Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 30 July 2016

2000 లో పరీక్ష... 2016లో పోసింగ్‌

 2000 లో పరీక్ష... 2016లో పోసింగ్‌
విజయవాడ, జూలై 30,  
పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ నాన్చుడు ధోరణి వల్ల ఉద్యోగాలు వచ్చేసరికి వయసు విూరిపోతోంది. దశాబ్దాల తరువాత వచ్చే ఉద్యోగాలకు వెళ్లలేని వారు కూడా పెరిగిపోతున్నారు. పిల్లల ఉద్యోగాల వేటలో ఉండాల్సిన తల్లిదండ్రులు కూడా తమ ఉద్యోగ అవకాశాలపై ఆశలు వదులుకోలేకపోతున్నారు. తాజాగా జరుగుతున్న ఘటనలు కూడా ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఎప్పుడో 1999లో ఇచ్చిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌కు సంబంధించి 2000 సంవత్సరంలో పరీక్షల నిర్వహణ, అదే ఏడాది ఫలితాల వెల్లడి కూడా జరిగింది. అయితే కోర్టు కేసులు, వాటిని పట్టించుకోవడంలో అప్పటి ఎపిపిఎస్‌సి పెద్దల నిర్లిప్తత వంటి కారణాలతో దాదాపు 16 ఏళ్లపాటు ఉద్యోగాల కల్పన జరగలేదు. చివరకు అన్ని పరిష్కారం కావడంతో తాజాగా అర్హులైన వారికి ఏయే శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తున్న జాబితాను విడుదల చేశారు. దీంతో అనేక మంది అభ్యర్ధుల్లో ఆనందం కనిపిస్తున్నప్పటికీ... మరికకొంతమందిలో నిర్లిప్తత చోటుచేసుకుంటోంది. వారిలో అనేక మంది ప్రస్తుతం ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్‌ అయిపోయారు. ఇప్పుడు ఎపిపిఎస్‌సి ప్రకటించిన శాఖల్లో ఉద్యోగాలకు వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదని, పైగా కొత్త అంశాలను మొదటి నుంచి నేర్చు కోవాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. కొత్త ఉద్యోగంలో సీనియార్టీకి అమలు చేస్తున్నప్పటికీ... ప్రస్తుతం చేస్తున్న ఉద్యో గాన్ని వదులుకునేందుకు వారు ఇష్టపడడంలేదని తెలుస్తోంది. ఇటువంటి వారు సచివాలయంలో కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. చాలామంది సెక్షన్‌ అధికారుల స్థాయిలో, ఇంకొంతమంది అసిస్టెంట్‌ సెక్రటరీ స్థాయిల్లో కూడా ఉన్నారు. వారంతా ఎపిపిఎస్‌సి ఉద్యోగాలకు వెళ్లకూడదనే నిర్ణయించుకున్నారు. ఇలా ఉండగా, తాజాగా ప్రకటించిన జాబితా తప్పుల తడకగా ఉందన్న విమర్శలు వస్తు న్నాయి. ఒకే అభ్యర్ధికి రెండు ఉద్యోగాలు ఇస్తు న్నట్లు కూడా ఎపిపిఎస్‌సి ప్రకటనలో ఉందని అంటున్నారు. ప్రకటించిన జాబితాను ఆన్‌లైన్‌ నుంచి తొలిగించారు. త్వరలోనే తప్పును సరిదిద్ది మళ్లీ జాబితా ప్రకటించాలని భావిస్తున్నారు. కాగా, జాబితాలో కీలక శాఖలకు ఎంపికైన వారు ఆ ఉద్యోగాల్లో చేరేరదుకు విముఖత చూపిస్తుండడంతో జాబితాలో దిగువన ఉన్నవారు పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అనర్హులుగా మిగిలిన వారిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారు అర్హుల జాబితాలో స్థానం సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పది వేల ఉద్యోగాలకు సంబంధించి విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఎపిపిఎస్‌సి కస రత్తు ప్రారంభించింది. ముందుగా ఇంజనీర్ల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయిం చినట్లు ఎపిపిఎస్‌సి కార్యదర్శి గిరిధర్‌ చెప్పారు.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks