మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకవైపు విత్తన పత్తి (సీడ్ కాటన్) సాగు విస్తరిస్తుండడం ఆనందంగా ఉన్నా, మరోవైపు ఏజెంట్ల ప్రమేయం పెరుగుతుండడం అన్నదాతకు కష్టాలను మిగులుస్తోంది. ఆర్గనైజర్లకు, కంపెనీలకు సిరులు కురిపిస్తున్న ఈ పంట, కష్టించిన పండించిన కర్షకునికి నష్టాలను తెచ్చి పెడుతోంది. 450 గ్రాముల ఫౌండేషన్ సీడ్ విత్తనాల సంచిని రైతులకు రూ.1500కు అమ్ముతున్న కంపెనీలు, అదే విత్తనాలను అన్నదాతల నుంచి రూ.500కు మించి కొనకపోవడమే ప్రధాన కారణం. సీడ్ పత్తి సాగులో ఏజెంట్ల పాత్రను నిరోధించి, ప్రభుత్వ అజమాయిషీలో రైతులకు, కంపెనీలకు మధ్య ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తప్ప సీడ్ పత్తి పాలమూరు రైతులకు ఫలాలను అందించలేదు.
సీడ్ కాటన్ కేంద్రంగా మహబూబ్‌నగర్
సమశీతోష్ణస్థితి కలిగి, భూసారమున్న, నీరు నిల్వని నల్ల, ఎర్ర నేలలున్న మహబూబ్‌నగర్ జిల్లా సీడ్ కాటన్ సాగుకు ప్రసిద్ధిగాంచింది. దశాబ్దకాలం క్రితం కంపెనీలు ప్రయోగాత్మకంగా జిల్లాలో మొదలెట్టిన ఈ సాగు ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యప్రాంతమైన గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని గద్వాల, మల్దకల్, ధరూర్, అయిజ, ఇటిక్యాల, కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట మండలాల్లో సీడ్ పత్తి సాగవుతోంది. గతేడాది జిల్లాలో సుమారు 60వేల ఎకరాల్లో కాటన్‌సీడ్ సాగు చేయగా, సీడ్ ఆర్గనైజర్లు (ఏజెంట్లు), రైతులకు మధ్య ఒప్పందాలు సరిగాలేక, ఈ యేడాది సాగు తగ్గింది. సుమారు 35వేల ఎకరాలకే సీడ్‌పత్తి పరిమితమైంది.
కుచ్చుటోపీ పెడుతున్న కంపెనీలు
దాదాపు 10 పత్తి విత్తన కంపెనీలు జిల్లా రైతులచే సీడ్ పత్తిని పండిస్తున్నాయి. కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకోకుండా, ఆర్గనైజర్ల(ఏజెంట్లు)తో వ్యవహారాన్ని నడిపిస్తున్నాయి. రైతుకు, కంపెనీకి మధ్య నేరుగా ఒప్పందం లేకపోవడం, వీరి మధ్య ఒప్పందానికి ఎలాంటి సాధికారత లేకపోవడంతో రైతులు దగాపడాల్సి వస్తోంది. విత్తన సరఫరా మొదలు పంట చేతికొచ్చి కంపెనీకి గింజలు అప్పగించేంత వరకు ఏజెంట్లు ఆడిందే ఆటగా సాగుతోంది. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి, పండించిన తర్వాత కూడా జర్మినేషన్ (మొలక శాతం) పేరుతో రైతులను ఏజెంట్లు దోచుకుంటున్నారు. పండించిన గింజలకు ముందస్తు ఒప్పందం ఒకలా ఉంటే, చివరకు విత్తనాలు ఏజెంట్ల చేతికి వెళ్లాక జర్మినేషన్ రాలేదంటూ ధరలో కోత విధిస్తున్నారని, దీంతో అప్పుల పాలవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
అమ్మేది రూ.1500కు.. కొనేది రూ.500కు
సీడ్ పత్తి విత్తనాల ఉత్పత్తిలో రైతులతో కంపెనీలు, ఏజెంట్లు చెలగాటమాడుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన మూల విత్తనాలను (ఫౌండేషన్ సీడ్స్) 450 గ్రాముల ప్యాకెట్ రూ.1500కు రైతులకు ఇస్తారు. పంట పండిన తర్వాత అవే విత్తనాలను, అదే సైజు ప్యాకెట్‌ని రైతుల వద్ద నుంచి రూ.500కు లోబడి కొంటున్నారు. ఒక్క ఎకరాకు రెండు సంచుల విత్తనాలు నాటుతారు. క్వింటాల్ పత్తి దిగుబడిలో కనీసం 60 కేజీల విత్తనాలు వస్తాయి. ఒక ఎకరాకు తక్కువలో తక్కువ కనీసం 6 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చినా 360కేజీల విత్తనాలు ఉత్పత్తవుతాయి. ఈ లెక్కన ఒక ఎకరాకు 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్లు 800 వరకు ఉత్పత్తవుతాయి. ఈ లెక్కన ఒక ఎకరా సాగు చేసే రైతు ఎంత నష్టపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
సీడ్ పత్తి సాగులో కష్ట నష్టాలెన్నో
సాధారణ పత్తి సాగుని బీటీ రకాలు ఆక్రమించిన తర్వాత క్షేత్రస్థాయిలో సాగు సులువైంది. మూడు మాసాల వరకు పచ్చ పురుగు రాకపోవడం, దోమపోటు నియంత్రణలోఉండడం లాంటి సానుకూల అవకాశాలతో తక్కువ కూలీలు, శ్రమతో బీటీ పత్తి పండుతుంది. సీడ్ పత్తి సాగు మాత్రం ఇందుకు భిన్నంగా కొంత శ్రమతో కూడుకుంది. ఆయా కంపెనీలిచ్చిన మూల విత్తనాల్లో ఆడ, మగ విత్తనాలను వేర్వేరుగా నాటాల్సి ఉంటుంది. 85 నుంచి 90శాతం ఆడ విత్తనాలు నాటితే కనీసం 10నుంచి 15శాతం మగ విత్తనాలను నాటుతారు. మొక్కలు పూతదశకు వచ్చినప్పుడు మగ విత్తనాలకు చెందిన పుష్పాలను ఉదయాన్నే తెంచి, ఆడ మొక్కల పుష్పాలపై చల్లాల్సి ఉంటుంది. ప్రతి ఆడమొక్క తల భాగాలపై, పుష్పాలపై పడేలా జాగ్రత్తగా ఈ ప్రక్రియ కొనసాగాల్సి ఉంటుంది. దీంతో పాటు దోమపోటు, తెగుళ్లు, పురుగుల తాకిడి నివారణకు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇలా విత్తనం నాటింది మొదలు, పత్తి తీత వరకు సీడ్ పత్తి సాగులో రైతులు అడుగడుగునా శ్రమ, ధనం వెచ్చించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ జోక్యంతోనే ఏజెంట్లకు చెక్
తెలంగాణ రాష్ట్రం మొత్తంగా సీడ్‌పత్తి సాగులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టాలి. అప్పుడే సీడ్‌పత్తి సాగు రైతులకు ఉపయోగకరమవుతుంది. కంపెనీలకు, రైతులకు మధ్య జరిగే ఒప్పందాల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. సీడ్‌పత్తి సాగుకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన విధానాన్ని రూపొందించి, ఖచ్చితంగా అమలు చేస్తే కర్షకులకు ప్రయోజనం కలుగుతుందని రైతు సంఘం నాయకులు అంటున్నారు. సీడ్‌పత్తి సాగుని శాసిస్తున్న ఏజెంట్లను నిరోధిస్తే తప్ప జిల్లాలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, నేలలు జిల్లా రైతాంగానికి ఉపయోగపడవని చెబుతున్నారు.

No comments:
Post a Comment