భారత జలాల్లోకి ప్రవేశం... పట్టుకునేందుకు రెండు నౌకలు పంపిన కోస్ట్‌గార్డ్
డిసెంబర్ 31 రాత్రి రెండు పడవల రాక
నిఘాలో తప్పించుకున్న మరో పడవ
కోస్ట్‌గార్డ్ ముమ్మర గాలింపు
ఈసారి కూడా టార్గెట్ ముంబైనే
ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానం
అసలు మా బోట్లే సముద్రంలోకి వెళ్లలేదు : పాకిస్థాన్
గాంధీనగర్, ఇస్లామాబాద్, జనవరి 3: కరాచీ నుంచి మరో రెండు అనుమానాస్పద బోట్లు భారత జలాల్లోకి వచ్చాయి. వాటిని పోర్‌బందర్ తీరంలో కోస్ట్‌గార్డ్ అధికారులు గుర్తించారు. ఆ రెండు బోట్ల మధ్య జరిగిన అనుమానాస్పద రేడియో కమ్యూనికేషన్‌ను జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చి ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌వో) అడ్డుకుని వింది. ఆ సమాచారాన్ని కోస్ట్‌గార్డ్‌కు అందించింది. దాంతో, ఆ రెండు పడవలను పట్టుకునేందుకు కోస్ట్ గార్డ్ రెండు నౌకలను పంపించింది. కాగా, వచ్చే వారంలో గుజరాత్‌లో ప్రవాసీ భారతీయ దివస్, వైబ్రెంట్ గుజరాత్ సదస్సులు జరగనున్నాయి. వీటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు విదేశీ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, తీరం వెంబడి నౌకలు, హెలికాప్టర్లు, విమానాలతో కోస్ట్ గార్డ్ నిఘాను తీవ్రతరం చేసింది. కాగా, ఈసారి కూడా ఉగ్రవాదుల టార్గెట్ ముంబై నగరమేనని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
ఆ పడవ ఏమైంది!?
పాకిస్థాన్ నుంచి గుజరాత్ తీరానికి రెండు బోట్లు వచ్చాయా!? ఒక బోటులోని ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నా.. మరో బోటు ఏమైంది!? ప్రభుత్వ వర్గాల్లో వెల్లువెత్తుతున్న అనుమానాలివి! ఆ రెండో బోటు కోసం ఇప్పుడు కోస్ట్‌గార్డ్ అన్వేషణ తీవ్రతరం చేసింది. మొదటి బోటును చూసినప్పుడే రెండో బోటును కూడా కోస్ట్‌గార్డ్ అధికారులు చూశారు. అది కూడా కేతి బందర్ పోర్టు దిశగా వెళ్లినట్లు భావిస్తున్నారు. భారత సముద్ర తీరంలోని చేపల బోట్లలో కలిసిపోయేందుకు రెండో బోటు ప్రయత్నించిందని భావిస్తున్నారు. కోస్ట్‌గార్డ్ దృష్టి నుంచి తప్పించుకోవడానికి రెండో బోటు ప్రయత్నించిందని, అయితే, అది ఎక్కడ ఉందనే విషయాన్ని కోస్ట్‌గార్డ్ విమానం పసిగట్టిందని, దాని ఆనుపానులపై దృష్టి సారించిందని అత్యంత విశ్వసనీయ వర్గాలు వివరించాయి. దీనికి సంబంధించి మరో కథనం కూడా వినిపిస్తోంది. మొదటి బోటును కోస్ట్‌గార్డ్ అనుసరిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే.. రెండు బోట్లను పంపిన లష్కరే తాయిబా రెండో బోటును వెనక్కి వచ్చేయమని ఆదేశించిందని, దాంతో రెండో బోటు తిరిగి పాకిస్థానీ జలాల్లోకి వెళ్లిపోయి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థానీ జలాల్లో ఉన్న రెండో బోటుపై నిఘా ఉంచడం చాలా రిస్క్‌తో కూడినదని వివరిస్తున్నాయి. కాగా, కరాచీ నుంచి రెండు బోట్లు వస్తున్నాయంటూ డిసెంబర్ 30వ తేదీనే ఎన్‌టీఆర్‌వో కోస్ట్‌గార్డ్‌కు సమాచారం ఇచ్చింది. ఆ రెండు బోట్లు ఎక్కడ ఉన్నాయనే నిర్దిష్ట సమాచారాన్ని కూడా ఇచ్చింది. దాంతో 30వ తేదీ నుంచే కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు సముద్రంపై నిఘా వేశాయని, అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిఘాను కొనసాగిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ముమ్మర గాలింపు
తమను తాము పేల్చేసుకుని సముద్రంలో మునిగిపోయిన అనుమానాస్పద బోటు శకలాలు, అందులోని నలుగురి మృతదేహాల కోసం కోస్ట్‌గార్డ్ ముమ్మరంగా గాలిస్తున్నామని కోస్ట్ గార్డ్ కమాండర్ (వాయవ్య ప్రాంతం) కుల్దీప్ సింగ్ షెరాన్ తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఆ బోటు భారత జలాల్లోకి ఎందుకు వచ్చింది!? వాళ్లు మత్య్సకారులా? ఉగ్రవాదులా? అనే అంశంపై తుది నిర్ణయానికి రావడానికి దర్యాప్తు అధికారులకు ఈ సమాచారం కీలకంగా మారనుందని వివరించారు. సముద్రంలో మరో రెండు బోట్లు ఉన్నాయన్న సమాచారం తమకు లేదని షెరాన్ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి పేల్చేసుకున్న బోటులోని వ్యక్తులు అసలు మత్య్సకారుల్లా కనిపించలేదని, ఆ బోటులో వలలు కూడా లేవని వివరించారు. అనుమానాస్పద బోటు భారత జలాల్లోకి రావడాన్ని చూశామని, దాంతో రాజరతన్ నౌకను పంపామని, అందులోని అధికారులు హెచ్చరికగా కాల్పులు జరిపారన్నారు. అయినా ఆ బోటులోని వారు ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని తెలిపారు. కాగా పాకిస్థానీ బోటు ఒకటి పేలుడు పదార్థాలతో కరాచీ నుంచి భారత జలాల్లోకి వచ్చి.. కోస్ట్‌గార్డ్ అడ్డుకోవడంతో పేల్చేసుకుందని వచ్చిన కథనాలను పాకిస్థాన్ ఖండించింది. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీ మధ్య రాత్రి అసలు అటువంటి ఘటన ఏదీ జరగలేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తస్నిమ్ అస్లాం వ్యాఖ్యానించారు. కరాచీ నుంచి అసలు పడవలేవీ సముద్రంలోకి వెళ్లనే లేదని చెప్పారు. డిసెంబర్ 31వ తేదీన ఇద్దరు పాకిస్థానీ జవాన్లను భారత సైన్యం చంపేసిందని, దాని నుంచి దృష్టి మళ్లించడానికే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని పాకిస్థాన్ రక్షణ శాఖ అధికారులు ఆరోపించారు.
వాస్తవాలు చెప్పండి: కాంగ్రెస్
గుజరాత్ తీరంవైపు అనుమానాస్పదంగా పాకిస్థాన్ పడవ రావడంపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని శనివారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ పడవ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినదో ప్రభుత్వం ప్రకటించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ‘‘అరేబియా సముద్ర జలాల్లోకి వచ్చిన పడవ ఉగ్రవాదులకు చెందినదిగా ప్రభుత్వం ఎలా నిర్ధారణకు వచ్చింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దీని వెనుక ఏ ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది’’ అని అజయ్ ప్రశ్నించారు. కాగా, ఈ పడవలోని ఒకరినైనా సజీవంగా పట్టుకుని ఉంటే బాగుండేదనీ, కసబ్ తరహాలో పాక్ దుశ్చర్యలను మరోసారి ఎండగట్టేందుకు భారత్‌కు అవకాశం చిక్కేదనీ గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శక్తిసిన్హ్ గోహిల్ అన్నారు.

No comments:
Post a Comment