టీపీసీసీలో గందరగోళం
కాంగ్రెస్ నేత, నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లో దుమారాన్ని లేపాయి. విూడియా సమక్షంలో వెంకట్ రెడ్డి ప్రత్యక్ష విమర్శలు చేయటాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మొన్న సర్వే సత్యనారాయణ గాంధీభవన్ లో జానారెడ్డి విూద, పీసీసి అధ్యక్షుడు పైనా బహిరంగ విమర్శలు చేసారు. పరిస్థితి చేజా రాకముందే ఇలాంటి విమర్శలకు అడ్డుకట్ట వేయాలని పీసీసి డిసైడ్ అయ్యింది. నోరు పారేసుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి క్రమశిక్షణ సంగం నోటీసు ఇచ్చింది...
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ లో ఉంటాడో, పోతాడో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయంలో కొట్టుకుంటున్నారు. కేసీఆర్ ను కలుస్తారు.. కాని పార్టీ మారరు.. సిఎంను పొగుడుతారు .. కాని కాంగ్రెస్ లోనే కొనసాగుతారు.. హారీష్ రావు తో కలిసి టిఫిన్ చేస్తారు .... మళ్ళీ సిఎల్పీకి వచ్చి పీసీసీ అధ్యక్షుడు పై విమర్శలు చేసి, సోనియాకు లేఖ రాస్తానంటారు.. పూటకో మాట, గంటకో తీరుగా వ్యవహారిస్తుంటారు. ఆ నేతకు ఏం కావాలో స్పష్టంగా చెప్పరు. పార్టీని బతిమాలుకుంటున్నారో, బెదిరిస్తున్నారో అర్థం కాదు. ఆయన స్టాండ్ ఏమిటో తెలియక కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. మూడు నెలలకోసారి విూడియా ముందుకు రావడం ఏదో ఒకటి మాట్లాడటం ఆయన నైజం. ఇన్ని రోజులు అమెరికాలో జాలీగా గడిపివచ్చిన కోమటిరెడ్డి వచ్చి రాగానే మరో సారి రాజకీయ నాటకానికి తెర తీశారు.టీఆర్‌ఎస్ లో చేరతారనే ప్రచారం మధ్య హారీష్ రావు కలిసిన కోమటిరెడ్డి.. తన వైఖరి ఏంటో చెప్పలేదు. పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై తనకు ఉన్న వ్యతిరేకతను బయట పెట్టిన ఆయన కాంగ్రెస్ భవిష్యత్తుపైన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నాయకత్వాన్ని మార్చాలని ఆయన చెప్పకనే చెప్పారు. తనకు పీసీపీ ఛీప్ బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్ రాతను మార్చి పారేస్తానంటు చెప్పె ప్రయత్నం చేశారు. కాని ఆయన పార్టీలో కొనసాగుతారా ,లేదా అన్న దానిపైన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పార్టీ నుంచి గెంటివేయించుకొని టీఆర్‌ఎస్ లో చేరే ప్రయత్నాల్లో కోమటిరెడ్డి ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. వీలైనంతగా కాంగ్రెస్ ను, పీసీపీ ఛీప్ ను దెబ్బతీసి గులాబీ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ వ్యూహాంలో భాగంగానే కోమటిరెడ్డి పార్టీపైన దాడికి దిగారని నాయకులు అనుమానిస్తున్నారు.
పోవాలనుకుంటే కాంగ్రెస్ ను వెంటనే వదిలేయాలని, ఉండి క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడితే సహించమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలపైన అధిష్టానం జోక్యం చేసుకునే అవకాశముంది. ఇప్పటికే కోమటిరెడ్డి వ్యాఖ్యలను.. సీఎల్పీ నేత జానారెడ్డి, మల్లు రవి ఖండించారు. వెంకటరెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా ఇతర నేతల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై వారంలోగా వివరణ ఇవ్వాలని కోరింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
టీపీసీసీ పంపిన షోకాజ్ నోటీసులను తాను లెక్కచేయనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. అసలు పీసీసీకి షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం లేదంటున్నారు. ఉత్తమ్‌కి పీసీసీ ఇచ్చినందుకు పార్టీ నామరూపం లేకుండా పోతుందని మరోసారి విమర్శించారు. ఈ విషయాన్ని 16 మాసాల కిందటే తాను చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎవ్వరికీ సరైన గౌరవం ఇవ్వరని, నల్గొండ జిల్లాలో జానారెడ్డి, పాల్వాయి, ఉత్తమ్ కంటే తానే సీనియర్ నేతనని అంటున్నారు. తాను టిఆర్‌ఎస్ లో చేరుతానని చెప్పలేదంటున్నారు.
ఇటీవల పార్టీ మారిన పలువురు నేతలు కూడా పార్టీ నాయకత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. పొంగులేటి, సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇలా విమర్శలు చేసే వారు నేరుగా పీసీసీ అధ్యక్షుడు పై విమర్శలు చేస్తున్నారు. మరి పార్టీ అధిస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

No comments:
Post a Comment