ఎస్‌ఆర్ ఎన్‌కె న్యాక్ బృందం సందర్శన
బాన్సువాడ ఎస్‌ఆర్ ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత మూడు రోజులుగా న్యాక్ బృందం సందర్శించింది. గత మూడు రోజులుగా కళాశాలలో ల్యాబ్‌లు, పరికరాలు, క్యాంటిన్, మౌళిక సదుపాయాలు, తరగతి గదులు, పూర్వ విద్యార్థులతో చర్చ, రెగ్యూలర్, కాంట్రాక్టు అధ్యాపకులు, హెల్త్ కేర్ సెంటర్, ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర విషయాలపై పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. బుధవారం ముగింపు రోజున అందరితో కలిసి గ్రూపు ఫోటోలను దిగారు. అలాగే ప్రిన్సిపాల్‌తో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment