బడుగులకు సంక్షేమ పథకాలు వరం
పేదల కడుపు నింపేందుకే ‘ఆహార భద్రత’ పథకం
మెదక్ ఎంపీ కేపీఆర్
దౌల్తాబాద్: పేదల సంక్షేమమే ప్రభుత్వ అభిమతమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారన్నారు. ప్రతి పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టేందుకే ఆరు కిలోల బియ్యం అందిస్తున్నారని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఆహార భద్రతా కార్ఢులు, పింఛన్లు అందిస్తున్నారని అన్నారు. అలాగే హైదరాబాద్‌లో సిగ్నల్స్ లేని నగరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులను తీసుకువచ్చి గ్రామాలాభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. కాగా దౌల్తాబాద్ గ్రామాభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ వినతీపత్రం అందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాదవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదివేణుగోపాల్, పీఏసీఎస్ ఛైర్మన్ యాదవరెడ్డి, నాయకులు భూపాల్‌రెడ్డి, రామస్వామిగౌడ్, రాజిరెడ్డి, శ్రీనివాస్, వేమ శ్రీనివాస్, ముత్యాలు గౌడ్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment