కొనసాగుతున్న జాట్ ల అందోళన
హిస్సార్, జూన్ 6,
హర్యానాలో 9 జిల్లాలు అట్టుడుకుతున్నాయి.. జాట్లు రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని మళ్ళీ ప్రారంభించడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తమకు రిజర్వేషన్లను 15 రోజుల్లోగా అమలు చేయాలని జాట్లు హర్యానా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.జాట్లు ఈసారి పట్టణాల్లో కాకుండా గ్రావిూణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హిస్సార్ జిల్లాలోని మయ్యర్, భివానీ జిల్లాలో ధనానా, రోహ్‌తక్ జిల్లాలోజసియా, పానిపట్ జిల్లాలో మత్లోడ, రేవారి జిల్లాలో బేవల్ గ్రామాల్లో నిరసనలు ప్రారంభించారు. మరో వైపు శాంతిభద్రతలను కాపాడేందుకు 55 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు.
9 జిల్లాల్లో సీఆర్‌పీసీ సెక్షన్ 144ను విధించారు. ఎక్కడైనా ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కు మంది గుమిగూడి ఉండకూడదని పేర్కొన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, రైల్వే ట్రాకుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రోహ్‌తక్, జజ్జర్, సోనిపట్, జింద్, భివా?న, హసార్, ఫతేబాద్, పానిపట్, కైతల్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
సోనిపట్ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సర్వీసులను నిషేధించారు. రోడ్ల దిగ్బంధం, ఆస్తుల విధ్వంసం, ప్రాణ హాని వంటి చట్టవిరుద్ధ సంఘటనలు ఇంటర్నెట్ ద్వారా జరగకుండా జాగ్రత్త తీసుకోవడానికే ఈ విధంగా నిషేధ: విధించినట్లు తెలుస్తోంది.జాట్లకు రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతో జాట్లలోని ఓ వర్గం రిజర్వేషన్ల పోరాటాన్ని మళ్ళీ ప్రారంభించింది.

No comments:
Post a Comment