శాస్త్రవేత్తలు వర్సిటీలకు వెళ్లి బోధించాలి
సైన్సును విద్యార్థులు ఇష్టపడి చదివేలా చేయండి
శాస్త్ర సాంకేతిక రంగాలకు అగ్ర ప్రాధాన్యం
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో మోదీ పిలుపు
ముంబై, జనవరి 3: శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు, ఆవిష్కారాలకు తమ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం ముంబైలో 102వ భారత సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన ప్రసంగించారు. దేశంలో బ్యూరోక్రాటిక్ ఇబ్బందులు లేకుండా వ్యాపారం సజావు గా సాగడం ఎంత ముఖ్యమో శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధన సాఫీగా సాగడం కూడా అంతే ప్రధానమని ప్రధాని చెప్పారు. విశ్వవిద్యాలయాలకు మరింత స్వయంప్రతిపత్తి కల్పిస్తూ విద్యాసంబంధమైన వ్యవహారాలలో ఇంకా స్వేచ్ఛ ఇచ్చేందుకు కృషి చేస్తామనీ, రెడ్‌టేపిజం లేకుండా చూస్తామనీ మోదీ శాస్త్రవేత్తలకు హామీ ఇచ్చారు. వివిధ కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం కేటాయించే పెట్టుబడులను శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలతో ఇంటర్నెట్ అనుసంధానం చేయాలనీ, ఇది విద్యార్థినీవిద్యార్థుల ‘మౌలిక హక్కు’ అని మోదీ అన్నారు. మన సమాజంలో సైన్సు పట్ల ప్రజలలో మళ్లీ ఆసక్తి, అవగాహన పెంచేందుకు, ముఖ్యంగా బాలలు సైన్సు సబ్జెక్టును ఇష్టంగా చదివేలా వారిలో ప్రేరణ కలిగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యావిషయ అంశాలపై పరిశోధనలకు నిధుల కొరత రానీయబోమని హామీ ఇచ్చారు. ‘‘ఇకనుంచి పరిశోధనా ప్రాజెక్టులకు నిధుల విడుదల ప్రతిపాదనలపై నిర్ణయాలు ఎంతమాత్రం జాప్యం కావు. మన దేశంలో మళ్లీ సైన్సు, శాస్త్రవేత్తల కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించాలి. పరిశోధనలకు చేయూతనిచ్చేందుకు నాకన్నా మెరుగైన వ్యక్తి మరొకరు దొరకరు’’ అని ప్రధాని హామీ ఇచ్చారు. బాలబాలికలలో టెక్నాలజీ పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
భారీగా ప్రాణనష్టాన్ని నివారించాం
‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ‘మంగళ్‌యాన్’ ప్రయోగాన్ని తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా పూర్తి చేశారని ప్రధాని ప్రశంసించారు. విశాఖ తీరాన్ని తాకిన హుద్‌హుద్ తుఫాన్ కదలికలను భారతీయ శాస్త్రవేత్తలు కచ్చితంగా అంచనా వేయడం వల్లే వేలాది మంది ప్రాణనష్టాన్ని నివారించగలిగామని చెప్పారు.

No comments:
Post a Comment