Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Sunday, 4 January 2015

కరీంనగర్‌: ముందుచూపు కరువు

 రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్యను తగ్గిం చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రా ల ద్వారా గర్భిణులు, బాలింతలకు కేంద్రాల వద్ద ఒక పూట భోజనంతోపాటు ప్రతిరోజు పాలు, గుడ్లు అందించేందుకు ఆరంభించిన వన్‌ పుల్‌ మీల్‌ పథ కం నిర్వహణకు వంట పాత్రలు సరఫరా చేయకపో వడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇ బ్బందులకు గురవుతున్నారు. ఈనెల ఒకటవ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం ఆరంభించింది. డి సెంబర్‌ 15వ తేదీ నుంచి పథకాన్ని ఆరంభిస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించినా కూడా ప్రాజెక్టు అ ధికారులు వంట సామగ్రి కొనుగోలు విషయమై తే రుకోలేదు. కేంద్రాల్లో అవసరమేయ్యే వంట పాత్రల గురించి ప్రతిపాదనలు తీసుకుని పాత్రలను సరఫ రా చేయాల్సిన అంగన్‌వాడీ ప్రాజెక్టు అధికారులు అ వేమీ పట్టించుకోకుండానే పథకాన్ని ఆరంభించారు. జిల్లాలోని 16అంగన్‌వాడీ ప్రాజెక్టుల పరిధిలో 3573 అంగన్‌వాడీ కేంద్రాలు, 145మినీ అంగన్‌వాడీ కేంద్రా లున్నాయి. వీటి పరిధిలో గర్భిణులు 28,081 మంది, బాలింతలు 28,693 మంది ఉన్నారు. 7నెలల నుంచి 3సంవత్సరాల వయస్సుగల పిల్లలు 1,13,013 మంది ఉన్నారు. 3నుంచి 6సంవత్సరాల వయస్సుగల పిల్ల లు 47,539 మంది పిల్లలున్నారు. గత ప్రభుత్వ హ యాంలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృత హస్తం పథకం నవంబర్‌ నెలాఖరు వరకు జిల్లాలోని6 అంగన్‌వాడీ ప్రాజెక్టులు మంథని, మల్యాల, మ హదేవ్‌పూర్‌, గంగాధర, భీమదేవరపల్లి, హుస్నాబా ద్‌లో అమలయ్యింది. డిసెంబర్‌ 1 నుంచి కరీంనగర్‌ అర్బన్‌, కరీంనగర్‌ రూరల్‌, రామగుండం, సుల్తానా బాద్‌, మెట్‌పల్లి, హుజూరాబాద్‌, సిరిసిల్ల, వేముల వాడ, మెట్‌పల్లి, జగిత్యాల ప్రాజెక్టుల్లో ఇందిరమ్మ అ మృత హస్తాన్ని ఆరంభించేందుకు సన్నాహాలు చేశా రు. ఆ తర్వాత ఇందిరమ్మ అమృత హస్తం పథకం పై పునరాలోచన చేసిన ప్రభుత్వం ఆ పేరును తొల గించి డిసెంబర్‌ 15నుంచి వన్‌ పుల్‌ మీల్‌ పథకాన్ని ఆరంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు అందుకు కావాల్సిన బడ్జెట్‌ను విడుదల చేస్తూ అన్ని జిల్లాల ఐసీడీఏఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. అయితే జిల్లాలో మాత్రం ఈనెల 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులకు గతంలో నెలకు 25 రోజులు మాత్రమే 200 మిల్లీలీటర్ల చొప్పున పాలు, కోడిగుడ్లు ఇచ్చేవా ళ్లు. కొత్తగా అమలు చేస్తున్న పథకం ద్వారా ప్రతి రోజు కోడిగుడ్డు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రా ల్లోనే మధ్యాహ్నం వేళలో ఆకు కూరలు, పప్పులు, సాంబారుతో భోజనం, ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వ నున్నారు. సోమ, మంగళ వారాల్లో కోడిగుడ్డు కూర, పెరుగు అందించనున్నారు. 7నెలల నుంచి 3 సంవ త్సరాల వయస్సుగల పిల్లలకు ఇంతకుముందు వా రానికి రెండు చొప్పున నెలకు 8కోడిగుడ్లు ఇచ్చేవారు. ప్రస్తుతం రోజుకు ఒక కోడిగుడ్డు ఇవ్వనున్నారు. 3 నుంచి 6సంవత్సరాలు గల పిల్లలకు వారానికి 4 చొ ప్పున నెలకు 16కోడిగుడ్లు ఇవ్వనున్నారు. ఆదివారం అంగన్‌వాడీ కేంద్రాలు మూసిఉండడంతో ఆదివారం ఇవ్వాల్సిన కోడిగుడ్లను శనివారం ఇవ్వనున్నారు. కొ త్తగా రూపొందించిన మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలకు పోషక విలువలుగల సంపూర్ణ భోజ నంతో పాటు పాలు, కోడిగుడ్లు ఇవ్వడం వల్ల మా తా, శిశు మరణాలు తగ్గనున్నాయి. బలం కోసం తీ సుకుని 100 ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వాడాల్సిన అవసరం లేకుండా పోనున్నది. అంగన్‌వాడీ కేంద్రా ల్లో బాలింతలు, గర్భిణుల సంఖ్య మరింత పెరగను న్నది. పిల్లలకు రోజుకు కోడి గుడ్లు ఇవ్వడం వల్ల పి ల్లలు కూడా త్వరితగతిన ఎదగనున్నారు. 6 ప్రాజెక్టు లు మినహా మిగతా 10 ప్రాజెక్టుల్లో గల అంగన్‌వా డీ కేంద్రాలకు ఒకటి 5కిలోల గంజు, ఒకటి 3 కిలోల గంజు, అన్నం వడ్డించేందుకు 2 స్టీల్‌ బేసిన్లు, ఒక స్టీల్‌ బకెట్‌, 2 సాంబారు గంటెలు, ఒక స్టీల్‌ బిందె, స్టీల్‌ పల్లెములు అందించాల్సి ఉండగా ఇంతవరకు వాటిని కేంద్రాలకు సరఫరా చేయకపోవడంతో అంగ న్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా ఆ పాత్రలను ఇత రుల నుంచి తీసుకవచ్చి వడ్డిస్తున్నారు. ఒక్కో కేంద్రా నికి 10 నుంచి 20 మంది వరకు గర్భిణీ సీ్త్రలు, బాలింతలు వస్తున్నారు. వారు ఇళ్ల వద్ద నుంచి ప్లేట్లు తీసుకుని వచ్చేందుకు ఇబ్బందులు పడుతు న్నారు. ఈ విషయమై ప్రాజెక్టు అధికారులు సత్వ రమే స్పందించి అంగన్‌వాడీ కేంద్రాలకు వంట సా మగ్రిని సరఫరా చేయాలని కార్యకర్తలు, ఆయాలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks