కార్యక్రమంలో భాగంగా గతంలో ఉన్న బడ్జెట్‌ను 200 కోట్లకు పెంచడం జరిగిందని, కేజ్‌వీల్స్ వల్ల రోడ్లు నాశనం అవుతున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయని, నాశనం అవుతున్న రోడ్ల వల్ల కోట్లాది రూపాయల నష్టం జరుగుతుందని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రోటోవేటర్ల ద్వారా వ్యవసాయం కొనసాగించేందుకు వీలుగా ఈ ట్రాక్టర్ల ద్వారా రోటోవేటర్లు, ఇతర పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో 1500ను ట్రాక్టర్ల పంపిణీ చేశామని, ప్రస్తుతం 2 వేల ట్రాక్టర్లు ఇస్తున్నట్లు తెలిపారు. కేజీవీల్స్‌ల ద్వారా కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్న విషయం తెలిసిందేనని, రోడ్లపై కేజ్‌వీల్స్ నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని, ఈ విషయంపై కేసులు నమోదు చేయాలని పోలీస్, ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. పంపిణీ చేస్తున్న ట్రాక్టర్లపై గతంలో 25 శాతం సబ్సిడీ ఉండేదని, ప్రస్తుతం ఇస్తున్న ట్రాక్టర్లకు 50 శాతం వరకు సబ్సిడీ పెంచామన్నారు. ప్రతి ట్రాక్టర్‌కు 10 లక్షల చొప్పున లోన్ సదుపాయం కల్పిస్తున్నట్లు రైతు తమ ఇష్టమైన ట్రాక్టర్‌ను తీసుకోవచ్చని, సబ్సిడీని సైతం ముందే అందజేస్తున్నట్లుగా తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయమై మాట్లాడుతూ ప్రజల్లో టిఆర్‌ఎస్ పార్టీ పట్ల అనూహ్య స్పందన లభించిందని, ప్రజలంతా ఏకపక్ష నిర్ణయంపై ఉన్నట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 80 సీట్లు సాధించే అవకాశముందని, గ్రేటర్ ప్రజలు అన్ని సౌకర్యాలు కల్పించే ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వమని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారని, గ్రేటర్‌పై గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దోన్కంటి వాణి విఠల్, నాయకులు నార్ల సురేష్‌గుప్త, అంజిరెడ్డి, జంగం గంగాధర్, ఎజాస్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .



No comments:
Post a Comment